Fashion Jewelry
-
Fashion: అప్పుడప్పుడైనా ప్రయోగాలు చేయాలి: కళ్యాణి
కళ్యాణీ ప్రియదర్శన్.. లిజీ, ప్రియదర్శన్ కూతురిగా సినిమా రంగంలోకి ప్రవేశించినా నిలబడింది మాత్రం తన కళతోనే. అభినయ కౌశలం, గ్లామర్ మెరుపు.. దేన్నయినా పోషిస్తున్న పాత్రకనుగుణంగా తెర మీద సాక్షాత్కరింప చేస్తుంది. సినిమా స్క్రీన్కు అతీతంగా ఆమెను అందంగా చూపిస్తున్న.. అంతే క్యాజువల్‌గా, సౌకర్యంగా ఫీలయ్యేలా చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. ఫాబియానా తూర్పు (ఇండియా), పశ్చిమ (యూరప్)ల ఫ్యాషన్ కలయిక ఈ బ్రాండ్. పెళ్లిళ్లు, పండగలు వంటి వేడుకలకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. దీని సృష్టికర్త, డిజైనర్ కరిష్మా. నిజానికి ఈ బ్రాండ్ ఆవిష్కరణకు ఆద్యురాలు కరిష్మా వాళ్లమ్మ కుసుమ్. యురోపియన్ ఫ్యాబ్రిక్స్, రాజస్థాన్ సంప్రదాయపు అద్దకం బాంధనీ ప్రింట్, లక్నో సంప్రదాయపు ఎంబ్రాయిడరీ చికన్కారీల సమ్మేళనమే ఈ బ్రాండ్ ప్రత్యేకత... ఈ బ్రాండ్‌కు వాల్యూ కూడా. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చదివిన కరిష్మా ఈ మధ్యే పురుషుల కోసమూ డిజైనర్ వేర్‌ను మొదలుపెట్టింది. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరెట్ అయిన ఈ బ్రాండ్.. నచ్చిన ఫ్యాబ్రిక్ మీద, నచ్చిన తీరులో డిజైన్ చేయించుకునే సౌలభ్యాన్నీ కల్పిస్తుంది. ధరలూ అంతే ప్రత్యేకంగా ఉంటాయి. అయితే తన బ్రాండ్‌ను సామాన్యులకూ అందుబాటులో ఉంచేందుకు ఆర్గంజా, హ్యాండ్ ప్రింట్స్‌తో డిజైన్ చేసిన దుస్తులను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది కరిష్మా. రాధికా అగ్రవాల్ స్టూడియో ఆధునిక మహిళకు భారతీయ కళల భూషణం ఈ బ్రాండ్. చిత్రలేఖనం, సంగీతం, ఇక్కడి ప్రజలు, ప్రాంతాలు .. అన్నిటినీ చూసి, విని, పర్యటించి స్ఫూర్తి పొంది .. సృష్టించిన బ్రాండే ఇది. సృష్టికర్త రాధికా అగ్రవాల్. దేశంలోని విభిన్నత, వైవిధ్యాలను ఓ కళగా ఆస్వాదిస్తూ.. ఆభరణాలుగా తీర్చిదిద్దుతూ భారతీయ మహిళల జ్యూయెలరీ బాక్స్‌కు రిచ్‌నెస్‌ను ఇస్తోంది. ఇదే ఈ బ్రాండ్‌కు యాడెడ్ వాల్యూ. కొనుగోలుదారుల అభిరుచి, సృజనకూ విలువనిస్తూ వాళ్లు కోరుకున్నవిధంగా నగలను తయారుచేసి ఇస్తోంది. ధరలు అందుబాటులోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. అప్పుడప్పుడూ ప్రయోగాలు చేయాలి అప్పుడప్పుడైనా ఫ్యాషన్‌తో ప్రయోగాలు చేయాలి. లేకపోతే ఒత్తయిన జుట్టూ, మేకప్ కిట్టూ ఉండి ఏం లాభం? – కళ్యాణీ ప్రియదర్శిని జ్యూయెలరీ ఇయర్ రింగ్స్ బ్రాండ్: రాధిక అగ్రవాల్ స్టూడియో ధర: రూ. 7,725 చీర పోల్కా డాట్ బ్లష్ పింక్ శారీ బ్రాండ్: ఫాబియానా ధర: రూ. 45,000 -∙దీపిక కొండి చదవండి: గ్లామర్ అంటే స్కిన్ షో కాదు : నివేదా థామస్ -
వజ్రం మెరిసె..మగువ మురిసె..
-
పట్టుకు సింగారం
ఏ చిన్న వేడుకైనా మగువలు పట్టుచీర ధరించడం వైపే మొగ్గుచూపుతారు. దాని మీదకు సంప్రదాయ బంగారు ఆభరణాలను ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. పట్టుచీర మీదకు ధరించడానికి రకరకాల ఫ్యాషన్ జువెల్రీ అందుబాటులోకి వచ్చింది. ఇండోవెస్ట్రన్, వెస్ట్రన్ డ్రెస్సులకు నప్పే ఈ ఆభరణాలు చీరకట్టు మీదకు ఇప్పుడు ఒద్దికగా ఒదిగిపోతున్నాయి. ►సంప్రదాయ చీరకట్టు అయినా ఈ రోజులకు తగినట్టుగా ట్రెండీగా కనపడాలనేది యువతుల ఆలోచన. వీటిలో ఫ్యాషన్ జువెల్రీలో భాగమైన సిల్వర్, కుందన్, పూసలు, రత్నాలతో చేసిన వెస్ట్రన్ డిజైన్‌వేర్ బాగా నప్పుతుంది. వీటిలో పొడవాటి హారాలు, మెడను చుట్టేసే చోకర్స్ ఉంటున్నాయి. ►ఫ్యాషన్ జువెల్రీలో చెప్పుకోదగినది థ్రెడ్ జువెల్రీ. ఇది రకరకాల డిజైన్లలో రంగులలో పట్టుచీరల మీద కొత్తగా మెరుస్తోంది. ఈ ఆభరణాల్లో చీర అంచులు, ప్రింట్ల రంగులను తీసుకొని డిజైన్లు సృష్టిస్తున్నారు. ప్లెయిన్ పట్టుచీర అయితే, దాని మీదకు కాంట్రాస్ట్ లేదా మ్యాచింగ్ కలర్ థ్రెడ్ జువెల్రీ ధరిస్తే అద్భుతంగా ఉంటుంది. ►థ్రెడ్ జువెల్రీతో పాటు చెప్పుకోదగినది టెర్రకోట ఆభరణాలు. ఈ డిజైన్స్ సంప్రదాయపు సొబగులు అద్దడంలో సరైన పాత్ర పోషిస్తున్నాయి. ►సంప్రదాయ పట్టుకు ఈ తరహా ఆభరణాలే ధరించాలనే నియమాలేవీ లేవు. ఫ్యాషన్ జువెల్రీతో లుక్‌లో కొత్త మార్పులు తీసుకోవచ్చు. -
అధరాలంకరణం
పెదవులకు లిప్‌స్టిక్ వాడకం గురించి తెలుసు. చెవులకు, ముక్కుకు ఆభరణాల అలంకరించుకోవడం తెలుసు. కానీ, పెదవులకు కూడా ఆభరణం ధరించడం గురించి విన్నారా? కొత్తగా వచ్చిన ఈ ఆభరణం ఇప్పుడు యువతను ఆకట్టుకుంటోంది. ►జ్యువెల్రీ డిజైనర్లు ఫ్యాషన్ ప్రియుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని వినూత్న డిజైన్లను సృష్టిస్తున్నారు. వీటిలో భాగంగా వచ్చిందే లిప్ జ్యువెల్రీ. ►కొన్ని గిరిజన జాతుల్లో పెదవులను కూడా కుట్టి, ఆభరణాల అలంకరించుకోవడం ఉన్నది. దీనినే కొత్తగా ఇప్పుడు ఫ్యాషన్ జ్యువెల్రీలో సరికొత్తగా ప్రవేశపెట్టారు ఆభరణాల నిపుణులు. ►లిప్ జ్యువెల్రీని కింది పెదవికి తగిలించుకునేలా హుక్ ఉంటుంది. కింది పెదవికి హుక్ ఉన్న ఆభరణాన్ని తొడిగి, కొద్దిగా ప్రెస్ చేసి సెట్ చేయాలి. ► మేకప్ పూర్తయిన తర్వాతనే ఈ ఆభరణాన్ని ఉపయోగించాలి. ►పెదవులను కుట్టి, స్టడ్స్‌తో అలంకరించే ఆభరణాలు కూడా ఉన్నాయి. ►ఆన్లైన్ మార్కెట్లో అధరాలకు అందాన్ని పెంచే ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. డిజైన్, మెటల్‌ను బట్టి ధరలు ఉన్నాయి. -
ఫ్యాషన్ హవా
-
పూసలతో హ్యాంగింగ్స్
మోడ్రన్ డ్రెస్సుల మీదకు ఫ్యాషన్ జువెల్రీలో ఎన్ని మోడల్స్ ఉన్నా సరిపోవు. కొన్ని రకాల ఇయర్ హ్యాంగింగ్స్తోనూ లుక్‌లో గొప్ప మార్పు తీసుకురావచ్చు. ఈ ముచ్చటైన ఇయర్ హ్యాంగింగ్స్ మీరే డిజైన్ చేసుకోవచ్చు. ♦ నచ్చినవి మూడు రకాల పూసలు (పొడవు పూసలకు రెండువైపులా రంధ్రాలు ఉంటాయి) ♦ హుక్‌కి కావల్సిన తీగ లేదా హుక్స్ విడిగానూ లభిస్తాయి. ♦ ప్లాస్టిక్ వైర్ తయారీ: 1. పొడవు పూసలను వైర్‌తో ఇలా గుండ్రటి షేప్ వచ్చేలా గుచ్చాలి. 2. చిన్న గోల్డ్ బాల్స్‌ని చివరలో, మధ్యలో పెద్ద తెల్లని పూస వచ్చేలా వైర్‌తో గుచ్చి సెట్ చేసుకోవాలి. 3. పూసలన్నీ ఇలా ఒక షేప్ వచ్చేలా గుచ్చాలి. 4. హ్యాంగింగ్ పూసను తెల్లటి పూసల వూర్కి అటాచ్ చేస్తూ హుక్తో జత చేయాలి. 5. గోల్డ్ కలర్ పూసలను చివరలను కలపుతూ గుచ్చాలి. 6. పై భాగంలో హుక్ లేదా సన్నని గోల్డ్ కలర్ తీగను తగిలించి, పట్టుకారతో సెట్ చేయాలి. 7. బొమ్మలు చూపిన విధంగా రెండు హ్యాంగింగ్స్‌ను ఇలా తయారుచేసుకోవాలి. -
నీ బెల్ట్ బంగారం కానూ!
న్యూలుక్ జీన్స్, మిడీస్, ఫ్రాక్స్.. మీదకు అమ్మాయిలు క్లాత్, లెదర్ బెల్ట్‌లను ఉపయోగిస్తుంటారు. అలాగే చేతి గడియారం బెల్ట్‌లు, చిన్నా, పెద్ద చాలా రకాల మోడల్ బెల్ట్‌లు ఉండే ఉంటాయి. కొన్ని పాతవైపోయి, ఇంకొన్ని వాడకుండా వదిలేసినవీ ఉంటాయి. వీటితో ఏమిటి చేయడం అని ఎప్పుడూ ఆలోచించి ఉండరు. బెల్ట్‌తో బ్రేస్లెట్, అందమైన లాకెట్లను డిజైన్ చేసి ధరిస్తే... చూసినవారు నీ బెల్ట్ బంగారం కానూ! అని మెచ్చుకోకుండా ఉండలేరు. * ఫ్యాషన్ జువెల్రీలో ఎన్నో మోడల్స్ వస్తున్నాయి. వాటిలో బెల్ట్‌తో రీ డిజైన్ చేసుకున్న వీటిని చేర్చండి. * స్టీల్, సిల్వర్ చైన్‌కు బెల్ట్ బకెల్ను లాకెట్‌గా వాడుకోవచ్చు. ఇందుకు చేయాల్సింది కొంత మీ నైపుణ్యం. బకెల్‌కు స్టోన్స్, పూసలు జత చేసి ఇంకా అందంగా రూపొందించుకోవచ్చు. * ఎరుపు, ముదురు ఎరుపు, ఖాఖీ రంగు బెల్టులను ముంజేతికి ఎంచక్కని కఫ్స్గా తయారుచేసుకోవచ్చు. వీటికి అక్కడక్కడా కొన్ని గోల్డెన్ బటన్స్‌ని అమర్చితే అందమైన బ్రేస్లెట్స్ రెడీ. * జీన్ ప్యాంట్ కాలు భాగాన్ని కట్ చేసి, దానికి బెల్ట్‌ని ఇలా జత చేస్తే అందమైన బ్యాగ్ మీ చేతుల్లో. * వెస్ట్రన్ డ్రెస్‌ల మీదకు అందంగా నప్పే పొడవైన కంఠాభరణం ఇలా మీ చేతుల్లో... * ఒక పాత బెల్ట్.. కొన్ని చైన్ల కలబోతతో తయారుచేసిందంటే ఎవరూ నమ్మరు. * బెల్ట్‌ని సన్నని పీలికలుగా కట్ చేసి రెండు మూడు వరసలుగా అమర్చి ఒక బ్రేస్లెట్, జడలా అల్లి మరో బ్రెస్లెట్... ఇలా మీకు నచ్చిన డిజైన్స్‌ను సృష్టించి, ధరించవచ్చు. -
సీతాకోక పూలు
ఇంటికి - ఒంటికి ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున... లిప్‌స్టిక్ పెదాలకే ఎందుకు వేసుకోవాలి అని అడుగుతాడు. పెదాలకి మాత్రమే వేసుకోవాలని చివరకు డిసైడ్ చేస్తాడు. మరి నెయిల్ పాలిష్ కూడా అంతేనా గోళ్లకు మాత్రమే వేసుకోవాలా? అది కేవలం అందుకే పనికొస్తుందా? లేదు. నెయిల్ పాలిష్ గోళ్లకు మాత్రమే కాదు... మన ఇంటికి కూడా అందాన్ని తెస్తుంది. ఎలా అంటారా... ఒక్కసారి పక్కనున్న ఫొటోలపై ఓ లుక్కేయండి. అవన్నీ నెయిల్ పాలిష్‌తో చేసినవే. ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ నుంచి ఒంటికి పెట్టుకునే ఫ్యాషన్ జ్యూయెలరీ వరకు అన్నింటికీ నెయిల్ పాలిష్ హంగును అద్దారు. కావాలంటే ఇవన్నీ మీరు కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే... కావలసినవి: సులువుగా వంకులు తిరిగే సన్నని వైరు, రంగు రంగుల నెయిల్ పాలిష్‌లు (కొంచెం చిక్కబడినవి. అలాంటివి లేక పోతే నెయిల్ పాలిష్ సీసా మూత తీసి గాలి తగిలేలా పెడితే చిక్క బడుతుంది), క్విక్ డ్రై నెయిల్ పాలిష్ స్ప్రే (మార్కెట్లో దొరుకుతుంది; లేకున్నా ఫర్వాలేదు), కత్తెర, పెన్ లేదా సన్నని రాడ్, పట్టకారు తయారీ విధానం: ముందుగా తీగను పెన్ లేదా రాడ్‌కు చుట్టాలి. అది ఒక పూరేకులాగా అవుతుంది. పెన్/రాడ్‌ను రింగ్ లోంచి బయటికి తీసేసి, ఆ రేకుకు పక్కనే మరో రేకులా చేయాలి. ఇలా తీగను తిప్పుకుంటూ పక్కపక్కనే అయిదు రేకులు వచ్చేలా చేసు కుని, దాన్ని పువ్వు ఆకారంలోకి తీసుకురావాలి. తర్వాత నెయిల్ పాలిష్‌ను తీగల మీద పూసుకుంటూ పోవాలి. మొదట పలుచగా ఉన్నా కాసేపటికి దళసరి అవుతుంది. అప్పుడు దానిపై డ్రై నెయిల్ పాలిష్ స్ప్రే చల్లాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత, మళ్లీ రెండో కోటింగ్ వేస్తే రంగు బాగా కనిపిస్తుంది. ఇలా రంగురంగుల పూలు చేసు కుని వాటితో నెక్లెస్‌లు, బ్రేస్లెట్లు, ఉంగరాలు, హెయిర్ క్లిప్పులు చేసుకో వచ్చు. పూలగుత్తులు చేసుకుని ఫ్లవర్‌వాజుల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడిదో ఫ్యాషన్. మీరూ దీన్ని అనుసరించి చూడండి!