అధరాలంకరణం | Fashion Jewelry For Lips | Sakshi
Sakshi News home page

అధరాలంకరణం

Published Fri, Dec 13 2019 12:16 AM | Last Updated on Fri, Dec 13 2019 12:16 AM

Fashion Jewelry For Lips - Sakshi

పెదవులకు లిప్‌స్టిక్‌ వాడకం గురించి తెలుసు. చెవులకు, ముక్కుకు ఆభరణాల అలంకరించుకోవడం తెలుసు. కానీ, పెదవులకు కూడా ఆభరణం ధరించడం గురించి విన్నారా? కొత్తగా వచ్చిన ఈ ఆభరణం ఇప్పుడు యువతను ఆకట్టుకుంటోంది.

►జ్యువెల్రీ డిజైనర్లు ఫ్యాషన్‌ ప్రియుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని వినూత్న డిజైన్లను సృష్టిస్తున్నారు. వీటిలో భాగంగా వచ్చిందే లిప్‌ జ్యువెల్రీ.
►కొన్ని గిరిజన జాతుల్లో పెదవులను కూడా కుట్టి, ఆభరణాల అలంకరించుకోవడం ఉన్నది. దీనినే కొత్తగా ఇప్పుడు ఫ్యాషన్‌ జ్యువెల్రీలో సరికొత్తగా ప్రవేశపెట్టారు ఆభరణాల నిపుణులు.
►లిప్‌ జ్యువెల్రీని కింది పెదవికి తగిలించుకునేలా హుక్‌ ఉంటుంది. కింది పెదవికి హుక్‌ ఉన్న ఆభరణాన్ని తొడిగి, కొద్దిగా ప్రెస్‌ చేసి సెట్‌ చేయాలి.

► మేకప్‌ పూర్తయిన తర్వాతనే ఈ ఆభరణాన్ని ఉపయోగించాలి.
►పెదవులను కుట్టి, స్టడ్స్‌తో అలంకరించే ఆభరణాలు కూడా ఉన్నాయి.
►ఆన్‌లైన్‌ మార్కెట్‌లో అధరాలకు అందాన్ని పెంచే ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. డిజైన్, మెటల్‌ను బట్టి ధరలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement