జ్యూటిఫుల్
హ్యాండ్ బ్యాగ్‌లు మొదలుకొని ఇయర్ రింగ్స్ వరకూ ప్రతిదీ కళాఖండమే. ఆకర్షించే అందమే. ఖైరతాబాద్ ఇంజనీర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో బుధవారం ప్రారంభమైన ‘జ్యూట్ డెకరేటివ్ ప్రొడక్ట్స్’ ఎగ్జిబిషన్‌లో జనపనారతో రూపొందించిన కళాకృతులు, ఆభరణాలు అబ్బురపరుస్తున్నాయి. పర్యావరణానికి హాని కలిగించని ఈ ఉత్పత్తుల్లో ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు, డిజైనింగ్ బ్యాగ్‌లు, ఫుట్‌వేర్, ఫ్యాబ్రిక్స్, డోర్ మ్యాట్స్ వంటివెన్నో వెరైటీలున్నాయి. రాష్ట్రంతో పాటు పశ్చిమ బెంగాల్, యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల్లో తయారు చేసిన జ్యూట్ ఉత్పత్తులు మనసు దోచుకుంటున్నాయి. ధరలు రూ.10 నుంచి రూ.1,600 వరకు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నేషనల్ జ్యూట్ బోర్డ్ మార్కెటింగ్ ప్రమోషన్ ఆఫీసర్ నర్సింహులు ఇక్కడి స్టాల్స్‌లోని ఉత్పత్తులను పరిశీలించారు. ఈ నెల 22 వరకు ప్రదర్శన కొనసాగుతుంది.