hand bags
-
పర్యావరణహితం: ఈ బ్యాగు... బాగు బాగు!
దేవాలయానికి వెళ్తే... వచ్చిన భక్తులందరి చేతిలో కొబ్బరికాయ, పూజసామగ్రి కవర్లో నుంచి తొంగి చూస్తుంటాయి. కాలనీలో పెట్టిన చిన్న ఎగ్జిబిషన్‌కు వెళ్తే అక్కడ జుట్టుకు పెట్టుకునే పిన్నుల నుంచి వంటగదిలో ఉపయోగించే జాడీలు, స్పూన్లు, బీటర్లు, గ్రేటర్లు వంటివెన్నో ఉంటాయి. వాటిని చూసిన తర్వాత మనకు అవసరమైనవన్నీ గుర్తుకు వస్తాయి. కొన్న వెంటనే స్టాల్ వాళ్లు వాటిని ఒక పాలిథిన్ కవర్లో వేసిస్తారు. ఓ బర్త్‌డే ఫంక్షన్‌కు వెళ్తాం. వెళ్లిన వాళ్లందరికీ రిటర్న్ గిఫ్ట్‌లు ఓ చిన్న క్యారీ బ్యాగ్‌లో వేసిస్తారు. పర్యావరణం పట్ల చైతన్యం కలిగిన వాళ్లు పాలిథిన్ స్థానంలో పేపర్బ్యాగ్లను వాడుతున్నారు. అది మట్టిలో కలిసిపోతుంది, కానీ పేపర్ తయారీకి పెద్ద మొత్తంలో నీరు కావాలి. పేపర్ బ్యాగ్ సహజవనరుల వృథాను అరికట్టేది మాత్రం కాదు. వైశెట్టి సునీతా రాణికి వీటన్నింటికీ ప్రత్యామ్నాయం కేరళలో కనిపించింది. కేరళ ఇచ్చిన ఆలోచన! ‘‘కేరళ వాళ్ల జీవనశైలి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. భూమాతకు హాని కలిగించని జీవన విధానం వారిది. కొబ్బరిపీచు నుంచి తాటాకు, జ్యూట్ వరకు అన్నింటినీ ఉపయోగిస్తారు. అప్పటికి మన తెలుగు రాష్ట్రాల్లో జ్యూట్ వాడకం పెరగలేదు. దుస్తులు కొన్నప్పుడు కొంతమంది వస్త్రాల దుకాణదారులు కర్రల హ్యాండిల్స్ ఉన్న జ్యూట్ బ్యాగులను ఇచ్చేవారు. అంతే తప్ప బయో డీగ్రేడబుల్ ప్రోడక్ట్స్ దైనందిన జీవనంలోకి పెద్దగా రాలేదు. వచ్చిన అతికొద్ది ఉత్పత్తులు కూడా కోల్‌కతా మోడల్ సింగిల్ వీవింగ్ జ్యూట్ బ్యాగ్‌లే. వాటికి లోపల వైపు ల్యామినేషన్ ఉంటుంది. పైకి మాత్రం ఎకో ఫ్రెండ్లీ అనే ముసుగు వేసి లోపల కెమికల్ ల్యామినేషన్ వాడితే మనం ఏం సాధించినట్లు? పైగా మన దగ్గర ఏలూరులో డబుల్ వీవింగ్ జనపనార అందుబాటులో ఉండగా బయటి నుంచి ల్యామినేషన్ అతికిన జ్యూట్ వాడాల్సిన పనేంటి? ఇంతగా అధ్యయనం చేసిన తర్వాత నేషనల్ జ్యూట్ బోర్డు సహకారంతో నేను బయోడీగ్రేడబుల్ బ్యాగ్‌ల తయారీ మొదలుపెట్టాను’’ అంటూ తాను సోషల్ప్రెన్యూర్గా మారిన వైనాన్ని వివరించారు సునీతారాణి. గ్రీన్ లీఫ్ పుట్టింది! ‘‘మాది విజయవాడ. బాల్యం, చదువు అంతా అక్కడే. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ పూర్తి కాగానే పెళ్లయింది. హైదరాబాద్‌కి వచ్చాను. షాదాన్, అరోరా కాలేజీల్లో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. పెద్ద పాప పుట్టిన తర్వాత ఫుల్‌టైమ్ జాబ్ వీలు కాకపోవడంతో కొంతకాలం మెడికల్ ట్రాన్స్క్రిప్టర్గా చేశాను. మా వారు యూఎస్ వెళ్లాలనే ఆలోచన చేశారు. అనుకున్నట్లుగా వెళ్లారు కానీ అక్కడ కొనసాగలేదు. ఇండియా వచ్చిన తర్వాత ప్రింటింగ్‌లో భవిష్యత్తును వెతుక్కున్నాం. ఇంట్లోనే ఒక గదిలో 2002లో ఒక్క మెషీన్‌తో ప్రింటింగ్ మొదలుపెట్టాం. నేను ఇంట్లో పిల్లలను, ప్రింటింగ్ పనులను చూసుకుంటూ ఉంటే మా వారు మార్కెటింగ్ చూసేవారు. ఆ ప్రయత్నం విజయవంతమైంది. జీవితం సౌకర్యవంతంగా సాగుతోంది. మా చిన్న పాప చెస్ ఆడుతుంది. తనకు తోడుగా టోర్నమెంట్లకు నేనే వెళ్లేదాన్ని. అనేక ప్రదేశాలను, వారి జీవనశైలిని చూశాను. ఓ సారి మా ఫ్యామిలీ మొత్తం కేరళ టూర్ వెళ్లాం. అప్పుడు వచ్చిన ఆలోచనే ‘జస్ట్ గ్రీన్ లీఫ్’ రూపంలో హైదరాబాద్‌లో ఆవిష్కృతమైంది. ముగ్గు పరిచయం! చిన్న జీయర్ స్వామిగారు ధనుర్మాస దీక్ష కోసం లడ్డు ప్రసాదం, పసుపు కుంకుమలు వేసివ్వడానికి పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇచ్చారు. వాటిని చూసిన సింగపూర్ టీటీడీ వాళ్లు ప్రత్యేకంగా చేయించుకున్నారు. ఇక బ్యాగ్ మీద ముగ్గు ముద్రించడం వెనుక ఉద్దేశం... ఈ తరం పిల్లలకు మన ముగ్గులను పరిచయం చేయడం. ముగ్గు వేయడం నేర్చుకోమంటే ఎవరు శ్రద్ధ పెడతారు? ఇలా కనిపిస్తూ ఉంటే సరదాగా కాగితం మీద అయినా ఓ ప్రయత్నం చేస్తారని నా ఆశ. పర్యావరణహితమైన జీవనశైలితోపాటు తెలుగుదనాన్ని కూడా అలవాటు చేస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలకే నాకు గో గ్రీన్ పురస్కారం లభించింది’’ అన్నారు వైశెట్టి సునీతారాణి. పిల్లలకు అలవాటు చేయాలి! నా యూనిట్ ఉద్దేశం... జ్యూట్ బ్యాగ్ తయారు చేయడం, ఖర్చులతోపాటు లాభం చూసుకుని అమ్మడం కాదు. మన అవసరాన్ని తీర్చిన తర్వాత ఆ మెటీరియల్ భూమిలో కలిసి పోవాలి. ప్లాస్టిక్లాగ పల్లపు ప్రదేశాలకు కొట్టుకువచ్చి వరదలకు కారణం కాకూడదు. ఇక ప్లాస్టిక్ వినియోగం ఎక్కడ ఎక్కువగా ఉంటోందో గమనించి అక్కడి అవసరాలకు సరిపోయే విధంగా బ్యాగ్‌లను డిజైన్ చేశాను. మార్కెట్‌కి వెళ్లేటప్పుడు తమ వెంట బ్యాగ్ తీసుకెళ్లడం పిల్లలకు అలవాటు చేయాలనేది నా లక్ష్యం. అందుకోసం చేసిన ప్రయోగమే స్క్రీన్ ప్రింటింగ్‌లో జ్యూట్ మీద పిల్లల పేర్లను ముద్రించడం. రిటర్న్ గిఫ్ట్‌గా తమ పేరున్న బ్యాగ్‌ను అందుకున్నప్పుడు వారి సంతోషం వర్ణనాతీతం. ఆ పేరును స్నేహితులకు చూపించుకోవడానికి ఆ బ్యాగ్‌ను ఇష్టంగా వాడడం మొదలుపెడతారు. ఈ ప్రయోగం విజయవంతం అయింది. ఇక నా సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే... ఆన్లైన్లో రకరకాల ఉత్పత్తులను అప్లోడ్ చేస్తాం. అందులో త్వరగా అమ్ముడైన మోడల్ ఏమిటో గమనించి ఆ డిజైన్‌లో ఎక్కువ పీస్‌లు తయారు చేయడం అన్నమాట. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
అక్క ఎంబీఏ, తమ్ముడు లా వదిలేసి.. పాత చీరలతో బ్యాగులు తయారు చేస్తూ..
ఇంట్లో పెద్దపిల్లలు వాడిన ఆట వస్తువులు, పొట్టి అయిన, బిగుతైన బట్టలు, పై తరగతికి వెళ్లిన అక్క లేదా అన్నయ్య పుస్తకాలను తమ్ముడు, చెల్లెళ్లకు ఇవ్వడమనేది మన దేశంలో ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తోన్న పద్ధతి. చిన్నవాళ్లకు కూడా ఆ బట్టలు పొట్టి అయినప్పుడు ఇల్లు తుడిచే మాప్గానో, మసిబట్టగానో ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఈ పద్దతికి టెక్స్టైల్స్ పరిశ్రమలు మరికొన్ని కొత్త హంగులు జోడించి రీసైక్లింగ్ పేరిట ఆకర్షణీయమైన ఉత్పత్తులను ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రవేశపెడుతున్నాయి. రీసైక్లింగ్ చేసిన ఫ్యాషన్ ఉత్పత్తుల క్రేజ్‌ను గుర్తించిన రిని మెహత.. పాత చీరలతో అందమైన బ్యాగ్‌లను రూపొందించి పిటారా పేరుతో విక్రయిస్తోంది. సంప్రదాయ బ్యాగ్‌లతోపాటు, లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫ్యాషన్ ఉత్పత్తులు అందించడం పిటారా ప్రత్యేకత. పాత చీరలకు ప్లాస్టిక్ వ్యర్థాలను జోడించి లగ్జరీ ఉత్పత్తులు తయారు చేస్తోన్న పిటారా గురించి రిని మెహతా మాటల్లో... ‘మాది జైపూర్. చిన్నప్పటి నుంచి సృజనాత్మకంగా ఉండడం ఇష్టం. నా మనసులో వచ్చే అనేక క్రియేటివ్ ఆలోచనలు బ్లాక్‌బోర్డు మీద రాస్తుండేదాన్ని. అలా రాస్తూ కాస్త పెద్దయ్యాక సొంతంగా తయారు చేసిన కార్డులను ఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శనకు ఉంచే దాన్ని. నా ఆలోచనలు, అభిరుచులను పట్టించుకోని అమ్మానాన్నలు నన్ను ఎమ్బీఏ చేయమని పట్టుబట్టారు. వారికోసం ఎమ్బీఏలో చేరాను కానీ, పూర్తిచేయలేదు. ఆ తరువాత క్రియేటివ్ రంగంలో పనిచేయాలన్న దృఢసంకల్పంతో.. టెక్స్టైల్ డిజైనర్‌గా పనిచేయడం ప్రారంభించాను. కొన్నాళ్లు డిజైనర్‌గా పనిచేశాక నేనే సొంతంగా సరికొత్తగా ఏదైనా చేయాలనుకున్నాను. ఈ ఆలోచనకు ప్రతిరూపమే ‘పిటారా’. తమ్ముడు లా వదిలేశాడు.. కట్టుకోవడానికి పనికిరాని పాతచీరలతో బ్యాగ్‌లు తయారు చేసి విక్రయించవచ్చు అని తమ్ముడు రోహన్ మెహతాకు చెప్పాను. నా ఐడియా వాడికి బాగా నచ్చింది. దీంతో రోహన్ లా ప్రాక్టీస్‌ను వదిలేసి నాతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఇద్దరం కలిసి పిటారాను ప్రారంభించాము. పిటారా అంటే ‘ట్రెజరీ బాక్స్’ అని అర్థం. ప్రారంభంలో ఇంట్లో మూలుగుతోన్న పాత చీరలతో బ్యాగ్‌లు తయారు చేసే వాళ్లం. క్రమంగా ఇంట్లో పాత చీరలన్నీ అయిపోయాయి. తరువాత మేము తయారు చేస్తోన్న ఉత్పత్తుల గురించి మా కాలనీలో వాళ్లకు, సోషల్ మీడియాలోనూ వివరించడంతో చాలామంది తమ ఇళ్లలో ఉన్న పాత చీరలను తీసుకొచ్చి ఇచ్చేవారు. అలా చీరలు ఇచ్చిన వారికి కూపన్లు ఇచ్చే వాళ్లం. ఆ కూపన్లను మా స్టోర్‌లో ఏదైనా కొనుక్కున్నప్పుడు వాడుకునే విధంగా ఏర్పాటు చేశాం. అన్నీ హ్యాండ్మేడే.. మా పిటారా ఉత్పత్తులన్నీ చేతితో తయారు చేసినవే. వాటిలో రాజస్థానీ కళ, సంస్కృతీ సంప్రదాయాలు స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. మా బ్యాగ్‌లలో బగ్రు, జర్దోసి ప్రింట్లు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ప్రతిదీ యంత్రాలతో తయారు చేస్తున్నారు. మేము మన సంస్కృతిని వెనక్కి తీసుకు రావడంతోపాటు, కళాకారులకు ఉపాధి కల్పించాలనుకున్నాము. అందుకే మా బామ్మ వాలెట్‌ను ప్రేరణగా తీసుకుని అప్పట్లో వాడిన బ్లాక్, ఇక్కత్ ప్రింట్ వస్త్రంతో వివిధ రకాల టెక్నిక్లను వాడి డిజైన్లు రూపొందించి ఇప్పటి ట్రెండ్‌కు నప్పేవిధంగా ఉత్పత్తులు తయారు చేస్తున్నాము. రీసైక్లింగ్ చేసిన చీరలకు న్యూస్ పేపర్లు, మ్యాగజీన్లు, పాత టైర్లు, ఉన్ని, ఈకలు జోడించి రోజువారి వాడుకునే వస్తువులను రూపొందిస్తున్నాం’ అని వివరిస్తోంది రిని మెహతా. సృజనాత్మక ఆలోచనా విధానం ఉండాలే గానీ అద్భుతాలు సృష్టించే అవకాశాలు తన్నుకుంటూ వస్తాయనడానికి రిని మెహతా పిటారా ఉదాహరణగా నిలుస్తోంది. సవాలుగా అనిపించినప్పటికీ.. వ్యాపారం ఏదైనా ప్రారంభంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ప్రారంభంలో మా వద్దకు వచ్చిన వ్యర్థాలను లగ్జరీ ఉత్పత్తులుగా తీర్చిదిద్దడం సవాలుగా అనిపించింది. తరువాత మొత్తం వ్యర్థాలను ఒక పద్ధతి ప్రకారం వేరుచేయడం మొదలు పెట్టాం. లెదర్, జూట్, జరీలను విడివిడిగా తీసి వాటిని అవసరమున్న వాటి దగ్గర వాడేవాళ్లం. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా బ్యాగ్‌లు తయారు చేయడంతో మా ఉత్పత్తులకు మంచి స్పందన లభించింది. ఈ స్పందనతో రంగురంగుల హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్స్, టాట్స్, క్రాస్బాడీ బ్యాగ్స్, పాస్‌పోర్టు కవర్స్, సన్‌గ్లాస్ కేసెస్, టిష్యూ బాక్సెస్, హ్యాంగర్స్, ట్రావెల్ పౌచ్‌లు వంటివి అనేకం తయారు చేసి విక్రయిస్తున్నాం. మనం బతకడానికి పర్యావరణం ఎంతగానో ఉపయోగపడుతుంది. అటువంటి పర్యావరణాన్ని ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌తో కాలుష్యమయం చేసేకంటే వాటిని మరో విధంగా వాడడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని నమ్ముతున్నాము. చదవండి: చుక్కల్లో చంద్రిక.. ఎన్నో రకాల బుక్స్ చదివాను.. కానీ, ఆ ఒక్కటీ.. -
బర్త్‌డే గర్ల్ సమంత వద్ద ఉన్న ఈ కాస్ట్లీ వస్తువులు తెలుసా ?
Samantha Luxury Cars Bags Collection On Her Birthday Special: అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది యాపిల్ బ్యూటీ సమంత. తన నటన, గ్లామర్, ఫ్యాషన్, ఫిట్నెస్తో ప్రేక్షకులు, అభిమానులకు బోర్ కొట్టించకుండా ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తుంది. టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్యతో విడాకుల అనంతరం తన కెరీర్‌పై మరింత ఫోకస్ పెడుతూ దూసుకుపోతోంది. ఐటమ్ సాంగ్ నుంచి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన మార్క్ చూపిస్తుంది. సినిమాలే కాకుండా ఫ్యాషన్‌లోనూ సత్తా చాటుతోంది సామ్. నేడు (ఏప్రిల్ 28) పుట్టిన రోజు సందర్బంగా సామ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లు, కాస్ట్లీ బ్యాగులు ఇతర వస్తువులపై ఓ లుక్కేద్దామా ! సమంత వద్ద 6 లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వాటిలో రూ. 2.55 కోట్ల విలువ చేసే మెర్సిడేజ్ బెంజ్ జీ63, రూ. 2.26 కోట్ల రేంజ్ రోవర్, రూ. 1.46 కోట్ల స్వాంకీ పోర్చే కేమన్, రూ. 1.42 కోట్ల బీఎండబ్ల్యూ 7 సిరీస్, రూ. 83 లక్షల ఆడి క్యూ 7, రూ. 72 లక్షల జాగ్వర్ ఎక్స్ఎఫ్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సామ్‌కు హ్యాండ్‌బ్యాగ్‌లపై ఆసక్తి ఎక్కువే. సామ్ వద్ద వైఎస్ఎల్ లవ్ బాక్ క్లచ్ బ్యాగ్, బట్టేగా వెనెటా పంచ్ స్లింగ్ బ్యాగ్, ప్రద వింటేజ్ బ్యాగ్, లూయిస్ వుయిట్టన్ బ్లీకర్ బ్యాగ్, లూయిస్ వియుట్టన్ ట్విస్ట్ బ్యాగ్ వంటి తదితర లగ్జరీ బ్యాగులు ఉండటం విశేషం. వీటి ధర ఏకంగా రూ. 1.40 లక్షలు ఉంటుందని అంచనా. వీటితోపాటు సామ్ వాడే మనోలో బ్లాక్ హై హీల్స్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. వీటి ధర సుమారు రూ. లక్ష ఉంటుందని టాక్. అయితే తాను ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కష్టముందని ఇదవరకు అనేకసార్లు సామ్ చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: బర్త్‌డే స్పెషల్ పోస్టర్: ఎదురుచూపుల్లో సమంత! చదవండి: సమంత, నయనతార మధ్య నలిగిన హీరో.. ఆసక్తిగా ట్రైలర్ ఇదిలా ఉంటే 2010లో వచ్చిన 'ఏ మాయ చేశావే' సినిమాతో వెండితెరకు తెరంగేట్రం చేసిన సామ్ తన క్యూట్ అండ్ లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో సినీ లోకాన్ని మాయ చేసింది. తాజాగా కణ్మనీ రాంబో ఖతీజా (కాతువాక్కుల రెండు కాదల్) సినిమాతో తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం (ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి, సామ్, నయన తార కలిసి నటించిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. చదవండి: ఆ గాయం తగ్గడానికి ఆరు నెలలు పట్టింది : సమంత పచ్చబొట్టు వేసుకోవాలన్న ఆలోచనే వద్దంటున్న సమంత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1591342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హ్యాండ్బ్యాగ్స్కు లక్షలు పోసిన అషూ, నిప్పు పెట్టిన తల్లి
Bigg Boss Fame Ashu Reddy Mother Fires On Her Dubai Shopping: బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డికి హ్యాండ్బ్యాగులంటే మోజు. ఏదైనా మంచి హ్యాండ్‌బ్యాగ్ తన కంట్లో పడిందంటే చాలు దాన్ని కొనేవరకు వదిలిపెట్టదు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టయినా దాన్ని సొంతం చేసుకుని తీరుతుంది. అలా ఇప్పటివరకు ఆమె ఇంట్లో బోలెడన్ని బ్యాగులున్నాయి. అయితే ఇలా బ్యాగుల కోసం లక్షలు పోయడం అవసరమా? అని ఆ మధ్య అషూ తల్లి హ్యాండ్ బ్యాగును నేల మీదకు విసిరి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను అషూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అయింది. అయితే తల్లి ఎంత తిట్టినా అషూకు హ్యాండ్ బ్యాగుల మీద ఇష్టం పోలేదు. ఈ మధ్యే దుబాయికి వెళ్లిన అషూ ఖరీదైన హ్యాండ్ బ్యాగులు కొని ఇంటికి తెచ్చుకుంది. పైగా ఆ బ్యాగులను తల్లికి చూపిస్తూ ఒకటి రూ.2,50,000 అని, మరొకటి రూ.2,00,00 ఖరీదు అని చెప్పింది. 60 వేలు పెట్టి కొనుక్కున్న హీల్స్‌ను సైతం చూపించింది. వాటికోసం లక్షలు ఖర్చుపెట్టడంతో ఆమె తల్లికి కోపం కట్టలు తెంచుకుంది. ఎన్నిసార్లు చెప్పినా తను తీరు మార్చుకోవడం లేదని మంటెత్తిపోయింది. డబ్బుల విలువ తెలీదా? అని ఆగ్రహించింది. డబ్బులు నీళ్లలా ఖర్చు చేస్తున్న అషూకు బుద్ధి చెప్పాలనుకుంది. ఇంట్లో ఉన్న పాత బ్యాగును ఒకటి తీసుకుని దానికి నిప్పు పెట్టింది. దీంతో అషూ .. 'ఏంటి మమ్మీ? నీకేమైనా పిచ్చా..' అంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇలా పాత బ్యాగులు కాలిస్తేనే ఇంకోసారి కొత్త బ్యాగుల జోలికి పోకుండా ఉన్నవాటినే వాడతావని వార్నింగ్ ఇచ్చింది తల్లి. కానీ కాసేపటికే దుబాయి నుంచి తెచ్చిన కొత్త బ్యాగులను పూజ గదిలోకి తీసుకెళ్లి బొట్లు పెట్టింది. 'బంగారం కొనమంటే బ్యాగులు కొంటోంది. ఆ బంగారం డబ్బుతోనే బ్యాగులు కొంటుంది, కాబట్టి దీన్ని కూడా బంగారంగా భావించి దండం పెడుతున్నా' అని చెప్పుకొచ్చింది. -
వ్యర్థాలతో విలువైన అల్లికలు!
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న ముఖ్యమైన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం కూడా ఒకటి. పచ్చదనంతో కళకళలాడే పర్యాటక ప్రాంతాలకు సైతం ఈ ప్లాస్టిక్ భూతం పెనుసమస్యగా పరిణమిస్తోంది. ఆయా పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వెళ్లే పర్యాటకులు.. వివిధ రకాల పనులకోసం ఉపయోగించే వస్తువుల్లో ఎక్కువగా ప్లాస్టిక్‌తో తయారైనవే. రోజురోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యం పై పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ.. దీనిని అరికట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సమస్య కు అత్యంత సులభమైన పరిష్కారం చూపడంతోపాటూ, నిరుపేద మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు అసోంకు చెందిన రూప్‌జ్యోతి సైకియా గొగోయ్. అసోంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశం కజిరంగా జాతీయ ఉద్యానవనం కూడా ప్లాస్టిక్ కాలుష్య ముప్పునకు గురవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి కజిరంగా పార్క్‌ను సందర్శించే పర్యాటకులు వదిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఇది గమనించిన 47 ఏళ్ల రూప్‌జ్యోతి సైకియా గోగోయ్ వీటికి చక్కటి పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. కజిరంగా పరిసర ప్రాంతాల్లో పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటితో çహ్యాండ్ బ్యాగ్‌లు, డోర్ మ్యాట్లు, టేబుల్ మ్యాట్లు, ఇతర రకాల ఫర్నీషింగ్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అంతేగాక పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి పనికొచ్చే వస్తువులు ఎలా తయారు చేయాలి– అనే అంశంపై స్థానిక నిరుపేద మహిళలకు రూప్‌జ్యోతి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకున్న మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయం ద్వారా ఉపాధి పొందుతున్నారు. కజిరంగా హట్.. రూప్‌జ్యోతి మరికొంతమంది మహిళలç సహకారంతో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి.. వాటిని శుభ్రం చేసి, కత్తిరించి దారాల సాయంతో వస్తువులుగా రూపొందిస్తారు. ఇవి చూడడానికి ఆకర్షణీయంగానే గాక, మన్నికగా కూడా ఉంటాయి. కొందరు మహిళలు వీటిని రూపొందించే పనిలో ఉంటే.. మరికొందరు ఈ వస్తువులను పర్యాటకులకు విక్రయిస్తారు. ఈ క్రమంలోనే 2012లో రూప్‌జ్యోతి ‘కజిరంగా హట్’ పేరిట ఒక అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. వీరంతా తయారు చేసిన వస్తువులను హట్ లో ప్రదర్శించి విక్రయిస్తుంటారు. నాలుగువేల మందికి పైగా మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇప్పటిదాకా అసోంలోని 35 గ్రామాల్లోని మహిళలకు ఆమె శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారు దేశ విదేశీ పర్యాటకులకు వస్తువులు విక్రయించి నెలకు 25 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ.. ముంబైకి చెందిన ఎన్జీవో ద కార్బెట్ ఫౌండేషన్.. 2013–2017 మధ్యకాలంలో కజిరంగా పరిసర ప్రాంతాల్లోని మహిళ అభివృద్ధికి వివిధ రకాల పనుల్లో శిక్షణ ఇచ్చేందుకు వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయగా ఆ కార్యక్రమంలో రూప్‌జ్యోతి పాల్గొని దాదాపు రెండువందల మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. అంతేగాక అరుణాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిబెంగాల్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గోని ఇప్పటిదాక 2,300 మంది మహిళలకు రూప్‌జ్యోతి శిక్షణ ఇచ్చారు. వెదురు పుల్లల్ని అల్లినట్లుగా... ‘‘అది 2004.. మా ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు చూడడానికి చాలా ఇబ్బందిగా అనిపించేది. ఈ వ్యర్థాలను ఎలా రూపుమాపాలి? వీటితో పనికొచ్చేవి ఏమైనా తయారు చేయవచ్చా అని బాగా ఆలోచించాను. ఈ క్రమంలోనే కొందరు వెదురు పుల్లల అల్లికల ద్వారా రకరకాల వస్తువులు రూపొందించడం నా మదిలో మెదిలింది. వెంటనే వెదురు లాగా ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా అల్లవచ్చు కదా! అనుకున్నాను. వెంటనే చిన్న చిన్న టెక్నిక్‌లతో ప్లాస్టిక్ వ్యర్థాలను కాటన్ దారంతో కలిపి రకరకాల వస్తువులు రూపొందించడం మొదలుపెట్టాను. వీటిని రూపొందించడానికి నేను ఎటువంటి శి„ý ణా తీసుకోలేదు. అలా ముందు నేను నేర్చుకుని తర్వాత స్థానిక మహిళలకు శిక్షణ ఇచ్చాను. మేమందరం తయారు చేసే ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తులు ఎంతో మన్నికగా ఉంటాయి’’ అని రూప్‌జ్యోతి వివరించారు. కజిరంగా హట్ వద్ద సందర్శకులు -
బామ్మగారి 'బ్యాగు'లు
లతికా చక్రవర్తి వయసు 90 ఏళ్లు. ఈ వయసులో ఇంక పనులేం చేస్తారు.. ‘కృష్ణా, రామా.. అనుకుంటూ రోజులు వెళ్లబుచ్చక..’ అనుకుంటారు ఎవరైనా. కానీ, ఈ బామ్మ భారతదేశం నలుమూలలా ఆ ప్రాంతాలకే ప్రత్యేకమైనపాత చేనేత చీరలు, కుర్తాలు, బట్టలు సేకరించి వాటితో అందమైన ‘పొట్లి’ బ్యాగులు, పర్సులు తయారు చేస్తున్నారు.చేత్తో పట్టుకునే సంచులు, పర్సులను రీసైక్లింగ్ చేయడం అంటే ఈ బామ్మకు మహా ఇష్టం. ‘‘ఆడవాళ్లు ప్రతిబ్యాగ్తోనూ ఒక బంధాన్ని, ఓ ప్రత్యేకమైన కథను కలిగి ఉంటారు’’ అని చెబుతుంది. ఏ తరానికైనా పనికివచ్చే ఎన్నోముచ్చట్లతో పాటు, పనే దైవంగా భావించాలని చెబుతున్న ఈ బామ్మ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే! లతిక 1930లో అస్సాంలోని ధుబ్రి పట్టణంలో జన్మించారు. ‘‘చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండేదాన్ని. కానీ, మా కుటుంబ సంప్రదాయ పద్ధతులు పై చదువులకు వెళ్లకుండా నన్ను అడ్డుకున్నాయి. కాలేజీలో చేరకుండానే కృష్ణ లాల్ చక్రవర్తితో పెళ్లైంది. తను సర్వే ఆఫ్ ఇండియాలో సర్వేయర్‌గా చేసేవారు. ఆయన ఉద్యోగరీత్యా తను ఏ రాష్ట్రానికి వెళితే నేనూ అక్కడికి వెళ్లాను. బయటకు వెళ్లి గుర్తింపు తెచ్చే పనులు చేయాలని ఉండేది. కానీ, నా భర్తకు నేను బయటకు వెళ్లి సంపాదించడం ఇష్టం లేదు. ముగ్గురు పిల్లలు. వాళ్ల ఆలనా పాలనతో ఇంట్లోనే ఉండిపోయాను. కానీ, నా జీవితం ఇలాగే నాలుగ్గోడల మధ్య ఉండిపోకూడదు అనిపించేది. ఒక ఏడాది ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో టీచర్‌గా పనిచేయాలనే ఆలోచనతో తొలిసారి బయటికి అడుగుపెట్టాను. పనిలో ఉన్న ఆనందం, స్వయంకృషితో సంపాదించే డబ్బు నాకు ఎనలేని సంతృప్తిని ఇచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడూ ఇంటిపట్టున ఉండాలనే ఆలోచన కూడా చేయలేదు. మా రోజులు చాలా భిన్నంగా ఉండేవి. ఇప్పటిలా అప్పుడు చాలా వస్తువుల అవసరం లేదు. ఒకసారి వాడిన వస్తువులును తిరిగి చక్కగా ఉపయోగించుకునేవాళ్లం. ఎలాంటి భేషజాలు లేవు. ఒకరితో పోల్చి చూసుకోవడం ఉండేది కాదు. దీంతో చాలా సంతోషంగా ఉండేవాళ్లం’’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటారు లతిక. వృథా ఇష్టం ఉండదు యాభైఏళ్ల వయసులో భర్తను కోల్పోయిన లతిక పిల్లలతో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ రోజులు గడిపేశారు. అయితే, ఆమె స్వయంకృషి, అభిరుచి.. తొమ్మిది పదులకు చేరువవుతున్న దశలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టేలా చేశాయి. ఇప్పుడు ఆమె ఒక బిజినెస్ ఉమెన్. తను తయారు చేసిన అందమైన ‘పొట్లి’ సంచులను తయారు చేస్తూ వాటిని అమ్ముతున్నారు. ‘‘పాత బట్టలను పడేయడం అంటే ఇష్టముండేది కాదు. ఆ మాటకొస్తే ఏదైనా వృథా అవుతుంటే నా మనసు చివుక్కుమంటుంది. పాత చీరలతో పిల్లలకు కుర్తాలు కుట్టేదాన్ని. కుర్తాలతో పర్సులు, సంచులు తయారు చేసేదాన్ని. అయితే వాటిని అమ్మాలని ఎప్పుడూ అనుకోలేదు. మా బంధువుల్లోనే ఎవరైనా అడిగితే ఇచ్చేదాన్ని..’’ అంటూ తన వ్యాపారం ఎలా మొదలైందీ వివరిస్తారు లతిక. రెండు–మూడు రోజుల్లో ఒక బ్యాగును తయారు చేస్తారామె. అలా.. మొదట ఓ 300ల బ్యాగులను తయారు చేశారు. బామ్మ ఆసక్తిని చూసిన మనవడు ‘లతికాస్ బ్యాగ్’ పేరుతో ఆమె కోసం ఒక వెబ్‌సైట్‌ని ప్రారంభించాడు. బామ్మ కుట్టిన బ్యాగులను వెబ్సైట్లో పెట్టడంతో వాటికి డిమాండ్ పెరిగింది. న్యూజిలాండ్, జెర్మనీ నుంచి కూడా లతిక బ్యాగులకు ఇప్పుడు గిరాకీ వస్తోంది! సంతోషాన్నిచ్చే వ్యాపకం ‘‘నా భర్త 65 ఏళ్ల క్రితం ఓ కుట్టుమిషన్ని కానుకగా ఇచ్చాడు. దానిమీదే ఈ బ్యాగులను కుట్టడం మొదలుపెట్టాను. మా కోడలు, కూతుళ్లు వాడేసిన చీరలూ తీసుకున్నాను. పాత క్లాత్‌తో కుట్టిన ఈ బ్యాగులకే టాజిల్స్, ఎంబ్రాయిడరీతో కొత్తగా రూపు కడతాను. అయితే బ్యాగులను అమ్మాలనే ఉద్దేశంతో ఈ పనిని మొదలుపెట్టలేదు. వీటి తయారీలో ఒక ఆనందాన్ని పొందుతాను. నా వయసును మర్చిపోతాను. నా భక్తి అంతా నా బ్యాగ్ రూపకల్పనలోనే ఉంటుంది. నా హృదయంతో వీటిని తయారు చేస్తాను. ఈ తరం అమ్మాయిలకు కూడా నా బ్యాగులు నచ్చుతున్నాయంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వయసు మీద పడినవాళ్లు కూడా నా బ్యాగులను ఇష్టపడతారు..’ అంటూ బ్యాగుల గురించి ఎన్నో విషయాలను చెబుతారు లతిక.ఈ బామ్మ తన వయసు పెరుగుతుందనే భావన దర చేరనీయరు. అందుకే తన గదిలో ఒక్క అద్దాన్నీ ఉంచుకోరు. ఎంతసేపూ స్నేహితులతో గడపడం, నలుగురి మధ్యలో మాట్లాడుతూ ఉండటాన్ని ఇష్టపడతారు. ముడతలు పడిన చేతులతో ముచ్చటగా తీర్చిదిద్దే ఒక్కో బ్యాగ్‌కు ఒక్కో అందమైన పేరు పెట్టి మురిసిపోతుంటారు– ఆరెన్నార్ -
చేతిని పట్టుకునే బ్యాగ్
భుజానికి బ్యాగ్ వేసుకోవడం, చేత్తో బ్యాగ్ పట్టుకోవడం మామూలే! కానీ, ఇలా చేతిని పట్టుకున్నట్టు ఉండే బ్యాగ్ అయితే ఈ వేసవికి కాస్త రిలీఫ్‌గా, మరికాస్త స్టైల్‌గా కనిపించొచ్చు. అంతే కాదు ఈ క్లచ్ బ్యాగ్స్ హ్యాండిల్ ముంజేతికి ఆభరణంగానూ అందంగా అమరిపోతుంది. ఎక్కడకు వెళ్లినా! బజారుకు వెళుతున్నప్పుడు వెంట పర్స్ తీసుకెళ్లడం మామూలే! ఫోన్, డబ్బులు, కార్డులు ఆ పర్స్‌లో పట్టాలి. అలాగే స్టైల్‌గా, ప్రత్యేకంగా కనిపించాలి. అదే టైమ్‌లో సౌకర్యంగా కూడా ఉండాలి. అందుకు పువ్వుల ప్రింట్లతో ఉండే కాటన్ క్లచ్‌ను ముంజేతికి ధరిస్తే చాలు. షికారులో హుషారు జనపనార, రంగులద్దిన నూలుతో ఉన్న అందమైన క్లచ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి తక్కువ ధరకు కూడా లభిస్తాయి. టూర్లకు వెళ్లినప్పుడు జ్యూట్ క్లచ్‌లు అనుకూలంగా ఉంటాయి. ప్లెయిన్ జ్యూట్ క్లచ్ కొనుగోలు చేసి, నూలు దారాలతో మీదైన అభిరుచికి పని కల్పించవచ్చు. పార్టీలో ప్రత్యేకం వేసవి సాయంకాలాల్లో పార్టీలు తరచూ అవుతుంటాయి. మీ డ్రెస్‌తో పాటు ఏదైనా ప్రత్యేకత చూపించాలంటే లెదర్, బటర్ ఫ్లై, డిజైనర్ హ్యాండిల్ క్లచ్ని చేతికి తొడిగేస్తే చాలు. ట్రాన్స్పరెంట్గా.. ట్రాన్స్పరెంట్, టు బ్యాగ్ మోడల్స్ క్యాజువల్‌గానూ, ప్రత్యేక సందర్భాలలోనూ తీసుకెళ్లవచ్చు. ఇలాంటి విభిన్నమైన క్లచ్బ్యాగ్లలో ఏది మీ చేతిని అలంకరిస్తుందో ధరించే దుస్తులు, సందర్భాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. – ఎన్.ఆర్. -
హ్యాండ్ బ్యాగ్‌లపై స్టాంపింగ్ కంటిన్యూ..
న్యూఢిల్లీ: దేశంలోని ఏడు విమానాశ్రయాల్లో ప్రయాణికులు మోసుకెళ్లే బ్యాగ్‌లపై స్టాంపు వేయడం మానేయాలన్న నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ మేరకు జరిగిన ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విమాన ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, కొచ్చి విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల బ్యాగులపై స్టాంపులు వేయకూడదని నిర్ణయించినట్లు బీసీఏఎస్ (బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ) ఫిబ్రవరి 23నే ప్రకటించింది. సీసీ కెమెరాలు అమర్చడంవంటి భద్రతా ఏర్పాట్లు ఇంకా పూర్తికానందున ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాల్సిందిగా విమానాశ్రయాల్లో భద్రత బాధ్యతలు చూసే సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) అప్పట్లోనే కోరింది. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాలు సమావేశమయ్యారు. భద్రతా ఏర్పాట్లను త్వరగా పూర్తి చేసేందుకు బీసీఏఎస్, సీఐఎస్ఎఫ్, ఏడు విమానాశ్రయాల నిర్వాహకులతో కలిపి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ ఆమోదం తెలిపిన వెంటనే బ్యాగ్‌లపై స్టాంపులు వేయడాన్ని నిలిపివేస్తారని మంత్రులు తెలిపారు. -
హ్యాండ్ బ్యాగ్ హ్యాండిల్ చేయాలిలా!!
ఆడవారికి అత్యవసరమైపోయిన వస్తువుల్లో హ్యాండ్ బ్యాగ్ ముఖ్యమైనది. ఒకప్పుడు అవసరమైన వస్తువుల్ని మోసేందుకు ఉపయోగించిన ఈ బ్యాగులు... ఇప్పుడు ఫ్యాషన్‌లో భాగమైపోయాయి. అందుకే ఆడవారిని అనుక్షణం అంటిపెట్టుకుని ఉంటున్నాయి. అయితే వీటిని క్యారీ చేస్తే చాలదు... పది కాలాల పాటు కాపాడుకోవాలంటే కేర్ తీసుకోవడం కూడా తెలియాలి. లేదంటే ఎంత ఖరీదైన బ్యాగ్ అయినా కళ్లు మూసి తెరిచేలోగా కళావిహీనమైపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే... ♦ అందరూ కామన్‌గా చేసే తప్పు... అవసరమైనవన్నీ బ్యాగులో కూరేయడం. అది ఇంత లావు అయిపోతుంది. దాంతో అందం పోతుంది. మీరు ఏం పెట్టినా, ఎన్ని పెట్టినా బ్యాగ్ షేప్ మారనివ్వనంత వరకే. ♦ పౌడర్, క్రీమ్, మాయిశ్చరైజర్, నూనె, జెల్, లిప్‌స్టిక్ అంటూ ప్రతి దానినీ బ్యాగులో వేసేస్తారు. అలా నేరుగా వేయకూడదు. ఒక పౌచ్‌లో వేసుకుని, ఆ పౌచ్‌ని బ్యాగ్‌లో వేసుకోవాలి. లేదంటే మరకలు పడిపోతాయి. ♦ సూదిగా ఉండే వస్తువులు బ్యాగ్‌లో వేయకూడదు. కావాలంటే బాక్స్‌లో కానీ పౌచ్‌లో కానీ పెట్టి వేసుకోవాలి. ♦ కూలింగ్ వాటర్ బాటిళ్లు, ఐస్‌క్రీమ్ వంటివి పెట్టకూడదు. ఆ తడి బ్యాగ్ మెటీరియల్‌ను పాడు చేస్తుంది. అలాగే లంచ్ బాక్సులు కూడా. అవి బ్యాగ్ సహజ వాసనను పోగొట్టి దుర్వాసనకు దారితీస్తాయి. ♦ ఏ క్రీమో, నూనో రాసేసుకుని ఆ చేత్తోనే వెంటనే బ్యాగ్ తీసుకుని బయలుదేరిపోతారు. ఆ అలవాటు చాలు బ్యాగ్‌ని పాడు చేయడానికి. శుభ్రంగా చేతులు కడుక్కుని, తుడుచుకున్నాకే బ్యాగ్ పట్టుకోవాలి. ♦ లెదర్ అయినా, మరే మెటీరియల్ అయినా సబ్బు పెట్టి ఉతక్కూడదు. నీటిలో లిక్విడ్ డిటర్జెంట్ కలిపి, మెత్తని గుడ్డను ముంచి, దానితో బ్యాగ్‌ను మృదువుగా తుడవాలి. ♦ మరకపడితే వీలైనంత త్వరగా దాన్ని తొలగించేందుకు ప్రయత్నించాలి. బాగా ఆరిపోయిన తర్వాత కొన్ని రకాల మెటీరియల్స్ మీది నుంచి మరకను తొలగించడం కష్టం. ♦ బ్యాగ్ దుర్వాసన వస్తోంటే డియోడరెంట్లు, సెంట్లు కొట్టకండి. ఓ చిన్న డబ్బాలో బేకింగ్ సోడాను వేసి బ్యాగ్‌లో ఉంచుకోండి. కొన్ని గంటలు గడిచేసరికి ఆ వాసనను సోడా పీల్చుకుంటుంది. దుర్వాసన పోతుంది. ♦ వాడనప్పుడు బ్యాగ్‌ని ఏ షెల్ఫులోనో పడేసి ఉంచుతారు. అలా చేయకూడదు. డస్ట్ బ్యాగ్స్ అని ఉంటాయి. వాటిలో పెట్టి దాచాలి. అప్పుడే దుమ్ము చేరకుండా ఉంటుంది. కావాలంటే దిండు కవర్లో పెట్టి కూడా దాచుకోవచ్చు. -
జ్యూటిఫుల్
హ్యాండ్ బ్యాగ్‌లు మొదలుకొని ఇయర్ రింగ్స్ వరకూ ప్రతిదీ కళాఖండమే. ఆకర్షించే అందమే. ఖైరతాబాద్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్లో బుధవారం ప్రారంభమైన ‘జ్యూట్ డెకరేటివ్ ప్రొడక్ట్స్’ ఎగ్జిబిషన్లో జనపనారతో రూపొందించిన కళాకృతులు, ఆభరణాలు అబ్బురపరుస్తున్నాయి. పర్యావరణానికి హాని కలిగించని ఈ ఉత్పత్తుల్లో ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు, డిజైనింగ్ బ్యాగ్‌లు, ఫుట్‌వేర్, ఫ్యాబ్రిక్స్, డోర్ మ్యాట్స్ వంటివెన్నో వెరైటీలున్నాయి. రాష్ట్రంతో పాటు పశ్చిమ బెంగాల్, యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల్లో తయారు చేసిన జ్యూట్ ఉత్పత్తులు మనసు దోచుకుంటున్నాయి. ధరలు రూ.10 నుంచి రూ.1,600 వరకు ఉన్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, నేషనల్ జ్యూట్ బోర్డ్ మార్కెటింగ్ ప్రమోషన్ ఆఫీసర్ నర్సింహులు ఇక్కడి స్టాల్స్‌లోని ఉత్పత్తులను పరిశీలించారు. ఈ నెల 22 వరకు ప్రదర్శన కొనసాగుతుంది.