భుజానికి బ్యాగ్ వేసుకోవడం, చేత్తో బ్యాగ్ పట్టుకోవడం మామూలే! కానీ, ఇలా చేతిని పట్టుకున్నట్టు ఉండే బ్యాగ్ అయితే ఈ వేసవికి కాస్త రిలీఫ్‌గా, మరికాస్త స్టైల్‌గా కనిపించొచ్చు. అంతే కాదు ఈ క్లచ్ బ్యాగ్స్ హ్యాండిల్ ముంజేతికి ఆభరణంగానూ అందంగా అమరిపోతుంది.
ఎక్కడకు వెళ్లినా!
బజారుకు వెళుతున్నప్పుడు వెంట పర్స్ తీసుకెళ్లడం మామూలే! ఫోన్, డబ్బులు, కార్డులు ఆ పర్స్‌లో పట్టాలి. అలాగే స్టైల్‌గా, ప్రత్యేకంగా కనిపించాలి. అదే టైమ్‌లో సౌకర్యంగా కూడా ఉండాలి. అందుకు పువ్వుల ప్రింట్లతో ఉండే కాటన్ క్లచ్‌ను ముంజేతికి ధరిస్తే చాలు.
షికారులో హుషారు
జనపనార, రంగులద్దిన నూలుతో ఉన్న అందమైన క్లచ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి తక్కువ ధరకు కూడా లభిస్తాయి. టూర్లకు వెళ్లినప్పుడు జ్యూట్ క్లచ్‌లు అనుకూలంగా ఉంటాయి. ప్లెయిన్ జ్యూట్ క్లచ్ కొనుగోలు చేసి, నూలు దారాలతో మీదైన అభిరుచికి పని కల్పించవచ్చు.
పార్టీలో ప్రత్యేకం
వేసవి సాయంకాలాల్లో పార్టీలు తరచూ అవుతుంటాయి. మీ డ్రెస్‌తో పాటు ఏదైనా ప్రత్యేకత చూపించాలంటే లెదర్, బటర్ ఫ్లై, డిజైనర్ హ్యాండిల్ క్లచ్‌ని చేతికి తొడిగేస్తే చాలు.
ట్రాన్స్‌పరెంట్‌గా..
ట్రాన్స్‌పరెంట్, టు బ్యాగ్ మోడల్స్ క్యాజువల్‌గానూ, ప్రత్యేక సందర్భాలలోనూ తీసుకెళ్లవచ్చు. ఇలాంటి విభిన్నమైన క్లచ్‌బ్యాగ్‌లలో ఏది మీ చేతిని అలంకరిస్తుందో ధరించే దుస్తులు, సందర్భాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు.
– ఎన్.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment