క్రియేటివ్ జీల్‌కి నిలువెత్తు నిదర్శనం స్టయిలిస్ట్ నిధి జెస్వానీ! అవుట్ డేటెడ్ అనే మాటను దరిదాపుల్లోకి కూడా రానీయదు. డిజైన్స్‌లో కానీ.. స్టయిలింగ్‌లో కానీ కాలమే ఆమెతో పోటీ పడాలి!
నిధి జెస్వానీ.. పుట్టి, పెరిగింది ముంబైలో! మాస్ మీడియాలో డిగ్రీ, అడ్వర్టయిజింగ్‌లో మాస్టర్స్ చేసింది. చదువైపోయాక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్ తాన్యా ఘావ్రీ దగ్గర ఇంటర్న్‌గా చేరింది. ఎన్నో ఫ్యాషన్ షోలకు అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా పనిచేసింది. వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు సెలబ్రిటీల వివాహాది శుభకార్యాల్లో వారి కుటుంబ సభ్యులకు స్టయిలింగ్ చేసింది. తను స్టయిల్ చేసే ప్రతివ్యక్తి ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే లేటెస్ట్ ఫ్యాషన్‌ను అనుసరిస్తూ వాళ్లను అందంగా, ఎలిగెంట్‌గా ప్రెజెంట్ చేసి, అతిథుల ఫేవరిట్ స్టయిలిస్ట్‌గా మారింది.
క్రియేటివిటీ హై లెవెల్లో ఉండే తన డిజైన్స్‌తో బాలీవుడ్ అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాలకు ఆమెను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పెట్టుకున్నారు. ఆధునిక డిజైన్స్‌కు సంప్రదాయ టచ్‌నిచ్చి, చాలా త్వరగా నిధి బాలీవుడ్‌లో తన ప్రత్యేకతను చాటింది. అది సెలబ్రిటీలే ఆమెను సంప్రదించేలా చేసింది. మీరా కపూర్, నుస్రత్ భరూచా, శ్రద్ధా శ్రీకాంత్, భూమి పెడ్నేకర్, కృతి శెట్టి, రకుల్‌ప్రీత్ సింగ్, మృణాల్ ఠాకూర్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, కృతి సనన్‌లకు స్టయిలిస్ట్‌గా పనిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment