నాటి తరం అమ్మమ్మల కాలం నుంచి నేటి తరం అమ్మాయిల వరకు ఆల్‌టైమ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా ‘జూకాలు (బుట్టలు)’ ఛాన్స్ కొట్టేస్తాయి.
నాటి తరం అమ్మమ్మల కాలం నుంచి నేటి తరం అమ్మాయిల వరకు ఆల్‌టైమ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా ‘జూకాలు (బుట్టలు)’ ఛాన్స్ కొట్టేస్తాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ‘బుట్ట’ల సింగారం ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా నిలుస్తూనే ఉంది. వేడుక చిన్నదైనా పెద్దదైనా బుట్టబొమ్మల్లాంటి మగువల లుక్‌నే మార్చేసే ఘనత ‘బుట్ట’లకు ఉంది.
ఆధునికం: సిల్క్ ప్యాంట్ పైకి ఎంబ్రాయిడరీ కోర్‌సెట్ వేసుకొని, చెవులకు పెద్ద పెద్ద బంగారు బుట్టలు ధరిస్తే చాలు అటు పెళ్లిలోనూ, ఇటు కాక్‌టెయిల్ పార్టీలోనూ అదుర్స్ అనిపిస్తారు. ఈ స్టైల్ కాస్త మోడ్రన్ కాస్త ట్రెడిషనల్‌గా ఉంటుంది. కాబట్టి రెండు విధాల మేలు. పెద్ద బుట్టలు పాశ్చాత్య దుస్తులను మరింత అందంగా చూపిస్తాయి. అయితే సంప్రదాయ తరహా బుట్టల్లోనే విభిన్నమైన షేప్స్‌ను ఎంచుకోవాలి. యాంటిక్ లుక్ ఉన్న బుట్టాలు మీ ఆభరణాల లిస్ట్‌లో ఉన్నాయంటే ఏ డ్రెస్ మీదకైనా సూపర్బ్ జ్యూయలరీగా అమరిపోతాయి.
భిన్నత్వం: జూకాలు సంప్రదాయతను చాటుతాయి. అందుకని వేషధారణలో ఎంత భిన్నత్వం చూపిస్తే అంత ఆధునికంగా కనిపించవచ్చు. మీనాకారి జూకాలైతే ఏ కలర్ డ్రెస్ అయినా ధరించవచ్చు.
తెల్లని డ్రెస్ ధరిస్తే: పెద్ద బంగారు బుట్టలను ధరించాలి. అయితే మెడలో మరేలాంటి ఆభరణం ధరించకపోవడం ఉత్తమం. మేకప్ కూడా చాలా తక్కువగా ఉండాలి.
సిల్వర్ జూకాలు: క్యాజువల్ డ్రెస్సులు ఏవి ధరించినా వాటి మీదకు సిల్వర్ బుట్టలు చక్కగా నప్పుతాయి.