జ్యువెలరీ కంపెనీని మోసం చేసిన నటి..? | Hina Khan Has Been Accused Of A Jewellery Fraud | Sakshi
Sakshi News home page

జ్యువెలరీ కంపెనీని మోసం చేసిన నటి..?

Published Thu, Jul 19 2018 1:14 PM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM

Hina Khan Has Been Accused Of A Jewellery Fraud - Sakshi

హీనా ఖాన్‌ (ఫైల్‌ ఫోటో)

‘బిగ్‌ బాస్‌ 11’ మాజీ కంటెస్టెంట్‌ హీనా ఖాన్‌ నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటారు. ‘బిగ్‌ బాస్‌ హౌస్‌’లో ‘మిస్‌ రైట్‌’గా పిలుచుకునే హీనా ఖాన్‌ గురించి ఇప్పుడు ఒక తప్పుడు వార్త న్యూస్‌ చానళ్లలో ప్రచారం అవుతుందంట. ఒక బంగారు ఆభరణాల కంపెనీ ప్రకటనలో నటించిన హీనా ఖాన్‌, ప్రకటన షూటింగ్‌ అనంతరం బంగారు ఆభరణాలను కంపెనీకి తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే అట్టే పెట్టుకుందంట. ఇందుకు గాను సదరు కంపెనీ హీనా ఖాన్‌కు లీగల్‌ నోటీసులు కూడా పంపారనేది ఆ వార్త సారాంశం.

ఈ విషయం గురించి హీనాను అడగ్గా ఆమె దీన్ని ఖండించారు. అనంతరం తన ట్విటర్‌లో ‘లీగల్‌ నోటీస్‌లు ముందు నా ఇంటికి రాకుండా మీడియా హౌస్‌కు ఎలా వెళ్లాయనేది నాకు అర్ధం కావడం లేదంటూ’ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక ‘నా శత్రువులు నన్ను క్షమించాలి. మీ ఈ ఉపాయం పని చేయలేదు. మరి కాస్తా కొత్తగా ట్రై చెయ్యండి’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా తనకు ఎలాంటి లీగల్‌ నోటీసులు రాలేదని తెలిపారు. కానీ న్యూస్‌ చానల్‌ వారు మాత్రం హీనా ఖాన్‌ అడ్రస్‌తో ఉన్న లీగల్‌ నోటీసులను ప్రచారం చేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా హీనా ఖాన్‌ మ్యూజిక్‌ వీడియో ‘భసూది’ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ మ్యూజిక్‌ వీడియోను ఇప్పటికే 8 లక్షల మంది వీక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement