వైశాలి బెనర్జీ
కొరుక్కుపేట: ప్లాటినం నగలపై యువతకు మోజు పెరగుతుందని, దీంతో ప్లాటినం అమ్మకాలు పెరుగున్నాయని ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ) మేనేజింగ్ డైరెక్టర్ వైశాలి బెనర్జీ అన్నారు. సోమవారం చెన్నైలో జరిగిన సమావేశంలో ఆమె మట్లాడారు. ప్లాటినం జ్యువెలరీ బిజినెస్ రివీవ్– 2017 ఇటీవల చేపట్టామన్నారు. అందులో ఇండిపెండెంట్ ప్లాటినం మార్కెట్ నిపుణులు, ఇండస్ట్రీ అనలిస్ట్ సంయుక్తంగా భారత్‌లో కన్సూమర్ రీటైల్ సేల్స్ గ్రోత్‌పై సర్వే నివేదికను అందించారన్నారు. భారత్‌లో ప్లాటినం మార్కెట్ గ్రోత్ పటిష్టంగా ఉందన్నారు.
రీటైల్ సేల్స్ 21 శాతం ఏటా పెరుగుతున్నాయన్నారు. ఫ్యాబ్రికేషన్ డిమాండ్ గ్రోత్ ఏడాది ఏడాదికి 34 శాతం పెరుగుతున్నట్లు తెలిపారు. ప్రసుత్తం ప్యాషన్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో యువత సైతం ప్లాటినం జ్యువెలరీపై మోజు పెరుగుతుందన్నారు. బ్రైడల్ మార్కెట్ సైతం చైనా, జపాన్, యూఎస్‌తోపాటు భారత్‌లో పెరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment