
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ని టాప్ డైమండ్ వ్యాపారి, అత్యంత ధనికవంతుల్లో ఒకరైన సెలబ్రిటీ జ్యుయర్ నిరావ్ మోదీకి సీబీఐ భారీ షాకిచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును కోట్ల రూపాయల మేర మోసం చేసిన చేసిన కేసులో కేసు నమోదు చేసింది. నిరావ్ మోదీ అనుమాన్సాద లావాదేవీల కేసులో సీబీఐ విచారణ జరుగుతోందని పీఎన్‌బీ వెల్లడించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి రూ.280 కోట్ల చీటింగ్ కేసులో భాగంగా ఆయనపై సీబీఐ అభియోగాలు మోపినట్టు అధికారులు సోమవారం తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ చర్య చేపట్టింది. డైమండ్ ఆర్ యు, సోలార్ ఎక్స్పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్ కంపెనీ భాగస్వాములైన మోదీ, ఆయన సోదరుడు నిషాల్, భార్య అమీ, మెహల్ చినూభాయ్ చోక్సి బ్యాంకు అధికారులతో కుట్ర పన్నారని పీఎన్‌బీ ఫిర్యాదు చేసింది. తద్వారా తమకు భారీ నష్టం వాటిల్లిందని బ్యాంకు ఆరోపించింది.కాగా బిలియనీర్ నిరావ్ మోదీ ఆస్తులపై దృష్టిపెట్టిన ఐటీ అధికారులు ఢిల్లీ, సూరత్, జయపూర్‌లోని ఆఫీసులపై జనవరి 31న దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. లండన్, న్యూయార్క్, లాస్ వెగాస్, హవాయి, సింగపూర్, బీజింగ్, మకావ్‌లోనూ, ఇండియాలో ముంబై , ఢిల్లీ నగరాల్లో సెలబ్రిటీ డైమండ్ జ్యుయలరీ స్టోర్స్ ఉన్నాయి. ఫైర్‌స్టార్ డైమండ్ స్థాపకుడు, డిజైనర్ నిరావ్ మోదీ ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీ డైమండ్ డిజైన్లకు మంచి ప్రఖ్యాతి గాంచాడు.

Nirav modi (file Photo)
Comments
Please login to add a commentAdd a comment