లేడీస్ హాస్టళ్లలో ఒంటరిగా ఉన్న యువతులపై.. | Accused Of Several Rapes, Bengaluru Man Let Off, Is Arrested For Another | Sakshi
Sakshi News home page

లేడీస్ హాస్టళ్లలో ఒంటరిగా ఉన్న యువతులపై..

Published Thu, Mar 9 2017 9:20 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

లేడీస్ హాస్టళ్లలో ఒంటరిగా ఉన్న యువతులపై..

లేడీస్ హాస్టళ్లలో ఒంటరిగా ఉన్న యువతులపై..

బెంగళూరు: మూడేళ్ల క్రితం అత్యాచారం కేసులో అరెస్టయిన శివరామ రెడ్డి అనే నిందితుడు.. జైలు నుంచి విడుదలయ్యాక మరో ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.

చిత్తూరు జిల్లాకు చెందిన శివరామ రెడ్డి 15 ఏళ్లుగా బెంగళూరులో ఉంటున్నాడు. 2014లో రేప్ కేసులో అరెస్టయి.. 2015లో జైలు నుంచి విడులయ్యాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. బెంగళూరులో ఒంటరిగా మహిళలను, ముఖ్యంగా మహిళల హాస్టళ్లను లక్ష్యంగా చేసుకునేవాడు. ఈ నెల 2న కత్తితో బెదిరించి హాస్టల్‌లో తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని 23 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు రోజుల తర్వాత మరో హాస్టల్‌లో ఉంటున్న మరో యువతి తనపై లైంగికదాడి చేసి, వస్తువులు దోచుకెళ్లాడని ఫిర్యాదు చేసింది.

బాధిత మహిళలు చెప్పిన సమాచారాన్ని బట్టి పోలీసులు నిందితుడ్ని శివరామిరెడ్డిగా గుర్తించారు. పోలీసులు అతని పాత ఫోటో చూపించగా, బాధిత యువతులు గుర్తించారు. పోలీసులు పక్కా సమాచారంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా కత్తితో దాడి చేయడంతో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు అతని కాలికి కాల్చి అదుపులోకి తీసుకున్నారు. 2013-14లో అతను పలువురు మహిళలను లైంగికంగా వేధించినట్టు నాలుగు కేసులు నమోదయ్యాయి. అయితే ఏడాదికే జైలు నుంచి బయటకు వచ్చిన శివరామి రెడ్డి మళ్లీ నేరాలబాట పట్టాడు. మొత్తం అతనిపై 16 కేసులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement