అల్లూరి జిల్లా జామిగుడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘటన
అరకులోయ ఏరియా ఆస్పత్రికి 61 మంది తరలింపు
ముగ్గురు పరిస్థితి విషమం
ఆశ్రమ పాఠశాలలోనే మిగిలిన వారికి వైద్యసేవలు
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుíÙత ఆహారం కారణంగా 79 మంది గిరిజన విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కోడి గుడ్డు, రసంతో భోజనం తిన్న కొద్ది సేపటికే విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు.
వీరిలో 61 మందిని హుటాహుటిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. వీరిలో 7వ తరగతి చదువుతున్న సౌజన్య, 6వ తరగతి చదువుతున్న ఎస్.దీవెన, 8వ తరగతి చదువుతున్న జెస్సీల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఆశ్రమ పాఠశాలలో మొత్తం 520 మంది గిరిజన విద్యార్థినులు ఉన్నారు.
ప్రాంతీయ ఆస్పత్రిలో 61 మంది వైద్యసేవలు పొందుతుండగా, జామిగుడ ఆశ్రమ పాఠశాలలోనే మిగిలిన విద్యార్థినులకు కిల్లోగుడ పీహెచ్‌సీ వైద్య బృందం వైద్యసేవలు అందిస్తోంది. రాత్రి 11.30 గంటల సమయంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినులకు అందిస్తున్న వైద్యసేవలను సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment