
శివకుమార్ (ఫైల్)
ముఖ్యోపాధ్యాయుడు శివకుమార్ ప్రత్యేక తరగతుల పేరుతో విద్యార్థినులను పిలిపించి లైంగికంగా వేధించాడు.
యశవంతపుర(కర్ణాటక): హాస్టల్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఓ ముఖ్యోపాధ్యాయుడికి హాసన జిల్లా అరకలగూడు పోలీసులు బేడీలు వేశారు. అరకులగూడు వసతి పాఠశాలలో 35 మంది విద్యార్థినులు వసతి పొందుతుండగా ముఖ్యోపాధ్యాయుడు శివకుమార్ ప్రత్యేక తరగతుల పేరుతో విద్యార్థినులను పిలిపించి లైంగికంగా వేధించాడు.
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ప్రిన్సిపాల్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈయన మొత్తం 15 మందిని లైంగికంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: ‘మీ కుమారుడు మా స్కూల్‌లో అవసరం లేదు.. ఇంటికి తీసుకుపోండి’