అమ్మాయిలు 10.. అబ్బాయిలు 8..!
న్యూయార్క్: కాలేజీలో చదువుకుంటున్న అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారట. రోజుకు సరాసరిన అమ్మాయిలు 10 గంటల పాటు సెల్ఫోన్ వాడితే.. అబ్బాయిలు 8 గంటలు ఉపయోగిస్తున్నారు. అమెరికాలో ఓ యూనివర్సిటీ బృందం చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
టెక్సాస్లోని బేలర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేమ్స రాబర్ట్స్ బృందం కాలేజీ విద్యార్థులు సెల్ఫోన్ల వాడుక అంశంపై పరిశోధన చేశారు. రాబర్ట్స్ బృందం ఆన్లైన్ ద్వారా ఈ సర్వే చేసింది. సెల్ఫోన్లకు బానిసలయ్యామని 60 శాతం మంది విద్యార్థులు అంగీకరించారని చెప్పారు. సెల్ఫోన్లను ఎక్కువగా వాడటం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. సెల్ఫోన్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్తో ఎక్కువ సమయం గడుపుతుంటారని తెలిపారు. అబ్బాయిలు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసం సెల్ఫోన్లు వాడుతారని, అమ్మాయిలు సామాజిక విషయాల కోసం ఉపయోగిస్తారని రాబర్ట్స్ వెల్లడించారు.