న్యూఢిల్లీ: విద్యార్థినులపట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ)లో వైఫై సౌకర్యాన్ని విద్యార్థినులకు ఇవ్వడం లేదని, ఇతర ఇబ్బందులకు కూడా గురిచేస్తున్నారని వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ‘నేను బీహెచ్‌యూ నుంచి సమాచారం సేకరించాను. ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల పట్ల ఎలాంటి వివక్ష ఉన్నట్లు నాకు అనిపించలేదు’ అని అన్నారు.
అబ్బాయిలతో సమానంగా విద్యార్థినులకు వైఫై సౌకర్యం అందించకపోవడంతోపాటు హాస్టల్‌లో మాంసాహారం తినేందుకు అనుమతివ్వడం లేదని, మెస్‌లోకి షార్ట్స్ వేసుకొని వెళ్లనివ్వడం లేదని 10గంటల తర్వాత ఫోన్‌లు చేసుకోనివ్వడం లేదని ఆయా పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓమంత్రి అడిగిన ప్రశ్నకు ఆయన జవదేకర్ పై విధంగా సమాధానం ఇచ్చారు.
విద్యార్థినులపై వివక్షేం లేదు: కేంద్ర మంత్రి
Published Mon, Mar 27 2017 2:17 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
Advertisement
Advertisement