విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన! | teacher vikas molestation alleges in warangal district | Sakshi
Sakshi News home page

విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన!

Published Sat, Sep 26 2015 12:45 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన! - Sakshi

విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన!

కురవి(వరంగల్): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా కురవి మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలోని భౌతికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు వికాస్ గత కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

దీంతో విసిగిపోయిన విద్యార్థినులు ఈ విషయాన్ని బయటపెట్టాలని భావించారు. శుక్రవారం నాడు బాధితులు స్కూల్ ఎదుట తల్లిదండ్రులతో కలసి ఆందోళన చేయడంతో అసలు విషయం బయటపడింది. విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల ఆందోళనతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement