
రోడ్డు ప్రమాదంలో గుర్రం మృతి
గుండ్రాంపల్లి(చిట్యాల)
చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్రం మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలమూరు జిల్లాకు చెందిన గొర్రెల కాపరులు తమ గొర్రెలతో పాటు గుర్రంతో హైదరాబాద్ వైపునకు వెళుతున్నారు. మండలంలోని గుండ్రాంపల్లి గ్రామ శివారులోకి రాగానే జాతీయ రహదారిని దాటే క్రమంలో గుర్రాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్రం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది.