గుర్రం దాడి చేయడంతో యువకుడి మృతి
హైదరాబాద్: పెళ్లి బారాత్‌లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు గుర్రపు బగ్గీకి ఉన్న ఓ గుర్రం మర్ఫా (డప్పు) కొడుతున్న.. ఓ యువకుడిని తన్నడంతో అతడు కింద పడి వుృతి చెందాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పాతనగరం బోయిగూడ కమాన్ ఘోడెవాడికి చెందిన మదార్ హుస్సేన్ (18) శుభకార్యాలలో మర్ఫా కొడుతూ జీవనం సాగిస్తున్నాడు.
శుక్రవారం రాత్రి గోల్కొండ ఫ్రన్ కాటేజ్‌కు చెందిన యూనుస్ అనే యువకుడి పెళ్లికి మదార్ హుస్సేన్ తన బృందంతో మర్ఫా కొట్టడానికి వచ్చాడు. రాత్రి 10 గంటలకు పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా బగ్గీ లాగుతున్న ఓ ఆడగుర్రం పక్కనే మర్ఫా కొడుతున్న మదార్ హుస్సేన్‌ను వెనుక కాలితో ఛాతీపై తన్నింది. దీంతో అతడు విలవిలలాడుతూ కిందపడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అతనిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా. చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందాడు.