
మెగా తనయుడు, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీకి జంటగా కనిపించనుంది. ఇకపోతే చిన్నప్పట్నుంచి రామ్ చరణ్‌కు హార్స్ రైడింగ్ ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. అంతే కాకుండా మగధీర చిత్రంలో గుర్రపు స్వారీ అభిమానులను కట్టిపడేసింది. ఆ సీన్స్ అభిమానులను ఇప్పటికీ మర్చిపోలేరు. ఇసుకలో కురుకుపోయిన రామ్ చరణ్‌ను గుర్రం కాపాడే సీన్ ఎమోషనల్‌గా టచ్ చేసింది.
(ఇది చదవండి: రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'టైగర్ నాగేశ్వరరావు' వచ్చేస్తున్నాడు)
అయితే గతంలో ఉపయోగించిన మగధీర సినిమాలోని గుర్రం పేరు బాద్‌షా. అప్పట్లో సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుర్రాన్ని ఇంటికి తెచ్చుకుని ‘కాజల్’ అని పేరు పెట్టుకున్నారు చెర్రీ. వీలు చిక్కినప్పుడల్లా అలా గుర్రంపై సరదాగా రైడింగ్ చేసేవారు మన గ్లోబల్ స్టార్. మగధీర గుర్రంతో పాటు ఆయన దగ్గర మరిన్నీ హార్సెస్ కూడా ఉన్నాయి.
అయితే తాజాగా మరో గుర్రాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెర్రీ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 'బ్లేజ్.. మై న్యూ ఫ్రెండ్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ కోసమేనా అన్నా అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ఫోటో చూస్తుంటే అచ్చం మగధీరలోని గుర్రమే అభిమానులకు గుర్తుకు వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment