గుర్రం అంటే రాజసం, పౌరుషం. అందుకే గుర్రాల వాల్ పేపర్‌ను, అందమైన గుర్రం పెయింటింగ్‌లను చాలామంది ఇష్టపడతారు. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం, రాజు ఎక్కే రంగుల గుర్రం, రాణి ఎక్కే కీలు గుర్రం, రాకుమారి ఎక్కే రత్నాల గుర్రం. గుర్రపు స్వారీ ఒక ఫ్యాషన్...సాహస క్రీడ.
పెంపుడు జంతువుగా గుర్రాని ఎంచుకోవడం కొందరికి హాబీ. మరికొందరి అదొక వృత్తి. వ్యాపారం కూడా. అందుకే గుర్రాలను బలమైన దాణాను అందిస్తారు. అందంగా తయరు చేస్తారు.అంతేకాదుకొన్ని రకాల గుర్రాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటి ద్వారా పోలియో, పక్షవాతం మెదడు, వెన్నెముక సమస్యలు... వినికిడి, భావ వ్యక్తీకరణ, స్థిమితం కోల్పోవడంవంటి వాటికి చికిత్సగా గర్రపు స్వారీని వాడతారట.
Before 🐎 After 🦄 pic.twitter.com/9R1jYkoZxI
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 30, 2024
గుర్రాలు ఆరోగ్యంగా, సరిగ్గా పనిచేయాలంటే దానికి నిరంతరం, బ్రషింగ్, గ్రూమింగ్ అవసరం అంటున్నారు జంతు సంరక్షణ నిపుణులు. ప్రతీ రోజు గుర్రం శరీరంలోని ప్రతి అణువును అప్యాయంగా తాకుతూ ఉంటే యజమాని, గుర్రం మధ్య బంధం పెరగడమేకాదు ఇది ప్రీవెంటివ్ మెడిసిన్‌లాగా పనిచేస్తుందట. అంటే దాని శరీరంపై మనకు తెలియకుండా ఏమైనా గాయాలు, పుండ్లు లాంటివి వుంటే అర్థమవుతాయి.
అలా ఒక గుర్రాన్ని చక్కగా జుట్టు కత్తిరించి, రకరకాల క్రీములతో శుభ్రంగా స్నానం చేయించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వివేషంగా నిలుస్తోంది. మనుషులకేనా తైల మర్దనాలు, అభ్యంగనస్నానాలు.. గుర్రాలకు కూడా అన్నట్టుగా ఉన్న ఈ వీడియో నెటిజనులకు తెగ నచ్చేస్తోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ఎక్స్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియో దాదాపు 8.5 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment