DECARATION
-
గ్రూమింగ్ అంటే ఇదీ! మీరే చూడండి దీని వయ్యారం!
గుర్రం అంటే రాజసం, పౌరుషం. అందుకే గుర్రాల వాల్ పేపర్‌ను, అందమైన గుర్రం పెయింటింగ్‌లను చాలామంది ఇష్టపడతారు. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం, రాజు ఎక్కే రంగుల గుర్రం, రాణి ఎక్కే కీలు గుర్రం, రాకుమారి ఎక్కే రత్నాల గుర్రం. గుర్రపు స్వారీ ఒక ఫ్యాషన్...సాహస క్రీడ. పెంపుడు జంతువుగా గుర్రాని ఎంచుకోవడం కొందరికి హాబీ. మరికొందరి అదొక వృత్తి. వ్యాపారం కూడా. అందుకే గుర్రాలను బలమైన దాణాను అందిస్తారు. అందంగా తయరు చేస్తారు.అంతేకాదుకొన్ని రకాల గుర్రాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటి ద్వారా పోలియో, పక్షవాతం మెదడు, వెన్నెముక సమస్యలు... వినికిడి, భావ వ్యక్తీకరణ, స్థిమితం కోల్పోవడంవంటి వాటికి చికిత్సగా గర్రపు స్వారీని వాడతారట.Before 🐎 After 🦄 pic.twitter.com/9R1jYkoZxI— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 30, 2024గుర్రాలు ఆరోగ్యంగా, సరిగ్గా పనిచేయాలంటే దానికి నిరంతరం, బ్రషింగ్, గ్రూమింగ్ అవసరం అంటున్నారు జంతు సంరక్షణ నిపుణులు. ప్రతీ రోజు గుర్రం శరీరంలోని ప్రతి అణువును అప్యాయంగా తాకుతూ ఉంటే యజమాని, గుర్రం మధ్య బంధం పెరగడమేకాదు ఇది ప్రీవెంటివ్ మెడిసిన్‌లాగా పనిచేస్తుందట. అంటే దాని శరీరంపై మనకు తెలియకుండా ఏమైనా గాయాలు, పుండ్లు లాంటివి వుంటే అర్థమవుతాయి.అలా ఒక గుర్రాన్ని చక్కగా జుట్టు కత్తిరించి, రకరకాల క్రీములతో శుభ్రంగా స్నానం చేయించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వివేషంగా నిలుస్తోంది. మనుషులకేనా తైల మర్దనాలు, అభ్యంగనస్నానాలు.. గుర్రాలకు కూడా అన్నట్టుగా ఉన్న ఈ వీడియో నెటిజనులకు తెగ నచ్చేస్తోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ఎక్స్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియో దాదాపు 8.5 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. -
Antilia: అంబానీ ఇల్లు.. అంతా రామమయం.. వీడియో వైరల్
అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట ఉత్సవాలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 7000 మంది ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు, దేశం మొత్తం చిన్నా.. పెద్దా దేవాలయాలు సైతం సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. ఈ తరుణంలో భారతీయ పారిశ్రామిక దిగ్గజం 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) ముంబైలోని తన నివాస భవనాన్ని రామ నామంతో నింపేశారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ముఖేష్ అంబానీ తన యాంటిలియా భవనాన్ని చాలా అందంగా డెకరేట్ చేయించారు. మొత్తం భవనం దీపాలతో, జై శ్రీరామ్ అనే నామాలతో సెట్ చేయించారు. అద్భుతమైన లైటింగ్‌తో కనిపించే ఈ భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సుందరంగా తయారైన యాంటాలియా భవనానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తం 27 అంతస్తులు రామ నామాలతో కనిపించడం వీడియోలలో చూడవచ్చు. ఇదీ చదవండి: ఉద్యోగాలకు అప్లై చేసిన మహిళలు.. 2023లో ఇంతమందా? అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట వేడుకకు హాజరయ్యే అతిధులలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. ఈయన ఈ రోజు రామ మందిరంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అంబానీ మాత్రమే కాకుండా దేశంలో ఇతర పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు, సినీ పరిశ్రమకు చెందినవారు హాజరు కానున్నారు. -
షాపుకు నిప్పు పెట్టబోయి..
-
తగులబెట్టబోయి..
అల్వాల్ : నెల మామూళ్లు ఇవ్వనందుకు గోదాంపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన యువకుడు ఆదే మంటల్లో గాయపడి ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అల్వాల్‌కు చెందిన శ్యామ్ స్థానిక జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం సమీపంలో ఎంబి సౌండ్స్ పేరుతో శుభకార్యాలకు డెకరేషన్, లైట్లు, జనరేటర్లను అద్దెకు ఇచ్చే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం గోదాంలో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అదే ప్రాంతానికి చెందిన నవీన్‌యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన నవీన్‌ను చికిత్స నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. మాముళ్లు ఇవ్వనందుకే: గోదాం యజమాని శ్యామ్ బాధితుడు నవీన్ యాదవ్ నెలకు రూ. 10 వేలు మామూళ్లు ఇవ్వాలని కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని అందుకు అంగీకరించకపోవడంతో గోదామును తగులబెడతానని హెచ్చరించినట్లు యజమాని శ్యామ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం గోదాంలో పనిచేసే సంపత్తో పెట్రోల్ తెప్పించి గోదాంలోకి వెళ్లి నిప్పంటించి తలుపులు మూసి బయటివచ్చి నిలబడినట్లు తెలిపాడు. గోదాంలోని బ్యాటరీలు పేలడంతో మంటలు ఎగిసిపడి నవీన్‌పై పడడంతోనే గాయపడినట్లు తెలిపాడు. తనతోపాటు పలువురిని మాముళ్ల కోసం వేదిస్తున్నాడని పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ శ్రీకాంత్‌గౌడ్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా నవీన్‌యాదవ్‌పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయని స్థానికంగా సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. -
‘కోటి’ దండాలమ్మా
-
విద్యామాతా.. వందనం
-
‘కోటి’ దండాలు
అమలాపురం కన్యకా పరమేశ్వరి ఆలయంలో కరెన్సీ నోట్ల కళాకృతులు కోటి రూపాయలకు పైగా నోట్లతో అమ్మవారితోపాటు ఆలయానికి సోయగం అమలాపురం టౌన్ : అమ్మవారిని పూలు, ఫలాలు, పలు పత్ర దళాలతో అలంకరించడం సంప్రదాయం. అక్కడక్కడా కరెన్సీ నోట్ల తోరణాలతో ముస్తాబు చేస్తారు. కానీ అమలాపురంలో వాసవీ కన్యకాపరమేశ్వరినే కాకుండా ఆలయాన్ని కూడా దసరా మహోత్సవాల్లో భాగంగా రూ.1.53 కోట్ల కరెన్సీ నోట్లతో ముంచెత్తారు. అమ్మవారి అంతరాలయం, మండపం గోడలకు రూ.1000, రూ.500 నోట్లతో, ఇక రూ.100, రూ.50, రూ.20, రూ.10, రూ.5 నోట్లతో పుష్పాలు, దండలు, తోరణాలుగా మలిచి కనువిందు చేశారు. ఆలయం మెుత్తం ఓ కరెన్సీ ఖాజానాగా సాక్షాత్కరించింది. పోలీసుల బందోబస్తు నడుమ ఈ అలంకరణ సాగింది. దీన్ని తిలకించడానికి శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా కరెన్సీ కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉప ముఖ్యమంత్రి రాజప్ప, హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్ఆర్ మూర్తి, ఎమ్మెల్యే ఆనందరావు, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాస్ తదితరులు సందర్శించారు. -
శాకాంబరిగా వేగులమ్మ దర్శనం
గొల్లప్రోలు : దుర్గాడ గ్రామదేవత వేగులమ్మ శాకాంబరిగా మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం చివరి రోజు, అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని, ఉత్సవ విగ్రహాన్ని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. సుమారు 10 అడుగులు పొడవు కలిగిన విగ్రహానికి కూరగాయలు, నిమ్మకాయలతో తయారు చేసిన మాలలను వేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు వేగులమ్మకు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించి 200 కిలోల కూరగాయలతో అమ్మవారిని అలంకరించినట్టు ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు తెలిపారు. శ్రావణమాసం ప్రారంభం సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద ముల్తైదువులకు బుధవారం పసుపు,కుంకుమ అందజేస్తామని చెప్పారు. ఏర్పాట్లను ఆలయకమిటీ పర్యవేక్షించింది. -
అంత్యపుష్కరాలకు రత్నగిరిపై ఏర్పాట్లు
ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ దర్శనాలు భక్తుల రాక పెరిగితే దర్శనం వేళలు పెంచే యోచన: ఈఓ అన్నవరం : ఆదివారం నుంచి ప్రారంభం కానున్న గోదావరి అంత్య పుష్కరాలకు అన్నవరం దేవస్థానంలో తగిన ఏర్పాట్లు చేశామని ఈఓ కే నాగేశ్వరరావు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన సాక్షి తో మాట్లాడుతూ ఆది పుష్కరాలతో పోల్చితే అంత్య పుష్కరాలలో దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగానే ఉంటుందని గత అనుభవాల ద్వారా తెలిస్తోందన్నారు. అందువలన సత్యదేవుని ఆలయంలో స్వామివారి దర్శన వేళల్లో కాని, వ్రతాలు, నిత్య కల్యాణం విషయంలో కానీ పెద్దగా మార్పులు చేయడం లేదన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనాలు, వ్రతాలు ప్రారంభమవుతాయన్నారు. దర్శనాలు రాత్రి తొమ్మిది గంటల వరకూ, వ్రతాల నిర్వహణ సాయంత్రం ఆరు గంటల వరకూ ఉంటుందన్నారు. కొండమీద ఉదయం నుంచి రాత్రి వరకూ, కొండదిగువన 24 గంటలూ ప్రసాదాల విక్రయానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఒక వేళ భక్తుల రాక అధికంగా ఉంటే స్వామివారి వ్రతాలు, దర్శనం, ప్రసాదం విక్రయాల వేళలు పెంచే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. -
శాకంబరిగా శక్తిస్వరూపిణి