అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట ఉత్సవాలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 7000 మంది ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు, దేశం మొత్తం చిన్నా.. పెద్దా దేవాలయాలు సైతం సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. ఈ తరుణంలో భారతీయ పారిశ్రామిక దిగ్గజం 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) ముంబైలోని తన నివాస భవనాన్ని రామ నామంతో నింపేశారు.
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ముఖేష్ అంబానీ తన యాంటిలియా భవనాన్ని చాలా అందంగా డెకరేట్ చేయించారు. మొత్తం భవనం దీపాలతో, జై శ్రీరామ్ అనే నామాలతో సెట్ చేయించారు. అద్భుతమైన లైటింగ్‌తో కనిపించే ఈ భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
సుందరంగా తయారైన యాంటాలియా భవనానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తం 27 అంతస్తులు రామ నామాలతో కనిపించడం వీడియోలలో చూడవచ్చు.
ఇదీ చదవండి: ఉద్యోగాలకు అప్లై చేసిన మహిళలు.. 2023లో ఇంతమందా?
అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట వేడుకకు హాజరయ్యే అతిధులలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. ఈయన ఈ రోజు రామ మందిరంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అంబానీ మాత్రమే కాకుండా దేశంలో ఇతర పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు, సినీ పరిశ్రమకు చెందినవారు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment