antilia
-
ఆస్కార్ రిటైరయ్యింది..!
ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం ముంబైలోని అంటీలియా వద్ద పేలుడు పదార్థాలను కనిపెట్టి పెను ప్రమాదాన్ని నివారించిన పోలీసు జాగిలం ‘ఆస్కార్’విధుల నుంచి విశ్రాంతి తీసుకుంది. మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న అంబానీ నివాసం సమీప పార్కింగ్ ప్లేస్‌లో 2021 ఫిబ్రవరి 25న ఆగంతకులు ఉంచిన జిలెటిన్ స్టిక్స్‌ను ఇది పసిగట్టింది. అప్పట్లో ఈ విషయం దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది. ఆస్కార్ బుధవారం తోటి శునకం మిలోతోపాటు రిటైరయ్యింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకకు అదనపు కమిషనర్ వినీత్ సాహూ సహా పలువురు అధికారులు హాజరై జాగిలాలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ముంబై పోలీసు విభాగం బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీడీఎస్)లో 2014లో చేరిన ఆస్కార్ పదేళ్లపాటు వీఐపీ భద్రతతోపాటు బెదిరింపులు, బెదిరింపు కాల్స్ సమయంలో విధులను సమర్ధవంతంగా నిర్వహించిందని ఓ అధికారి తెలిపారు. మిలో కూడా వీఐపీలు, కీలక సంస్థల భద్రతతోపాటు అనుమానాస్పద బ్యాగుల తనిఖీ విధుల్లో పాల్గొందని చెప్పారు. రిటైరయ్యాక ఈ రెండు జాగిలాలకు ఏసీ వసతి సౌకర్యంతోపాటు రవాణా సమయంతో ఏసీతో కూడిన వాహనం సమకూర్చుతామని, ఇవి అందించిన సరీ్వసులకు గుర్తింపుగా ‘వాల్ ఆఫ్ ఫేమ్’ను ఏర్పాటు చేశామని చెప్పారు. -
ఒలింపిక్ పతక విజేతలతో నీతా అంబానీ: వైరల్ వీడియో
ముంబైలోని అంబానీ నివాసం యాంటిలియాలో ఆదివారం రాత్రి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' ఈవెంట్లో భారతదేశ ఒలింపిక్స్, పారాలింపిక్స్ పోటీదారులకు ఆతిథ్యం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్లో.. పారిస్ ఒలింపిక్స్ 2024 పతక విజేతలు మను భాకర్, నీరజ్ చోప్రాతో పాటు పారిస్ పారాలింపిక్స్ 2024 పతక విజేతలు నవదీప్ సింగ్, మోనా అగర్వాల్‌లతో నీతా అంబానీ ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులు సత్కరించారు.Mrs Nita M Ambani, Founder and Chairperson of Reliance Foundation, welcomed the athletes to United in Triumph: an unprecedented evening that united India's Olympians and Paralympians and rejoiced and cherished their success. Speaking on the occasion, Mrs Ambani said, "Today is a… pic.twitter.com/7wxsO9TE0c— Reliance Industries Limited (@RIL_Updates) September 30, 2024సుమిత్తో పాటు నీరజ్ చోప్రా, మను భాకర్, మురళీకాంత్ పెట్కర్, దేవేంద్ర ఝఝరియా సహా భారతదేశ ఒలింపిక్ & పారాలింపిక్ ఛాంపియన్లు అంటిల్, నితేష్ కుమార్, హర్విందర్ సింగ్, ధరంబీర్ నైన్, నవదీప్ సింగ్, ప్రవీణ్ కుమార్, దీపా మాలిక్, సానియా మీర్జా, కర్ణం మల్లీశ్వరి, పుల్లెల గోపీచంద్, హర్భజన్ సింగ్ వంటి క్రీడా దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారత మాజీ దిగ్గజ గోల్‌కీపర్ పిఆర్ శ్రీజేష్ తన కుటుంబంతో సహా ఆంటిలియాకు చేరుకున్నారు. పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన పారా షట్లర్లు సుహాస్ యతిరాజ్, నితేష్ కుమార్ కూడా ఈ ఈవెంట్‌ను హాజరయ్యారు.ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్లో నీతా అంబానీ మాట్లాడుతూ.. భారతదేశం మొత్తం మన అథ్లెట్లను చూసి గర్విస్తోంది. మొదటిసారి భారత పారిస్ ఒలింపియన్లు, పారా ఒలింపియన్లు ఒకే వేదికపైకి చేరుతున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ తరపున, 'యునైటెడ్ వుయ్ ట్రయంఫ్' ఒక ఉద్యమంగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు.Together as one, celebrating unity ✨✨ India’s star Paralympians & Olympians arrive at Reliance Foundation’s United In Triumph awards to celebrate spirit of Olympism together🤝🤝 #RFsports #UnitedinTriumph #Paris2024 #Paralympics2024 pic.twitter.com/7xVfxJ7lhV— RF Youth Sports (@RFYouthSports) September 29, 2024 -
అంబానీ ఇంటిని తలదన్నే ఇల్లు!! బెంగళూరులో..
దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏది అంటే టక్కున ముఖేష్ అంబానీది అనే చెప్పేస్తారు. ముంబైలో ఉన్న ఈ విలాసవంతమైన నివాసం పేరు ‘యాంటిలియా’. అయితే దీనిని తలదన్నే మ్యాన్షన్ బెంగళూరులో ఉంది. అది ఎవరిది.. దాని విలువ ఎంత.. ఇతర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం..400 అడుగుల ఎత్తు.. 33 అంతస్తుల లగ్జరీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్.. దానిపైన మ్యాన్షన్. రెండు అంతస్తుల్లో ఉన్న ఈ స్కై మ్యాన్షన్‌లో ఉన్న విలాసవంతమైన సదుపాయాల గురించి తెలిస్తే నోరెల్లబెడతారు. హెలిప్యాడ్, లష్ గార్డెన్స్, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, 360 డిగ్రీ వ్యూయింగ్ డెక్‌తో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.ప్రస్తుతం విదేశాలకు పరారైన, లిక్కర్ కింగ్‌గా పేరొందిన విజయ్ మాల్యాకు చెందిందే ఈ విలాసవంతమైన భవనం. కింగ్‌ఫిషర్ టవర్స్‌గా పిలిచే ఈ అపార్ట్మెంట్ బ్లాక్‌ను మాల్యా పూర్వీకుల ఇల్లు ఉండే 4.5 ఎకరాల స్థలంలో నిర్మించారు. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ దీన్ని నిర్మించింది. ఈ ఇంటి విలువ 20 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.ఒక్క రోజు కూడా ఉండలేదుఇక అంబానీ కుటుంబానికి చెందిన ముంబై టవర్, యాంటిలియా దేశంలోని అత్యంత సంపన్నుల యాజమాన్యంలో ఉన్న మరో అద్భుతమైన ఇల్లు . దీని నిర్మాణానికి 2 బిలియన్ ఖర్చయినట్లు అంచనా. విలువపరంగా చూస్తే కింగ్‌ఫిషర్ టవర్స్ విలువ తక్కువే అయినా అంబానీ నివాసం 27 అంతస్తులు ఉంటే.. మాల్యా మ్యాన్షన్ ఉండే టవర్స్ 33 అంతస్తుల్లో ఉంది. అయితే ముచ్చట పడి కట్టించుకున్న ఈ మ్యాన్షన్‌లో విజయ్ మాల్యా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఇది ఇంకా నిర్మాణంలో ఉండగానే బ్యాంకులకు రుణాల ఎగవేత వ్యవహారంలో ఆయన దేశం వదిలి పారిపోయారు. -
అంబానీ ఆంటిలియాకు కొత్త కళ తెచ్చిన సూపర్ డిజైనర్ ఎవరో తెలుసా?
అత్యంత అందమైన, ఖరీదైన భవనం అంటే ముంబై నగరం నడిబొడ్డున అల్టామౌంట్ రోడ్లో కొలువుదీరిన ఆంటిలియా భవనం గుర్తొస్తుంది. మరి అంత గొప్ప భవనానికి మరింత సొబగులు అద్ది కొత్త కళను తీసుకొచ్చిన ఇంటీరియర్ డిజైనర్ ఎవరో తెలుసా? ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే. ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ ముఖేష్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త నీతా అంబానీలకు చెందినదే ఈ ఆంటిలియా భవనం, ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఇల్లు ఈ ఐకానిక్ ఆంటిలియా. ఐశ్వర్యానికి, నిర్మాణ అద్భుతానికి,లగ్జరీ సదుపాయాలకు నిదర్శనంగా నిలుస్తుందీ భవనం. దీని విలువ 15,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. యూకేకు చెందిన బకింగ్ హామ్ ప్యాలస్ తర్వాతే ఇదే అత్యంత ఖరీదైన భవనంగా నిలిచింది. దాదాపు 4,532 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని చికాగోకు చెందిన ఆర్కిటెక్ట్ పెర్కిన్స్ డిజైన్ చేశారు. దీనిని ఆస్ట్రేలియాకు చెందిన నిర్మాణ రంగ సంస్థ లైయిటన్ హోల్డింగ్స్ నిర్మించింది. అయితే ఈలగ్జరీ భవనంలోని లాంజ్ ఏరియాను డిజైన్ చేసిన డిజైనర్ మరెవరో కాదు, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ ,బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్. తనదైన డిజైన్స్, క్రియేటివ్ టచ్‌తో ఆంటిలియాకు మరింత సొబగులను అద్దింది గౌరీ ఖాన్. ఇంటీరియర్ ఆర్కిటెక్చర్‌గా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన గౌరీ ఖాన్ 2019లో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టి తన మార్క్ నైపుణ్యం, డిజైన్స్‌తో ఈ భవంనలోని బార్ లాంజ్ ప్రాంతానికి కొత్త కళను తీసుకొచ్చింది. తన అనుభవాలను గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన గౌరీ ఖాన్ "అద్భుతమైన అనుభవం"గా అభివర్ణించింది. అంతేకాదు డిజైన్స్ పట్ల ఆసక్తి ఉన్న నీతాతో కలిసి పనిచేయడం నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ ఆమె రాసుకొచ్చింది. గౌరీ ఖాన్ డిజైన్స్ ఫౌండర్‌గా, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకులుగా గౌరీ ఖాన్ ఇంటిరీయర్ డిజైనర్‌గా ఖ్యాతి గడించారు. ఈ క్రమంలోనే రణ్‌బీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కరణ్ జోహార్, వరుణ్ ధావన్, అలియా భట్, అనన్య పాండే తదితర పలువురు బాలీవుడ్ ప్రముఖుల గృహాలను అద్భుతంగా తీర్చిదిద్దింది. 27 అంతస్తులున్న లగ్జరీ హౌస్ ఆంటిలియాలో హెల్త్ స్పా, సెలూన్, మూడు స్విమ్మింగ్ పూల్స్, ఒక బాల్రూమ్ ఉన్నాయి. అలాగే యోగా, డ్యాన్స్ స్టూడియోల తోపాటు, 168 కార్లు పార్క్ చేసేందుకు కావాల్సినంత స్థలం ఉంటుంది. అంతేకాదు ఈ ఆంటిలియా భవనం 8.0 తీవ్రతతో భూకంపాన్ని కూడా తట్టుకోగలదట. -
అంబానీ ఖరీదైన నివాసం.. అంతా రామమయం
-
Antilia: అంబానీ ఇల్లు.. అంతా రామమయం.. వీడియో వైరల్
అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట ఉత్సవాలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 7000 మంది ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు, దేశం మొత్తం చిన్నా.. పెద్దా దేవాలయాలు సైతం సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. ఈ తరుణంలో భారతీయ పారిశ్రామిక దిగ్గజం 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) ముంబైలోని తన నివాస భవనాన్ని రామ నామంతో నింపేశారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ముఖేష్ అంబానీ తన యాంటిలియా భవనాన్ని చాలా అందంగా డెకరేట్ చేయించారు. మొత్తం భవనం దీపాలతో, జై శ్రీరామ్ అనే నామాలతో సెట్ చేయించారు. అద్భుతమైన లైటింగ్‌తో కనిపించే ఈ భవనం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సుందరంగా తయారైన యాంటాలియా భవనానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తం 27 అంతస్తులు రామ నామాలతో కనిపించడం వీడియోలలో చూడవచ్చు. ఇదీ చదవండి: ఉద్యోగాలకు అప్లై చేసిన మహిళలు.. 2023లో ఇంతమందా? అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట వేడుకకు హాజరయ్యే అతిధులలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. ఈయన ఈ రోజు రామ మందిరంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అంబానీ మాత్రమే కాకుండా దేశంలో ఇతర పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు, సినీ పరిశ్రమకు చెందినవారు హాజరు కానున్నారు. -
అంబానీ యాంటిలియాలో ఫుట్‌బాల్ లెజెండ్ 'బెక్‌హామ్' - ఫోటోలు వైరల్
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ముఖేష్ అంబానీ' ఇటీవల ఫుట్‌బాల్ లెజెండ్ 'డేవిడ్ బెక్‌హామ్'కు తన యాంటిలియాలో ఆతిధ్యమిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై గట్టి విజయం సాధించిన తర్వాత డేవిడ్ బెక్‌హామ్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను కలిశాడు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యునిసెఫ్) గుడ్‌విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్‌హామ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి స్టేడియంలో థ్రిల్లర్ మ్యాచ్‌ను వీక్షించారు. డేవిడ్ బెక్‌హామ్‌కు అంబానీ కుటుంబం ముంబైలోని తమ నివాసం, యాంటిలియాలో ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో నీతా అంబానీ, కుమార్తె ఇషా, కుమారుడు ఆకాష్‌తో కలిసి శ్లోకా మెహతా, రాధికా మర్చంట్ కూడా ఉన్నారు. వాంఖడే స్టేడియంలో ఆకాష్ అంబానీ, డేవిడ్ బెక్‌హామ్ కలిసి మ్యాచ్ వీక్షించారు. నటులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, రణబీర్ కపూర్ ఇక్కడ హాజరయ్యారు. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కారు తయారీలో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ - సింగిల్ చార్జ్‌తో 265 కిమీ రేంజ్! బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా డేవిడ్ బెక్‌హామ్‌కి వారి ముంబై నివాసంలో వెల్కమ్ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి అనిల్ కపూర్, ఫర్హాన్ అక్తర్, కరిష్మా కపూర్లతో సహా పలువురు బాలీవుడ్ తారలు మిస్టర్ బెక్‌హామ్‌తో హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) -
గణపయ్యకు ఈ ఏడాది అంబానీ అదిరిపోయే గిఫ్ట్
పవిత్ర గణేష్ చతుర్థిని దేశవ్యాప్తంగా పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ కుటుంబం జరుపుకున్న వినాయక చవితి వేడుకులు విశేషంగా నిలిచాయి. ముంబైలోని వీరి లగ్జరీ నివాసం యాంటిలియా విద్యుద్దీప కాంతులతో మెరిసిపోయింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే,ఈ ఏడాదికూడా మహారాష్ట్రలోని ముంబైలోని లాల్‌బాగ్‌లో లాల్బాగ్చా రాజా ప్రజలు దర్శనం కోసం అందంగా కొలువు దీరాడు. ప్రతీ ఏడాది అంబానీకుంటుంబంతోపాటు, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, సినీ రాజకీయ రంగ ప్రముఖులు ఈ గణపతిని దర్శించుకుంటారు. ఈ ఏడాది మాత్రం ఈ వేడుకను అంబానీ కుటుంబం మరో మెట్టు పైకి తీసుకువెళ్లింది. ముఖేష్ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీతో కలిసి లాల్బాగ్చా రాజాను సందర్శించి గణేశుడిని ప్రార్థనలు చేశారని తెలుస్తోంది. (ఫైల్ ఫోటో ) ఈ సందర్బంగా భారీ దండను కూడా బొజ్జ గణపయ్యకు అందించడం విశేషంగా నిలిచింది. తండ్రి కొడుకులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ముఖేష్ అంబానీ నీలిరంగు కుర్తా-పైజామాను ధరించగా, అనంత్ అంబానీ మెరూన్-హ్యూడ్ దుస్తుల్లో విఘ్ననాయకుడి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ ఫోటోలతోపాటు, పాత వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by LalbaugchaRaja (@lalbaugcharaja) -
ఆకాష్ అంబానీతో యాపిల్ సీఈవో టిమ్‌కుక్ భేటీ.. కారణం అదేనా?
భారత్‌లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ప్రారంభమైంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ‘యాపిల్ బీకేసీ’ (Apple BKC) పేరిట ఏర్పాటైన ఈ స్టోర్‌ను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు. ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి ముందు రోజు అంటే ఏప్రిల్ 17న టిమ్‌కుక్ ముంబైలో సందడి చేశారు. బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి వడపావ్ రుచి చూడడం నుంచి దేశంలో ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్లను కలిసినట్లు తెలుస్తోంది. ఇక దేశీయంగా యాపిల్ వ్యాపార వ్యవహారాల నిమిత్తం కుక్ ప్రపంచంలోనే రెండో విలాసవంతమైన భవనం, ముంబై అల్టామౌంట్ రోడ్‌లోని ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియాకు వెళ్లారు. అక్కడ రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీని కలిశారు. ఆ తర్వాత టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌తో పాటు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిశారని విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి ముంబై వీధుల్లో టిమ్‌కుక్ సందడి చేశారు. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ అమితంగా ఇష్టపడే ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్ రెస్టారెంట్లో ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్ రెస్టారెంట్లో మాధురీ దీక్షిత్‌తో కలిసి వడపావ్ (అంబానీల సూచన మేరకు) ఆరగించారు. Thanks @madhuridixit for introducing me to my very first Vada Pav — it was delicious! https://t.co/Th40jqAEGa — Tim Cook (@tim_cook) April 17, 2023 దీనికి సంబంధించిన ఫోటోను మాధురి దీక్షిత్ ట్వీట్ చేశారు. ముంబైలో వడా పావ్ కంటే మెరుగైన స్వాగతం మరొకటి ఉండదు అంటూ పోస్ట్ చేశారు. దీనికి టిమ్ కుక్ 'నాకు మొదటిసారి వడ పావ్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇది చాలా రుచిగా ఉంది’అంటూ టిమ్ కుక్ బదులిచ్చారు. చదవండి👉భారత్‌లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్.. ప్రారంభించిన టిమ్‌కుక్! -
రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్
వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ,ఎండీ ముఖేశ్ అంబానీ గురించి తెలియని వారుండరు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు బిలియనీర్ అంబానీకి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఆస్తులను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం అంబానీ భారీ నికర విలువతో, విలాసవంతమైన జీవనశైలి, విలాసవంతమైన ఇళ్ళు, లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నారు. రూ. 15 వేల కోట్ల ఇంద్రభవనం యాంటిలియా నుంచి 2 వేల కోట్ల లావిష్ హోటల్ దాకా అంబానీ ప్రాపర్టీ పోర్ట్‌ఫోలియో ఎప్పుడూ చర్చనీయాంశాలే. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన కొన్నిఆస్తులను చూద్దాం: అంబానీ నివాసముండే ఆంటిలియా గురించి ముందుగా చెప్పాలి. ముఖేశ్ అంబానీ, భార్య నీతా అంబానీ రాజభవనం లాంటి ఆంటిలియాలోనే ఉంటారు. పిల్లలు ఆకాష్, అనంత్ అంబానీ, ఇషా అంబానీలకు ఇప్పటికే పెళ్ళిళ్లు చేసిన సంగతి తెలిసిందే. అంబానీ 15 వేల కోట్ల రూపాయల విలువైన తన 27అంతస్తుల నివాసం యాంటిలియాతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా ఖరీదైన ఆస్తులను కలిగి ఉన్నారు. అలాగై లగ్జరీ కార్లు, ఆభరణాల కలెక్షన్ వారికి పెద్ద లెక్కే కాదు. యాంటిలియా ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన నివాసం యాంటిలియా. 60 ప్లోర్లతో 27 అంతస్తుల భవనం యాంటిలియా విలువ రూ. 15,000 కోట్లు. ఈ ఇంటి పైఅంతస్తులో హెలిప్యాడ్ ప్రత్యేక ఆకర్షణ, ఇంకా గుడి, థియేటర్, ఐస్ క్రీం పార్లర్, స్విమ్మింగ్ పూల్, స్పా లాంటివి ఉన్నాయి. యాంటిలియాకు మారడానికి ముందు, ముఖేశ్ అంబానీ కుటుంబం, అనిల్ అంబానీ కఫ్ పరేడ్‌లోని సీ విండ్ అపార్ట్మెంట్లో నివసించేవారు. 17 అంతస్తుల భవనాన్ని దక్షిణ ముంబైలో రిలయన్స్ ఫౌండర్ ధీరూభాయ్ అంబానీ కొనుగోలు చేశారు. యూకేలోని స్టోక్ పార్క్ లండన్‌లోని 900 ఏళ్ల పురాతన హోటల్, స్టోన్ పార్క్‌కు కూడా ముఖేశ్ అంబానీ సొంతం. అల్ట్రా-రిచ్ ఫెసిలిటీస్‌తో ఉండే ఈహోటల్ కొనుగోలు విలువ 2020 నాటికి రూ. 529 కోట్లు. 1760లో సైనికుడు జాన్ పెన్ నిర్మించిన ఈ హోటల్లో 49 విలాసవంతమైన గదులు మూడు రెస్టారెంట్లు ఉన్నాయి. అంతేకాదు స్టోన్ పార్క్‌లో 4000 చదరపు అడుగుల జిమ్, గోల్ఫ్ కోర్స్, పదమూడు మల్టీ-సర్ఫేస్ టెన్నిస్ కోర్ట్ , ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. న్యూయార్క్‌లోని లావిష్ హోటల్ దీంతోపాటు హాలీవుడ్ ప్రముఖులు బస చేసే, న్యూయార్క్‌లోని కొలంబస్ సర్కిల్లోని పాపులర్ హోటల్లో అంబానీ 248 సూట్లతో ఉన్న ఒక ఇంటిని 2022లో 98.15 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారట. పామ్ జుమేరియా ఇల్లు లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. దుబాయ్‌లోని పామ్ జుమేరియా ఇల్లు. అంబానీకి రూ. 639 కోట్ల విలువైన, బీచ్-ఫేసింగ్ ప్రాపర్టీలో స్పా బార్, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి స్పెషల్ ఎట్రాక్షన్స్. అనేది అరచేతి ఆకారంలో ఉండే జుమేరియా కృత్రిమ ద్వీపం పోష్ కాలనీలు, అతి విలాసవంతమైన నివాస ఆస్తులకు ప్రసిద్ధి. -
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
Mukesh Ambani House: ‘అంటిలియా’ అడ్రస్ అడిగిన ముగ్గురి అరెస్టు!
Mukesh Ambani House: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసమైన అంటిలియా అడ్రస్ ఆరా తీసిన ముగ్గురు అనుమానితులను న్యూ ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన ఆధారాల ప్రకారం స్థానిక ఆజాద్‌మైదాన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, నాకా బందీ నిర్వహించి న్యూ ముంబైలో వారిని పట్టుకున్నారు. సోమవారం అంబానీ నివాసమైన అంటిలియా భవనం ఎక్కడుందని ఖిల్లా కోర్టు వద్ద నీలం రంగు కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తనని అడిగారని ఓ ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. వారి వద్ద ఓ బ్యాగు ఉందని తెలిపాడు. ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే నాకా బందీ ఏర్పాటు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల ఊహాచిత్రాలను తయారు చేశారు. న్యూ ముంబైలో వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ముగ్గురు గుజరాత్‌కు చెందిన వారుగా గుర్తించారు. వీరు ముంబై పర్యటించేందుకు వచ్చారని చెప్పారు. గుగుల్ యాప్ పనిచేయకపోవడంతో అంటిలియా భవనం అడ్రస్ గురించి ఆ ట్యాక్సీ డ్రైవర్‌ను అడిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీని వెనక విధ్వంసం సృష్టించే ఎలాంటి దురుద్ధేశం వారికి లేదని పోలీసులు తెలిపారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: (ఆస్పత్రిలో చేరిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. విశ్రాంతి లేకుండా పోరాడుతూ ఆ నొప్పిని..) -
‘యాంటీలియా ఎక్కడ ఉంది’.. అంబానీ ఇంటికి భద్రత పెంపు
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ఇల్లు ‘యాంటీలియా’కు అధికారులు సోమవారం భద్రతను పెంచారు. తన కారు ఎక్కిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని, ఉర్దూ భాషలో మాట్లాడుతూ యాంటీలియా చిరునామా కోసం తనను అడిగారని, వారి వద్ద రెండు బ్యాగులు ఉన్నాయని ఓ ట్యాక్సీ డ్రైవర్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన ఆజాద్ మైదాన్ పోలీసులు అతడి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. దక్షిణ ముంబైలో అల్టామౌట్ రోడ్డులోని ముఖేష్ నివాసం వద్ద భద్రతను పటిష్టం చేశారు. ఇక్కడ మరిన్ని బారీకేడ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. సీనియర్ అధికారి ఒకరు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: ముఖేష్ అంబానీ కొత్త ఇల్లు..! ఎంతకు కొనుగోలు చేశారో తెలుసా..!) ఈ ఏడాది ఫిబ్రవరిలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనం యాంటీలియా ఎదుట పార్కు చేసి ఉండడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన అప్పటి పోలీసు అధికారి సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. చదవండి: ఇల్లు కోసం కొనలేదు.. హెరిటేజ్ ప్రాపర్టీగా! -
ముఖేష్ అంబానీ కొత్త ఇల్లు..! ఎంతకు కొనుగోలు చేశారో తెలుసా..!
Mukesh Ambani Purchase New Home in London: భారతీయ అపరకుభేరుడు, అసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ లండన్ లోని బకింగ్ హామ్లో గల స్టోక్ పార్క్‌లో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ 300 ఎకరాల స్థలంలో ఉన్న 49 బెడ్ రూమ్‌లు ఉన్న ఇంటిని ప్రత్యేకంగా రూ.592 కోట్లతో సొంతం చేసుకున్నట్లు జాతీయ మీడియా మిడ్ డే కథనాల్ని ప్రచురించింది. ఏడాది నుంచే ప్రస్తుతం మనదేశంలో ముఖేష్ అంబానీ నివాసం 'ఆంటిలియా' అల్టామౌంట్ రోడ్ లో ఉంది. అయితే కరోనా కారణంగా రెండో ఇంటి అవసరం ఉందని ముఖేష్ గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే నిలువుగా ఉండే ఆంటిలియా'లా కాకుండా సువిశాలంగా ఉండే ఇల్లును కొనుగోలు చేయాలని గత ఏడాది నుంచి ప్రయత్నాలు ప్రారంభించినట్లు మిడ్ తన కథనంలో ప్రస్తావించింది.ఇందులో భాగంగా లండన్ స్టోక్ పార్క్ స్థలాన్ని ముఖేష్ కొనుగోలు చేశారని, ఈ ఏడాది ఆగస్ట్ నుంచి తమ అవసరాలకు అనుగుణంగా 49 బెడ్ రూమ్‌లు ఉన్న ఆ ఇంటిని మార్పులు చేయిస్తున్నట్లు మిడ్డే మీడియా తెలిపింది. రిలయన్స్ స్పందించింది స్టోక్ పార్క్ స్థలాన్ని కొనుగోలు చేసిన విషయంపై జాతీయ మీడియాలో వస్తున్న వార్తలపై రిలయన్స్ సంస్థ స్పందించింది.భారత్ తప్ప మిగిలిన దేశాల్లో ముఖేష్ కుటుంబానికి నివసించే ఉద్దేశం లేదని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. స్టోక్ పార్క్ ఎస్టేట్‌ను గోల్ఫింగ్ కేంద్రంగా, స్పోర్టింగ్ రిసార్ట్‌గా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో భారతదేశ ప్రఖ్యాత హాస్పిటాలిటీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తునట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: కూకటివేళ్లు కదిలినా..ముఖేష్ అంబానీ కుబేరుడే! -
‘ప్రదీప్ శర్మకు నా భర్త కలెక్షన్ ఏజెంట్’
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద కలకలం సృష్టించిన పేలుడు పదార్థాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ మహిళ ఎన్ఐఏ అధికారుల వద్దకు వచ్చి తన భర్త ప్రదీప్ శర్మకు కలెక్షన్ ఏజెంట్‌గా పని చేసేవాడని తెలిపింది. గుంజన్ సింగ్(30) అనే మహిళ తన భర్త అనీల్ సింగ్ ప్రదీప్ శర్మకు సంబంధించిన అసాంఘిక కార్యకలపాల్లో పాలు పంచుకునేవాడని.. అతడికి కలెక్షన్ ఏజెంట్‌గా పని చేసేవాడని ఆరోపించింది. ఈ సందర్భంగా గుంజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘పెళ్లైన నాటి నుంచి నా భర్త తనకు పోలీసులతో మంచి సంబంధాలున్నాయని చెప్పి నన్ను పలుమార్లు బెదిరించాడు. పరంవీర్ సింగ్ కోసం పని చేసిన ప్రదీప్ శర్మ, బచ్చి సింగ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయనేవాడు. అంతేకాక వారికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీలను నా భర్త చూసుకునేవాడు. ఓసారి ఏకంగా నా తలకు తుపాకీ గురి పెట్టి నన్ను బెదిరించాడు. పోలీసులతో అతడికి ఉన్న సంబంధాల వల్లే నా భర్త ఇంతకు తెగించి ఉంటాడని నేను భావిస్తున్నాను’’ అని తెలిపింది. ఇప్పటికే గుజన్ తన భర్త మీద ఓ సారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం ప్రదీప్ శర్మను అదుపులోకి తీసుకుని ఆరు గంటలపాటు విచారించింది. సచిన్ వాజేకు చెందిన ఆధారాలను నాశనం చేసేందుకు ప్రదీప్ ఆయనకు తోడ్పడినట్లు అధికారులు చెబుతున్నారు. కారుబాంబు వ్యవహారానికి ముందు జరిగిన ప్రణాళికా సమావేశంలో ప్రదీప్ కూడా పాల్గొన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అంబానీ ఇంటి ఎదుట బాంబు దొరికిన రెండు రోజుల తర్వాత విచారణలో భాగంగా ఎన్ఐఏ ప్రదీప్ శర్మను కూడా ప్రశ్నించింది. 1983 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ శర్మ దాదాపు 100 మంది నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు చదవండి: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు.. ప్రశ్నల వర్షం
ముంబై: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంబానీ ఇల్లు ఎంటిలియా ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో ఇవాళ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు చేపట్టి.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. అంధేరీలోని ప్రదీప్ శర్మ ఇంట్లో గురువారం ఉదయం ఎన్‌ఐఎతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది తనీఖీలు చేపట్టారు. ఉదయం ఐదుగంటల నుంచి సుమారు ఆరుగంటలపాటు ఈ సోదాలు కొనసాగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రదీప్‌పై పశ్నల వర్షం కురిపించింది ఎన్ఐఏ. ఇక ఈ కేసులో షీలర్ అనే అనుమానితుడితో శర్మ గతంలో దిగిన ఫోటోలు బయటకు రావడంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభించారు. షీలర్ గతంలో పోలీసు ఇన్ఫార్మర్గా పని చేశాడని, అయినా రోజూ తనతో ఎంతో మంది ఫొటోలు దిగుతారని ప్రదీప్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో శర్మను ఏప్రిల్‌లోనే ఓసారి ప్రశ్నించారు కూడా. వాజే గురువు ఇక మన్సుక్ హిరేన్ మృతి కేసులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయన్న ఉద్దేశంతోనే శర్మ ఇంట్లో సోదాలు చేపట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ఇక ఈ కేసులో ఎన్ఐఎ కస్టడీలో ఉన్న మాజీ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేకు, శర్మ గురువులాంటోడు. ముకేశ్ అంబానీ ఇంటి ముందు వాహనంలో దొరికిన 20 జెలిటిన్ స్టిక్స్‌ను ప్రదీప్ శర్మ ద్వారనే తెప్పించినట్లు వాజే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ కేసుతో పాటు వ్యాపారవేత్త మన్సుక్ హిరేన్ మృతి కేసులోనూ వాజే అనుమానితుడిగా ఉన్నారు. కాగా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్ శర్మపై 2006లో లఖన్ భయ్యా ఎన్కౌంటర్, అందులో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో వేటు పడింది. 2017లో తిరిగి విధుల్లోకి వచ్చిన ఆయన.. 2019లో ప్రదీప్ శర్మ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. శివసేనలో చేరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తన పేరుమీద ఓ ఎన్జీవో నడుపుతున్నారు 59 ఏళ్ల ప్రదీప్. చదవండి: రియల్ అబ్ తక్ చప్పన్: పాతికేళ్ల సర్వీస్. 100 ఎన్కౌంటర్లు -
అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్ మృతి
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం 'యాంటిలియా' దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తాజాగా మరో షాకింగ్ వార్త వెలుగు చూసింది. అంబానీ ఇంటి ముందు నిలిపిన పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఓనర్ మరణించాడు. ముంబైకి సమీపంలోని చిన్న కాలువ దగ్గర అతడి మృత దేహం లభ్యమయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేశారు. గత నెల 26న ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియోని నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. వాహనం లోపల ఒక బ్యాగును, లేఖను కనుగొన్నారు పోలీసులు. ‘ముఖేశ్ భయ్యా, నీతా బాబీ ఇదొక ట్రైలర్ మాత్రమే’’ అని లేఖలో రాసినట్టు సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన తరువాత యాంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా రెండు వాహనాలను ఆపి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఇక దుండగులు వాడిన స్కార్పియోను విఖ్రోలి ప్రాంతం నుంచి దొంగిలించినట్లు దర్యాప్తులో. తాజాగా దాని ఓనర్ మరణించడం సంచలనం సృష్టిస్తోంది. చదవండి: అంబానీ ఇంటి దగ్గర కలకలం.. ఇది ట్రైలర్ మాత్రమే అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు -
అంబానీ ఇంటికి బెదిరింపుల కేసులో ట్విస్ట్
-
అంబానీ.. బిట్ కాయిన్ ద్వారా డబ్బులు పంపండి!
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపి ఉంచింది తామేనని 'జైష్ ఉల్ హింద్' సంస్థ ప్రకటించింది. టెలిగ్రామ్ యాప్‌లో మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతే కాకుండా తమ సంస్థకు డబ్బులు పంపించాలని ముఖేష్‌ను డిమాండ్ చేసింది. బిట్‌కాయిన్ ద్వారా అడిగినంత ధనాన్ని పంపాలని కోరింది. గురువారం పేలుడు పదార్థాలతో ఆ వాహనాన్ని అంబానీ ఇంటి సమీపంలో పార్క్ చేసిన తమ సోదరుడు సేఫ్‌గా ఇంటికి చేరుకున్నాడు అని పేర్కొంది. కాగా ఆ వాహనంలో 20 జిలెటిన్ స్టిక్స్‌తో పాటు ఓ లేఖ కూడా దొరికిన విషయం తెలిసిందే. అందులో నీతా అంబానీ, ముకేష్ భయ్యాకు ఇదొక ఝలక్ అని, నెక్ట్స్ టైమ్ ఇవి(పేలుడు పదార్థాలు) మిమ్మల్ని చేరుకుంటాయని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని రాసి ఉంది. గత నెల ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయం దగ్గర బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని అంగీకరించింది. ఈ విషయాన్ని ఇప్పటికీ కనుక్కోలేకపోయాయంటూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌ను ఎద్దేవా చేసింది. ముంబైలోని ముకేష్ అంబానీ నివాసం యాంటీలియా సమీపంలో నిలిపి ఉంచిన వాహనంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు ఆ స్కార్పియోను దుండగులు చోరీ చేసుకుని తీసుకొచ్చారని తేల్చారు. ఆ పేలుడు పదార్థాలు నాగ్‌పూర్‌లోని సోలార్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీకి చెందినట్లుగా గుర్తించారు. వీటి బరువు 2.60 కిలోలుగా ఉన్నాయని తెలిపారు. చదవండి: ఇది ట్రైలర్ మాత్రమే.. నెక్ట్స్‌టైమ్ అవి మిమ్మల్ని చేరుకుంటాయి ముఖేశ్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలు -
ఇది ట్రైలర్ మాత్రమే
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇల్లు యాంటీలియా సమీపంలో నిలిపి ఉంచిన వాహనంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇదే వాహనంలో బెదిరింపు లేఖ బయటపడింది. ‘ఇది కేవలం ట్రెయిలర్ మాత్రమే’ అని ఇందులో రాసి ఉంది. డ్రైవర్ సీటు పక్కనే ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు బ్యాగులో ఈ లేఖను పోలీసులు గుర్తించారు. ఆగంతకులు ముకేష్ అంబానీ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఈ లేఖ రాశారు. నీతా అంబానీ, ముకేష్ భయ్యాకు ఇదొక ఝలక్ అని, ఏర్పాట్లు జరుగుతున్నాయని, నెక్ట్స్ టైమ్ ఇవి(పేలుడు పదార్థాలు) మిమ్మల్ని చేరుకుంటాయని అందులో ఉంది. పేలుడు పదార్థాలతో కూడిన కారును యాంటీలియా పక్కనే పార్కు చేయాలని దుండుగులు భావించినట్లు, అక్కడ పటిష్టమైన భద్రత ఉండడంతో కొంత దూరంలో నిలిపి ఉంచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముకేష్ అంబానీ సెక్యూరిటీ వాహనం నంబర్ ప్లేట్‌పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబరే ఈ స్కార్పియో నంబర్ ప్లేట్‌పై ఉండడం గమనార్హం. స్కార్పియోను దుండుగులు చోరీ చేసి, తీసుకొచ్చారని పోలీసులు చెప్పారు. -
ముఖేశ్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలు
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించింది. దక్షిణ ముంబైలోని ముఖేష్ నివాసం యాంటీలియా సమీపంలోనే గురువారం సాయంత్రం స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. యాంటీలియా సెక్యూరిటీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఈ వాహనంలో జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు తేలిందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియోను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాని యజమాని ఎవరు? అందులో పేలుడు పదార్థాలు పెట్టిందెవరు? ఎందుకోసం పెట్టారు? అనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
అంబానీ ఇంట్లో అగ్ని ప్రమాదం
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట్లో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని అల్టామౌంట్ రోడ్డులో ఉన్న ‘అంటీలియా’లో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. భవనంలోని తొమ్మిదో అంతస్తు టెర్రస్‌పై మంటలు ప్రారంభమై.. సమీపంలోని 4జీ సెల్ టవర్‌కు వ్యాపించినట్లు చెప్పారు. 6 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయన్నారు. -
మల్టీబిలీనియర్ ముకేష్ అంబానీపై వరుణిడి ఎఫెక్ట్
-
అంబానీకీ తప్పని వానబాధలు
వానకి పెద్దా చిన్నా తెలియదు... ధనిక, పేద తెలియదు. అందరినీ సమానంగా ముంచెత్తుతుంది. పేదోడి గుడిసెకీ, అంబానీ ఆరువేల కోట్ల ఆంటీలియా ఇంటినీ వాన తడిపిముద్ద చేసేస్తుంది. ఈ మాట అక్షరాలా నిజమని శుక్రవారం ముంబాయిలో కురిసిన వాన నిరూపించింది. వాన జోరుకి ఇంట్లోకి జల్లు రాకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్ అడ్డం పట్టినట్టే అంబానీ అంతటివాడూ ప్లాస్టిక్ కవర్లు అడ్డం పెట్టాల్సి వచ్చింది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇల్లు, ధనవంతుల్లోకెల్లా ధనవంతుడి ఇల్లు, ఫోర్బ్స్ ఇండియా నుంచి హఫ్పింగ్టన్ పోస్టు దాకా అందరూ అబ్బురపోయి వార్తలు రాసిన ఇల్లు అయిన ఆంటీలియా అనబడే 27 అంతస్తుల ఇంటికి ప్లాస్టిక్ కవర్లు కప్పక తప్పలేదు. పేదోడి ఇంటికి మీటరు ప్లాస్టిక్ షీట్లు కావాల్సి వస్తే అంబానీ ఇంటికి కిలోమీటర్ల పొడవైన ప్లాస్టిక్ షీటు కావలసి వచ్చింది. ఇప్పుడు ప్లాస్టిక్ షీట్లు కప్పుకున్న అంబానీ ఇల్లు ఫోటో సోషల్ మీడియా అంతటా హల్ చల్ చేస్తోంది.