అంబానీకీ తప్పని వానబాధలు
అంబానీకీ తప్పని వానబాధలు
Published Fri, Jul 4 2014 4:28 PM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM
వానకి పెద్దా చిన్నా తెలియదు... ధనిక, పేద తెలియదు. అందరినీ సమానంగా ముంచెత్తుతుంది. పేదోడి గుడిసెకీ, అంబానీ ఆరువేల కోట్ల ఆంటీలియా ఇంటినీ వాన తడిపిముద్ద చేసేస్తుంది.
ఈ మాట అక్షరాలా నిజమని శుక్రవారం ముంబాయిలో కురిసిన వాన నిరూపించింది. వాన జోరుకి ఇంట్లోకి జల్లు రాకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్ అడ్డం పట్టినట్టే అంబానీ అంతటివాడూ ప్లాస్టిక్ కవర్లు అడ్డం పెట్టాల్సి వచ్చింది.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇల్లు, ధనవంతుల్లోకెల్లా ధనవంతుడి ఇల్లు, ఫోర్బ్స్ ఇండియా నుంచి హఫ్పింగ్టన్ పోస్టు దాకా అందరూ అబ్బురపోయి వార్తలు రాసిన ఇల్లు అయిన ఆంటీలియా అనబడే 27 అంతస్తుల ఇంటికి ప్లాస్టిక్ కవర్లు కప్పక తప్పలేదు. పేదోడి ఇంటికి మీటరు ప్లాస్టిక్ షీట్లు కావాల్సి వస్తే అంబానీ ఇంటికి కిలోమీటర్ల పొడవైన ప్లాస్టిక్ షీటు కావలసి వచ్చింది.
ఇప్పుడు ప్లాస్టిక్ షీట్లు కప్పుకున్న అంబానీ ఇల్లు ఫోటో సోషల్ మీడియా అంతటా హల్ చల్ చేస్తోంది.
Advertisement
Advertisement