Mukesh Ambani House: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసమైన అంటిలియా అడ్రస్ ఆరా తీసిన ముగ్గురు అనుమానితులను న్యూ ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన ఆధారాల ప్రకారం స్థానిక ఆజాద్‌మైదాన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, నాకా బందీ నిర్వహించి న్యూ ముంబైలో వారిని పట్టుకున్నారు. సోమవారం అంబానీ నివాసమైన అంటిలియా భవనం ఎక్కడుందని ఖిల్లా కోర్టు వద్ద నీలం రంగు కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తనని అడిగారని ఓ ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. వారి వద్ద ఓ బ్యాగు ఉందని తెలిపాడు.
ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే నాకా బందీ ఏర్పాటు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల ఊహాచిత్రాలను తయారు చేశారు. న్యూ ముంబైలో వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ముగ్గురు గుజరాత్‌కు చెందిన వారుగా గుర్తించారు. వీరు ముంబై పర్యటించేందుకు వచ్చారని చెప్పారు. గుగుల్ యాప్ పనిచేయకపోవడంతో అంటిలియా భవనం అడ్రస్ గురించి ఆ ట్యాక్సీ డ్రైవర్‌ను అడిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీని వెనక విధ్వంసం సృష్టించే ఎలాంటి దురుద్ధేశం వారికి లేదని పోలీసులు తెలిపారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: (ఆస్పత్రిలో చేరిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. విశ్రాంతి లేకుండా పోరాడుతూ ఆ నొప్పిని..)
Comments
Please login to add a commentAdd a comment