Mukesh Ambani Purchase New Home in London: భారతీయ అపరకుభేరుడు, అసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ లండన్ లోని బకింగ్ హామ్‌లో గల స్టోక్ పార్క్‌లో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ 300 ఎకరాల స్థలంలో ఉన్న 49 బెడ్ రూమ్‌లు ఉన్న ఇంటిని ప్రత్యేకంగా రూ.592 కోట్లతో సొంతం చేసుకున్నట్లు జాతీయ మీడియా మిడ్ డే కథనాల్ని ప‍్రచురించింది.
ఏడాది నుంచే
ప్రస్తుతం మనదేశంలో ముఖేష్ అంబానీ నివాసం 'ఆంటిలియా' అల్టామౌంట్ రోడ్ లో ఉంది. అయితే కరోనా కారణంగా రెండో ఇంటి అవసరం ఉందని ముఖేష్ గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే నిలువుగా ఉండే ఆంటిలియా'లా కాకుండా సువిశాలంగా ఉండే ఇల్లును కొనుగోలు చేయాలని గత ఏడాది నుంచి ప్రయత్నాలు ప్రారంభించినట్లు మిడ్ తన కథనంలో ప్రస్తావించింది.ఇందులో భాగంగా లండన్ స్టోక్ పార్క్ స్థలాన్ని ముఖేష్ కొనుగోలు చేశారని, ఈ ఏడాది ఆగస్ట్ నుంచి తమ అవసరాలకు అనుగుణంగా 49 బెడ్ రూమ్‌లు ఉన్న ఆ ఇంటిని మార్పులు చేయిస్తున్నట్లు మిడ్‌డే మీడియా తెలిపింది.
రిలయన్స్ స్పందించింది
స్టోక్ పార్క్ స్థలాన్ని కొనుగోలు చేసిన విషయంపై జాతీయ మీడియాలో వస్తున్న వార్తలపై రిలయన్స్ సంస్థ స్పందించింది.భారత్ తప్ప మిగిలిన దేశాల్లో ముఖేష్ కుటుంబానికి నివసించే ఉద్దేశం లేదని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. స్టోక్ పార్క్ ఎస్టేట్‌ను గోల్ఫింగ్ కేంద్రంగా, స్పోర్టింగ్ రిసార్ట్‌గా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో భారతదేశ ప్రఖ్యాత హాస్పిటాలిటీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తునట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment