అత్యంత అందమైన, ఖరీదైన భవనం అంటే ముంబై నగరం నడిబొడ్డున అల్టామౌంట్ రోడ్‌లో కొలువుదీరిన ఆంటిలియా భవనం గుర్తొస్తుంది. మరి అంత గొప్ప భవనానికి మరింత సొబగులు అద్ది కొత్త కళను తీసుకొచ్చిన ఇంటీరియర్ డిజైనర్ ఎవరో తెలుసా? ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.
ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ ముఖేష్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త నీతా అంబానీలకు చెందినదే ఈ ఆంటిలియా భవనం, ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఇల్లు ఈ ఐకానిక్ ఆంటిలియా. ఐశ్వర్యానికి, నిర్మాణ అద్భుతానికి,లగ్జరీ సదుపాయాలకు నిదర్శనంగా నిలుస్తుందీ భవనం. దీని విలువ 15,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
యూకేకు చెందిన బకింగ్ హామ్ ప్యాలస్ తర్వాతే ఇదే అత్యంత ఖరీదైన భవనంగా నిలిచింది. దాదాపు 4,532 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని చికాగోకు చెందిన ఆర్కిటెక్ట్ పెర్కిన్స్ డిజైన్ చేశారు. దీనిని ఆస్ట్రేలియాకు చెందిన నిర్మాణ రంగ సంస్థ లైయిటన్ హోల్డింగ్స్ నిర్మించింది.
అయితే ఈలగ్జరీ భవనంలోని లాంజ్ ఏరియాను డిజైన్ చేసిన డిజైనర్ మరెవరో కాదు, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ ,బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్. తనదైన డిజైన్స్, క్రియేటివ్ టచ్‌తో ఆంటిలియాకు మరింత సొబగులను అద్దింది గౌరీ ఖాన్. ఇంటీరియర్ ఆర్కిటెక్చర్‌గా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన గౌరీ ఖాన్ 2019లో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టి తన మార్క్ నైపుణ్యం, డిజైన్స్‌తో ఈ భవంనలోని బార్ లాంజ్ ప్రాంతానికి కొత్త కళను తీసుకొచ్చింది. తన అనుభవాలను గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన గౌరీ ఖాన్ "అద్భుతమైన అనుభవం"గా అభివర్ణించింది. అంతేకాదు డిజైన్స్ పట్ల ఆసక్తి ఉన్న నీతాతో కలిసి పనిచేయడం నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ ఆమె రాసుకొచ్చింది.
గౌరీ ఖాన్ డిజైన్స్ ఫౌండర్‌గా, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ వ్యవస్థాపకులుగా గౌరీ ఖాన్ ఇంటిరీయర్ డిజైనర్‌గా ఖ్యాతి గడించారు. ఈ క్రమంలోనే రణ్‌బీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కరణ్ జోహార్, వరుణ్ ధావన్, అలియా భట్, అనన్య పాండే తదితర పలువురు బాలీవుడ్ ప్రముఖుల గృహాలను అద్భుతంగా తీర్చిదిద్దింది.
27 అంతస్తులున్న లగ్జరీ హౌస్ ఆంటిలియాలో హెల్త్ స్పా, సెలూన్, మూడు స్విమ్మింగ్ పూల్స్, ఒక బాల్‌రూమ్ ఉన్నాయి. అలాగే యోగా, డ్యాన్స్ స్టూడియోల తోపాటు, 168 కార్లు పార్క్ చేసేందుకు కావాల్సినంత స్థలం ఉంటుంది. అంతేకాదు ఈ ఆంటిలియా భవనం 8.0 తీవ్రతతో భూకంపాన్ని కూడా తట్టుకోగలదట.
Comments
Please login to add a commentAdd a comment