ఒలింపిక్ పతక విజేతలతో నీతా అంబానీ: వైరల్ వీడియో | Nita Ambani With Manu Bhaker Neeraj Chopra And Paralympics Medallists At Antilia, Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఒలింపిక్ పతక విజేతలతో నీతా అంబానీ: వైరల్ వీడియో

Published Mon, Sep 30 2024 1:04 PM | Last Updated on Mon, Sep 30 2024 3:25 PM

Nita Ambani With Manu Bhaker Neeraj Chopra and Paralympics Medallists at Antilia

ముంబైలోని అంబానీ నివాసం యాంటిలియాలో ఆదివారం రాత్రి రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' ఈవెంట్‌లో భారతదేశ ఒలింపిక్స్, పారాలింపిక్స్ పోటీదారులకు ఆతిథ్యం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్‌లో.. పారిస్ ఒలింపిక్స్ 2024 పతక విజేతలు మను భాకర్, నీరజ్ చోప్రాతో పాటు పారిస్ పారాలింపిక్స్ 2024 పతక విజేతలు నవదీప్ సింగ్, మోనా అగర్వాల్‌లతో నీతా అంబానీ ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులు సత్కరించారు.

సుమిత్‌తో పాటు నీరజ్ చోప్రా, మను భాకర్, మురళీకాంత్ పెట్కర్, దేవేంద్ర ఝఝరియా సహా భారతదేశ ఒలింపిక్ & పారాలింపిక్ ఛాంపియన్‌లు అంటిల్, నితేష్ కుమార్, హర్విందర్ సింగ్, ధరంబీర్ నైన్, నవదీప్ సింగ్, ప్రవీణ్ కుమార్, దీపా మాలిక్, సానియా మీర్జా, కర్ణం మల్లీశ్వరి, పుల్లెల గోపీచంద్, హర్భజన్ సింగ్ వంటి క్రీడా దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారత మాజీ దిగ్గజ గోల్‌కీపర్‌ పిఆర్‌ శ్రీజేష్‌ తన కుటుంబంతో సహా ఆంటిలియాకు చేరుకున్నారు. పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన పారా షట్లర్లు సుహాస్ యతిరాజ్, నితేష్ కుమార్ కూడా ఈ ఈవెంట్‌ను హాజరయ్యారు.

ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్

యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్‌లో నీతా అంబానీ మాట్లాడుతూ.. భారతదేశం మొత్తం మన అథ్లెట్లను చూసి గర్విస్తోంది. మొదటిసారి భారత పారిస్ ఒలింపియన్లు, పారా ఒలింపియన్లు ఒకే వేదికపైకి చేరుతున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ తరపున, 'యునైటెడ్ వుయ్ ట్రయంఫ్' ఒక ఉద్యమంగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement