లండన్ : సాధారణంగా మనలో చాలా మంది పొద్దునే కాఫీ లేదా టీ తాగకుండా ఏ పని మొదలుపెట్టరు. అయితే మనుషుల్లాగే లండన్‌లో ఒక గుర్రం కూడా పొద్దునే కప్పు టీ తాగకుండా ఏ పని ప్రారంభించదట. వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు యూకే పోలీసులు. తాజాగా గుర్రం టీ తాగుతున్న వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివరాలు.. జాక్ అనే గుర్రం లండన్‌లోని మెర్సీసైడ్ పోలీసుల వద్ద 15 ఏళ్లుగా ఉంటుంది. వారు చేసే ఆపరేషన్లలో ఇది చాలా చురుకుగా పాల్గొనేది.
మొదట్లో జాక్ ట్రైనర్ లిండ్సే గేవన్ ఉదయం పూట నిద్ర లేపడానికి టీ ఇచ్చేవాడు. జాక్ క్రమంగా దానికి అలవాటు పడిపోవడంతో టీ తాగందే ఏ పని ప్రారంభించకపోవడం చేసేది. దీంతో మెర్సీసైడ్ పోలీసులు దానికోసం ఒక పెద్ద మగ్‌ను తయారు చేసి ప్రతీరోజు ఉదయం రెండు షుగర్ క్రిస్టల్స్ బాల్స్‌ను వేసి టీని అందిస్తున్నారు. అంతేగాక రాత్రి పూట కూడా టీ కచ్చితంగా ఇవ్వాల్సిందేనని లేకపోతే అది నిద్రపోదని తెలిపారు.
తాజాగా జాక్ టీ తాగుతున్న వీడియోను ట్విటర్‌లో షేర్ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతూనే కామెంట్లు పెడుతున్నారు. ' ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఈరోజు మా దినచర్యను ఈ వీడియోతో ప్రారంభించాం' అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం జాక్ తన దినచర్యను టీ తాగకుండా ప్రారంభించకపోవడం ఫన్నీగా ఉందని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment