గుర్రాన్ని వాకింగ్‌కు తీసుకెళుతున్న కుక్కపిల్ల | Puppy Takes His Friend Mojo Named Horse For A Walk Using Rope To Drag | Sakshi
Sakshi News home page

గుర్రాన్ని వాకింగ్‌కు తీసుకెళుతున్న కుక్కపిల్ల

Published Thu, Feb 4 2021 4:48 PM | Last Updated on Thu, Feb 4 2021 7:03 PM

Puppy Takes His Friend Mojo Named Horse For A Walk Using Rope To Drag - Sakshi

కాన్‌బెరా: రెండు భిన్న జాతులకు చెందిన జంతువులు స్నేహం చేయలేవనేది కొంతమంది అభిప్రాయం. కానీ ఇటీవల కోతి-కుక్క, పిల్లి-కుక్క, కోతి-పిల్లులు స్నేహంగా ఉంటున్న సంఘటనలు చూస్తునే ఉన్నాం. తాజాగా ఓ గుర్రం, కుక్కపిల్ల కలిసి వాకింగ్‌కు వెళుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన ఓ వ్యక్తి  తన ఫాంలో గుర్రాలను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి పెంపుడు కుక్కపిల్ల ఒడిన్‌, పది నెలల గుర్రం పిల్ల మోజోతో స్నేహంగా ఉంటోందట. అవి రెండు కలిసి రోజూ ఫాంలో వాకింగ్‌కు వెళ్లడం, కలిసి ఆడుకోవడం చేస్తాయట. (చదవండి: ఆధార్‌ కార్డులో పెళ్లి భోజనాల జాబితా..)

ఈ నేపథ్యంలో ఓ రోజు అవి కలిసి వాకింగ్‌ చేస్తుండగా ఆ యజమాని వీడియో తీసి సోమవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఆ కుక్కపిల్ల గుర్రం తాడును నోటితో పట్టుకుని లాక్కెళుతూ ముందుకు నడుస్తోంది. ఆ గుర్రం రానన్నట్లు ఆగిపోతుంటే రమ్మని పిలుస్తున్నట్లు కుక్క పిల్ల సైగ చేస్తున్న ఈ దృశ్యం ప్రతి ఒక్కిరిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు నెటిజన్‌లు ఫిదా అవుతూ తమ స్పందనను తెలుపుతున్నారు. ‘వావ్‌ ఈ రెండు చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నాయో’, ‘ఈ కుక్క ఆ గుర్రాన్ని వాకింగ్‌ తీసుకెళుతోందేమో’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. (చదవండి: రిహన్నా ట్వీట్‌.. గూగుల్‌లో ఏం సెర్చ్‌ చేశారంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement