వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైయిన ‘గిన్నిస్’కు ఎక్కిన బెల్జియన్ జాతి గుర్రం బిగ్ జాక్ ఇకలేదు. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కొలంబియా కౌంటీలోని పోయ్‌నెట్టి గ్రామంలో ఓ గుర్రపు శాలలో మృతి చెందింది. ప్రస్తుతం బిగ్ జాక్ వయసు 20 ఏళ్లు. కాగా, రెండు వారాల క్రితం ఆ గుర్రం మరణించిందని దాని యజమాని జెర్రీ గిల్బర్ట్ భార్య వలీషియా గిల్బర్ట్ వెల్లడించారు. ఇక బిగ్ జాక్ 6.10 అడుగులు ఎత్తు (2.1 మీటర్లు) ఉండేది. దాని బరువు 1,136 కిలోలు (2,500 పౌండ్లు). దీంతో బతికున్న వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైయిన గుర్రంగా బిగ్ జాక్ గిన్నిస్ బుక్ రికార్డ్స్‌ల్లోకి ఎక్కింది.
కాగా, నబ్రాస్కాలో పుట్టిన బిగ్ జాక్ పుట్టినప్పుడు దాని బరువు 109 కిలోల (240 పౌండ్లు). సాధారణంగా బెల్జియన్ జాతి గుర్రాలు 100 నుంచి 140 పౌండ్ల (45 నుంచి 65 కిలోల) బరువుతో పుడుతాయని, కానీ తన గుర్రం అసాధారణంగా 100 పౌండ్ల అధిక బరువుతో పుట్టిందని జెర్రీ గిల్బర్ట్ తెలిపారు. అంతేకాకుండా బిగ్ జాక్ జ్ఞాపకంగా ఇంతకాలం అది నివసించిన స్టాల్‌ను ఖాళీగా ఉంచుతామని జెర్రీ గిల్బర్ట్ చెప్పారు. స్టాల్ బయట ఒక ఫలకం ఏర్పాటు చేసి దానిపై బిగ్ జాక్ పేరుతోపాటు బొమ్మ వేయిస్తామని అన్నారు.
ప్రపంచంలోనే ఎత్తైన గుర్రం బిగ్ జాక్ మృతి..!
Published Tue, Jul 6 2021 10:35 PM | Last Updated on Tue, Jul 6 2021 10:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment