గాంధీనగర్: సాధారణంగా వివాహాలంటే పెళ్లి ఊరేగింపులు, బరాత్‌లు, సందడి డీజేలు సహజం. ఎందుకుంటే జీవితంలో మనం జరుపుకునే ముఖ్యమైన కార్యక్రమాలలో పెళ్లి కూడా ఒకటి. అందుకే ఆ వేడుక ఎప్పటకీ గుర్తుండిపోవాలని ఇలాంటి హంగామాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే అలాంటి పెళ్లి రోజే అనుకోకుండా ఓ విషాదకర ఘటన గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో చోటు చేసుకుంది.
తన పెళ్లి రోజు ఆనందం ఎప్పటికీ గుర్తుండి పోవాలనుకున్న ఆ వరుడికి చేదు జ్ఞాపకంగా మారింది. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే? ఓ వరుడి గుర్రపు బండిలో పెళ్లి ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఊరేగింపు అంటే తెలిసిందే.. ధూంధాంగా డాన్స్‌లు, డీజే, ఒకటే సందడి సందడిగా ఉంటుంది. వీటితో పాటు కొందరు బాణసంచాలు పేలుస్తూ ముందుకు కదులుతున్నారు. అయితే కొన్ని బాణాసంచాలు వరుడి గుర్రపు బండిలో కూడా ఉండడంతో అంతలో ఓ టపాకాయి అనుకోకుండా వెళ్లి వరుడి బండిలో పడింది.
దీంతో అందులో ఉన్న టపాకాయిలు ఒక్కసారి పేలడంతో ఆ బండి మంటలో మొదలయ్యి, క్షణాల వ్యవధిలో బండి మొత్తం మంటలు వ్యాపించాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో ప్రమాదం నుంచి వరుడితో పాటు అందులో ఉన్న చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే బండి నుంచి గుర్రాలను సైతం విడదీసి, నీటిని చల్లి మంటలను ఆర్పి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
A horse carriage caught fire during a wedding procession in #Gujarat's Panchmahal. The groom had a narrow escape but no one was injured in the incident. pic.twitter.com/vsryXvWYFD
— India.com (@indiacom) December 15, 2021
చదవండి: వేల కిలోమీటర్ల నుంచి వస్తున్నాం.. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాం.. ప్లీజ్!
Comments
Please login to add a commentAdd a comment