Kedarnath Temple: Men Try Forcely Make Horse Smoke Weed On Trek - Sakshi
Sakshi News home page

వీళ్లు మనుషులేనా! కేదార్‌నాథ్‌ యాత్రలో దారుణం.. బలవంతంగా గంజాయి తాగించి..

Jun 23 2023 7:37 PM | Updated on Jun 23 2023 7:59 PM

Kedarnath Temple: Men Try Forcely Make Horse Smoke Weed On Trek - Sakshi

ఉత్తరాఖండ్‌ను దేవభూమి అంటారు. చార్ధామ్ యాత్ర కోసం వేలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోకి వెళుతుంటారు. పుణ్యక్షేత్రాల్లో ఈ స్థలానికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కేదార్‌నాథ్ అధ్యాత్మికతతో కాకుండా పలు కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇద్దరు యువకులు గుర్రానికి బలవంతంగా గంజాయి తాగించేందుకు ప్రయత్నిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. కేదార్‌నాథ్ యాత్రలో యాత్రికులు ఎక్కువగా గుర్రాలను ఉపయోగిస్తారు. గుర్రపు స్వారీ చేసేవారు, శక్తి లేని వారు కొండపైకి వెళ్లేందుకు గుర్రపు సవారిని ఎంచుకుంటారు. దీంతో గుర్రపు స్వారీ, గుర్రపు నిర్వాహకులు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారిన వీడియోలో.. ఇద్దరు యువకులు గుర్రం నోరు పట్టుకున్నారు. ఒకరు గుర్రం ముక్కు రంధ్రాలను మూసేశారు. మరొక యువకుడు గుర్రానికి గంజాయిని నాసిక రంధ్రం ద్వారా బలవంతంగా తాగించేందుకు ప్రయత్నిస్తున్నాడు. 

గుర్రపు యజమాని గుర్రానికి ఈ విధంగా మత్తు మందు ఇస్తే భక్తుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో యాత్రికుల భద్రతపై ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పలువురు ఘాటుగా స్పందించారు. వీళ్లు మనుషులేనా.. ఇది అమానుషమైన ఘటనని, జంతువులను ఇంత దారుణంగా హింసించే నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉత్తరాఖండ్ పోలీసులు స్పందిస్తూ.. గుర్రంతో బలవంతంగా గంజాయి తాగిస్తున్న వైరల్ వీడియోను మేము చూశాం. వీడియోలోని వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని" చెప్పారు.
 

చదవండి: ఇకపై బస్సు డ్రైవర్, కండక్టర్‌ల ఫోన్లు చెకింగ్.. ఎందుకంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement