న్యూ బేబీకి వెల్ కమ్: జడేజా | Ravindra Jadeja welcomes new baby to his family | Sakshi
Sakshi News home page

న్యూ బేబీకి వెల్ కమ్: జడేజా

May 6 2016 10:48 AM | Updated on Aug 21 2018 2:28 PM

న్యూ బేబీకి వెల్ కమ్: జడేజా - Sakshi

న్యూ బేబీకి వెల్ కమ్: జడేజా

గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన కుటుంబంలోకి ఓ కొత్త బేబీని ఆహ్వానించాడు.

రాజ్‌కోట్: గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన కుటుంబంలోకి ఓ కొత్త బేబీని ఆహ్వానించాడు. గత నెలలోనే పెళ్లి చేసుకున్నాడు కదా.. అప్పుడే కొత్త కొత్తగా ఈ బేబీ ఏంటని సందేహ పడుతున్నారా?. అయితే పూర్తి వివరాలిలా ఉన్నాయి.. గత నెల 17న స్థానిక వ్యాపారి కూతురు రీవా సోలంకిని జడేజా వివాహమాడాడు. అంతేనా..  పెళ్లిలో కాల్పులతో అతని వివాహవేడుక సంచలనం అయిన విషయం తెలిసిందే.  పెళ్లి తర్వాత జరిగిన బరాత్‌లో జడేజా తల్వార్‌ తిప్పుతూ హల్‌చల్‌ చేశాడు. అతడి తల్వార్ డాన్స్‌ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ గా మారిపోయింది. ఇంట్లోకి కొత్త బేబీ వచ్చిందంటూ పోస్ట్ పెట్టి తాజాగా మరోసారి జడేజా వార్తల్లోకెక్కాడు.

జంతు ప్రేమికుడైన రవీంద్ర జడేజా తనకు ఇష్టమైన ఓ గుర్రాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. న్యూ బేబీకి ఫాం హౌస్ వెల్ కమ్ అంటూ గుర్రంపై ఇష్టాన్ని చాటుకున్నాడు. ఆ గుర్రానికి 'జంకీ' అని పేరు పెట్టాడు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. జంకీకి పుట్టిన గుర్రానికి 'వారి' అని పిలుచుకుంటున్నాడు. ఆ గుర్రాలతో ఫొటోలు దిగిన వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో జడేజా పోస్ట్ చేశాడు. ఐపీఎల్ మ్యాచులతో బిజీగా ఉండటం వల్ల 'వారి'తో కలిసి ఫొటో దిగడానికి కాస్త ఎదురుచూడాల్సి వచ్చిందని, ఎట్టకేలకు ఫొటో దిగాను అని తన పోస్ట్ లో జడేజా రాసుకొచ్చాడు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement