
పెళ్లంటే జీవితకాల జ్ఞాపకం.. ఇద్దరు వ్యక్తలు కలిసి కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు వేదిక. ఇలాంటి గొప్ప రోజును అందంగా మలుచుకునేందుకు నేటి యువత ఆసక్తి చూపుతున్నారు. హల్దీ, మెహందీ ఫంక్షన్, సంగీత్ అంటూ కొత్తకొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. సర్‌ప్రైజ్‌లు, సరదాలు, ముఖ్యంగా డ్యాన్స్ కార్యక్రమం లేకుండా అసలు పెళ్లిళ్లే జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక పెళ్లి వేడకలో ఫన్నీ మూమెంట్స్, షాకింగ్, ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో ప్రత్యమవుతూనే ఉన్నాయి.
తాజాగా ఓ వరుడికి సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన స్పెషల్ ఎంట్రీతో వధువును సర్‌ప్రైజ్ చేయాలనుకున్న వరుడి ఆశలు తలకిందులయ్యాయి. అసలేం జరిగిందంటే.. పెళ్లి కోసం అదంగా ముస్తాబైన వరుడు గుర్రంపై ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అదే సమయంలో బంధువులు టపాసులు పేల్చారు. బాంబులు పేలిన సౌండ్‌కు ఒక్కసారిగా బెదిరిన గుర్రం అక్కడి నుంచి దూరంగా పారిపోయింది.
దీంతో ఆ గుర్రాన్ని పట్టుకోవడానికి దాని యజమాని వెనకాలే పరుగులు పెట్టాడు. అయితే గుర్రంపై కూర్చున్న వరుడు కూడా అటే వెళ్లడంతో బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు గానీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 9.7 లక్షల మంది వీక్షించారు. దీనిని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
చదవండి: Viral: ప్రేమకు వేదికైన కళాశాలలోనే పెళ్లి చేసుకున్న జంట
Comments
Please login to add a commentAdd a comment