గుర్రాలకు బ్రాండెడ్‌ షూ.. ధర తెలిస్తే షాక్‌ అవ్వకుండా ఉండరు | These Sneakers Are For Your Horses | Sakshi
Sakshi News home page

గుర్రాలకు బ్రాండెడ్‌ షూ.. ధర తెలిస్తే షాక్‌ అవ్వకుండా ఉండరు

Published Sat, Sep 16 2023 12:32 PM | Last Updated on Sat, Sep 16 2023 2:36 PM

These Sneakers Are For Your Horses - Sakshi

గుర్రాలకు నాడాలు ఉంటాయి కదా! మరి స్నీకర్స్‌ ఏమిటి అనుకుంటున్నారా? విడ్డూరంగా అనిపించినా, గుర్రాలకూ స్నీకర్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి. దౌడుతీసే గుర్రాలకు నాడాలు బిగించడమే మనకు తెలుసు. ఈ నాడాలు బిగించడం కొంత హింసాత్మకమైన ప్రక్రియ. స్నీకర్స్‌ వల్ల గుర్రాలకు నాడాల బెడద ఇకపై ఉండదంటున్నారు ప్రముఖ షూ సర్జన్, స్నీకర్స్‌ కాస్ట్యూమ్‌ స్పెషలిస్ట్‌ మార్కస్‌ ఫ్లాయిడ్‌. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండెడ్‌ స్నీకర్స్‌ను పోలి ఉండే స్నీకర్స్‌ను ఆయన గుర్రాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

‘హార్స్‌ కిక్స్‌’ పేరుతో ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభించి, దాని ద్వారా వీటిని ఆయన విక్రయిస్తున్నారు. ‘ఎస్పీఎల్వై–350’, ‘న్యూ బ్యాలెన్స్‌–650’ పేరిట గుర్రాల కోసం ఇటీవల రెండు అందమైన మోడల్స్‌లో కొత్త తరహా స్నీకర్స్‌ను కూడా విడుదల చేశారు. గుర్రాల పాదాల సైజుకు అనుగుణంగా వీటిని ఆర్డర్‌ ఇచ్చి తయారు చేయించుకోవచ్చు. వీటి ప్రారంభ ధర లక్ష రూపాయల నుంచి ఉంటుంది. ప్రస్తుతం వీటిలో కొద్ది మోడల్స్‌ మాత్రమే ఉన్నాయి. త్వరలోనే మరిన్ని డిజైన్స్, మోడల్స్‌తో పాటు లెగ్జింగ్టన్, కెంచూరీలలో ప్రత్యేక స్టోర్స్‌ను కూడా ప్రారంభించనున్నట్లు మార్కస్‌ తెలిపారు.

(చ‌ద‌వండి: జస్ట్‌ "పిట్టబొమ్మ" అనుకునేరు..ఇది చేసే పని చూస్తే అవాక్కవ్వాల్సిందే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement