
ఎల్‌ఓసీ దాడుల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో నేతలు
♦ కేంద్రానికి అఖిలపక్ష మద్దతు
♦ ఏ నిర్ణయం తీసుకున్నా సహకరిస్తాం
♦ ఆర్మీపై అభినందనల వెల్లువ
న్యూఢిల్లీ: పాకిస్తాన్ విషయంలో కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా పూర్తి మద్దతు ఉంటుందని అఖిలపక్షం తెలిపింది. ఉడీ ఘటనకు ప్రతీకారంగా జరిపిన ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులను ప్రశంసించింది. కేంద్ర హో మంత్రి రాజ్‌నాథ్ నాయకత్వంలో గురువారం సాయంత్రం అఖిలపక్ష భేటీ జరిగింది. సర్జికల్ దాడుల విధానాన్ని కేంద్రం వివరించింది. కుప్వారా, పూంచ్ సెక్టార్ల వెంబడి ఎల్వోసీలో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడి చేశామని.. డీజీఎంవో(డెరైక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్) లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ అఖిలపక్ష సభ్యులకు తెలిపారు.
భేటీ అనంతరం సమాచార మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ. నిఘా నివేదికల ప్రకారం భారత్‌లో దాడులకు, చొరబాట్లకు ప్రయత్నించటంతోనే ఈ దాడులు జరిపామన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోందన్నారు. భేటీకి గులాంనబీ ఆజాద్ (కాంగ్రెస్), ఏచూరి (సీపీఎం), శరద్ పవార్ (ఎన్సీపీ), బీజేపీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
సీఎంలతో మాట్లాడిన రాజ్‌నాథ్.. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్, బిహార్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల సీఎంలతోపాటు మాజీ ప్రధాని దేవెగౌడ, విపక్ష నేతలతో హోం మంత్రి రాజ్‌నాథ్ ఫోన్లో మాట్లాడి దాడుల గురించి చెప్పారు.అంతకుముందు ప్రధాని నేతృత్వంలో భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది జాతీయ భద్రత సలహాదారు దోవల్, డీజీఎంవో రణ్‌బీర్ కూడా హాజరయ్యారు. తాజా పరిస్థితిని సమీక్షించిన మోదీ అనంతరం.. రాాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌లకు సర్జికల్ దాడుల వివరాలను ఫోన్లో తెలిపారు.