హైదరాబాద్ వెలుపల అభివృద్ధిపై అఖిలపక్షం
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కాకుండా శివార్లలో నలుదిక్కులా కనిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇటు మహబూబ్‌నగర్, అటు వరంగల్, కరీంనగర్.. ఇలా పలుదిక్కుల వివిధ రకా లుగా పురోగతి సాధించేలా ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించారు. నగరం చుట్టూ విస్తరించిన ఔటర్ రింగురోడ్డు–కొత్తగా ప్రతిపాదించిన రీజినల్ రింగురోడ్డుకు మధ్య, రీజినల్ రింగురోడ్డు అవతల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఫార్మాసిటీ, ఐటీ కారిడార్, టెక్స్‌టైల్ పార్కు.. ఇలా పలు ఉపాధి రంగాలను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు శుక్రవారం శాసనసభ దృష్టికి తెచ్చారు. వీటి సమగ్ర వివరాలను అన్ని పక్షా లకు అందించే ఉద్దేశంతో త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
ఫార్మా కాలుష్యం తగ్గాలి
హైవే మీదుగా వెళ్తుంటే ఎక్కడ ఘాటైన వాసన వస్తే అక్కడ ఫార్మా కంపెనీ ఉన్నట్టు ఇట్టే అర్థమవుతుందని సీఎం అన్నారు. ఆ రకమైన కాలుష్యం లేకుండా చూడాల్సిన అవసర ముందని ఆయన చెప్పారు.
10వేల కోట్లతో టెక్స్‌టైల్ పార్కు: కేటీఆర్
వరంగల్‌లో 1,200 ఎకరాల్లో రూ.10 వేల కోట్ల వ్యయంతో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనివల్ల 3 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఫైబర్ టూ ఫ్యాబ్రిక్‌గా టెక్స్‌టైల్ పార్కును అభివృద్ధి చేస్తాం. ఇది 2018లో అందుబాటులోకి వస్తుంది. త్వరలో శంకుస్థాపన ఉంటుంది. వరంగల్ రూరల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ చేరువలో రూ.270 కోట్లతో లెదర్ పార్కును ఏర్పాటు చేస్తున్నాం’’ అని చెప్పారు.