Pamban Bridge
-
దేశానికే తలమానికం: ప్రధాని మోదీ
తమిళనాడుకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదు. 2014 కంటే ముందు పదేళ్లతో పోలిస్తే గత పదేళ్లలో మూడురెట్లు ఎక్కువ నిధులు తమిళనాడుకు ఇచ్చాం. తమిళనాడుకు రైల్వే బడ్జెట్ ఏడు రెట్లు పెంచాం. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు. అయినా నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. సాక్షి, చెన్నై: తమిళనాడులోని రామేశ్వరంలో నూతన పంబన్ రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రికార్డుకెక్కిన ఈ వంతెనను జాతికి అంకితం చేశారు. ఈ వంతెన దేశానికే తలమానికం అని వ్యాఖ్యానించారు. అలాగే రామేశ్వరం–తాంబరం (చెన్నై) కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. వర్టికల్ బ్రిడ్జి గుండా రాకపోకలు సాగించే కోస్ట్‌గార్డ్ షిప్‌ను సైతం ప్రారంభించారు. అనంతరం సభలో పాల్గొన్నారు. ఈ కీలకమైన కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ గైర్హాజరయ్యారు. ఆదివారం ఉదకమండలంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండడంతో తాను రాలేకపోతున్నట్లు ముందుగానే సమాచారం ఇచ్చారు. నియోజకవర్గాల పునరి్వభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపట్ల ఆగ్రహంతో ఉన్న స్టాలిన్ ప్రధాని మోదీ కార్యక్రమానికి వ్యూహాత్మకంగానే దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. డీలిమిటేషన్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఆయన ఇప్పటికే ప్రధానమంత్రిని కోరారు. తమిళంలో సంతకాలు చేయలేరా? తమిళనాడులో రూ.8,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాముడు అందించిన సుపరిపాలన మన దేశ నిర్మాణానికి పునాది అని చెప్పారు. రాముడితో తమిళనాడుకు ఎంతో అనుబంధం ఉందంటూ సంగమ శకం నాటి సాహిత్యాన్ని ప్రస్తావించారు. శ్రీలంక నుంచి గత పదేళ్లలో 3,700 మంది తమిళ జాలర్లను వెనక్కి తీసుకొచ్చామని తెలిపారు. వీరిలో 600 మందిని గత ఏడాది కాలంలోనే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. తమిళ మాధ్యమంలో వైద్య విద్య అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల పేదలకు లబ్ధి కలుగుతుందన్నారు. తమిళనాడుకు ఇటీవల 11 నూతన మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు వివరించారు. తమిళ భాషను, సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రపంచంలో అన్ని మూలలకూ తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తమిళనాడు నాయకుల నుంచి తనకు లేఖలు వస్తుంటాయని, కానీ, వాటిపై తమిళ భాషలో సంతకాలు ఉండడం లేదని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. కనీసం తమిళ భాషలో సంతకాలు చేయాలని కోరారు. నిధుల కేటాయింపులో వివక్ష లేదు తమిళనాడు మత్స్యకారులు కష్టపడి పనిచేస్తారని ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘పీఎం మత్స్య సంపద యోజన’ కింద తమిళనాడుకు గత ఐదేళ్లలో భారీగా నిధులు కేటాయించామని చెప్పారు. మత్స్యకారులకు ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సీవీడ్ పార్కులు, ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఉద్ఘాటించారు. తమిళనాడుకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదని తేల్చిచెప్పారు. 2014 కంటే ముందు పదేళ్లలో కేటాయించిన దాని కంటే గత పదేళ్లలో మూడురెట్లు ఎక్కువ నిధులు తమిళనాడుకు ఇచ్చామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఈ నిధులు ఎంతగానో తోడ్పడ్డాయని అన్నారు. నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారని స్పష్టంచేశారు. తమిళనాడుకు రైల్వే బడ్జెట్ ఏడు రెట్లు పెంచామన్నారు. రాష్ట్రంలో 2014 కంటే ముందు రైలు ప్రాజెక్టులకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు ఏటా రూ.6,000 కోట్లు ఇస్తున్నామని తెలియజేశారు. 2014 తర్వాత రాష్ట్రంలో కేంద్ర నిధులతో 4,000 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. రామనాథ స్వామి ఆలయంలో పూజలు ప్రధాని మోదీ రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ వ్రస్తాలు ధరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు శ్రీలంక నుంచి రామేశ్వరం చేరుకున్న ప్రధానమంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఆయనకు అభివాదం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. నూతన పంబన్ వంతెనను ప్రారంభించిన అనంతరం మోదీ రామనాథస్వామి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.ఇది దైవిక యాదృచ్ఛికం హిందూ మహాసముద్రంలోని ప్రాచీన రామసేతును దర్శించుకోవడం ఒక గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘కొద్ది సేపటి క్రితమే శ్రీలంక నుంచి హెలికాప్టర్లో వస్తూ రామసేతును దర్శించుకున్నాను. ఇదొక గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నా. అయోధ్యలో బాలరాముడికి ఆదిత్యుడు తిలకం దిద్దిన సమయంలోనే ఇక్కడ రామసేతు దర్శనం కావడం దైవిక యాదృచి్ఛకం. రెండింటినీ ఒకేసారి దర్శించుకోవడం గొప్ప విషయం. శ్రీరాముడు మనందరినీ ఐక్యంగా కలిపి ఉంచే ఒక బలమైన శక్తి. ఆయన ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలన్నదే నా ఆకాంక్ష’’ అని మోదీ అన్నారు.ఇంజనీరింగ్ అద్భుతం రామేశ్వరంలో పంబన్ వర్టికల్ సీ–లిఫ్ట్ బ్రిడ్జిని రూ.550 కోట్లతో నిర్మించారు. పొడవు 2.08 కిలోమీటర్లు. 99 స్పాన్లు ఉన్నాయి. మధ్యలో 72.5 మీటర్ల పొడవైన వర్టికల్ లిఫ్ట్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వంతెన కిందినుంచి భారీ నౌకల రాకపోకలకు వీలుగా ఇది 22 మీటర్ల ఎత్తువరకు పైకి వెళ్లగలదు. నౌకలు వెళ్లిపోయిన తర్వాత యథాతథ స్థితికి చేరుకుంటుంది. ఎప్పటిలాగే రైళ్లు ప్రయాణం సాగించవచ్చు. ప్రధాన భూభాగంలోని మండపం రైల్వేస్టేషన్‌ను రామేశ్వరం దీవితో ఈ వంతెన అనుసంధానిస్తుంది. అత్యాధునిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ బ్రిడ్జి ఒక ఉదాహరణ. దీర్ఘకాలం మన్నికగా ఉండేలా నిర్మాణంలో స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించారు. హై–గ్రేడ్ రక్షణ పెయింట్ వాడారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వంతెనపై రెండు రైల్వే ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. భక్తులు రామేశ్వరం ఆలయానికి చేరుకోవడం ఇక మరింత సులభతరం కానుంది. ప్రధాన భూభాగం–రామేశ్వరం దీవి మధ్య 1914లో బ్రిటిష్ పాలకుల హయాంలో రైల్వే వంతెన నిర్మించారు. శతాబ్దం పాటు సేవలందించిన ఈ వంతెన గడువు తీరిపోవడంతో అదేచోట కొత్త వంతెన నిర్మాణానికి 2019లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా, ఆదివారం పంబన్ వంతెనను ప్రారంభించిన తర్వాత గంట సేపట్లో సాంకేతిక సమస్య నెలకొంది. కోస్ట్‌గార్డు నౌక కోసం వంతెనను 17 అడుగుల మేర పైకి ఎత్తారు. తిరిగి కిందకు దించే సమయంలో 10 అడుగుల వద్ద సాంకేతిక సమస్య ఏర్పడింది. రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించారు. -
అందుకే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్
చెన్నై: శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అద్భుత కానుకను అందించారు. తమిళనాడులోని రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన పంబన్ రైలు వంతెన(Pamban Railway Bridge)ను ప్రధాని మోదీ దేశానికి అంకితం చేశారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హాజరుకాలేదు. దీని వెనుక కారణం ఏమై ఉంటుందా? అని పలువురు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. దీనికి సీఎం స్టాలిన్ స్వయంగా సమాధానమిచ్చారు.2019లో రూ.700 కోట్ల వ్యయంతో పంబన్ వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. నేడు ప్రధాని మోదీ పంబన్ వంతెనను ప్రారంభించడంతో పాటు, రామేశ్వరం-తాంబరం (చెన్నై) మధ్య నడిచే నూతన రైలు సర్వీసుకు కూడా పచ్చ జెండా చూపారు. తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnav), తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తేనరసు తదితరులు పాల్గొన్నారు.తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, ‘రామేశ్వరంలో జరిగే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరు కాలేనని ముందుగానే ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశానని, రాష్ట్రంలోని నీలగిరిలో ఇంతకు ముందే నిర్ణయించిన కార్యక్రమాలకు తాను హాజరు కావాల్సి ఉందని వివరించానన్నారు. అందుకే తాను వంతెన ప్రారంభోత్సవానికి రాలేనని తెలియజేశానన్నారు. అయితే తమ ప్రభుత్వం తరపున మంత్రులు తంగం తెన్నరసు, రాజకన్నప్పన్ ప్రధానమంత్రిని స్వాగతిస్తారని ముందుగానే తెలియజేశానని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.తమిళనాడు సీఎం స్టాలిన్(Tamil Nadu CM Stalin) ఆదివారం (ఏప్రిల్ 6) ఉదగమండలంలో రూ.494.51 కోట్లతో నిర్మించిన 1,703 ప్రభుత్వ నిర్మాణాలను ప్రారంభించారు. ఇందులో కొత్తగా నిర్మించిన ఉదగమండలం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి కూడా ఉంది. దీనితో పాటు, నీలగిరి జిల్లాలో రూ. 130.35 కోట్ల విలువైన 56 కొత్త ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు.ఇది కూడా చదవండి: ఫేర్‌వెల్‌లో స్పీచ్ ఇస్తూ.. గుండెపోటుతో 20 ఏళ్ల విద్యార్థిని మృతి -
దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన.. ప్రారంభించిన మోదీ
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటించారు. పర్యటనలో భాగంగా రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వేసీ బ్రిడ్జిని ప్రారంభించారు. సముద్రంలో బ్రిడ్జి కింద నౌకలు రాకపోకలు సాగేలా ఈ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జీ నిర్మాణం జరిగింది. సముద్రమట్టానికి 22 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ బ్రిడ్జీ పొడవు 2.2 కిలోమీటర్లు. దీని వ్యయం రూ. 535 కోట్లు. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తిచేసింది.Rameswaram, Tamil Nadu: PM Narendra Modi inaugurates New Pamban Bridge - India’s first vertical lift sea bridge and flags off Rameswaram-Tambaram (Chennai) new train service, on the occasion of #RamNavami2025 pic.twitter.com/6ts8HNdwqy— ANI (@ANI) April 6, 2025దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభమైంది. సముద్రంలో నిర్మించిన తొలి వ ర్టీకల్ లిఫ్ట్(Vertical Lift) (నిలువునా పైకి లేచే) వంతెనను అందుబాటులోకి వచ్చింది.శ్రీరామనవమి పర్వదినాన ప్రధాని మోదీ తొలి వర్టీకల్ లిఫ్ట్‌ను ప్రారంభించారు.భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవటంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దీనిని జాతికి అంకితం చేశారు. దూర ప్రయాణాన్ని తగ్గించేందుకు.. 1914లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తమిళనాడులోని మండపం (సముద్రం ప్రారంభమయ్యే ప్రాంతం) నుంచి పంబన్ (రామేశ్వరం దీవి ప్రారంభ చోటు) వరకు రైలు వంతెనను నిర్మించింది. ఆ సమయంలోనే వంతెన మధ్యలో పడవలకు దారిచ్చేందుకు రోలింగ్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో వంతెన స్పాన్లు విడిపోయి ఉంటాయి. సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్రంలో ఇనుప కమ్మీలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్డు లెవల్ క్రాసింగ్ రైలు గేటు తరహాలు పైకి లేస్తాయి.దీంతో పడవలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత మళ్లీ మూసి విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు. సముద్రపు నీటి ప్రభావంతో ఈ వంతెన తుప్పుపట్టి బలహీనపడింది. దీంతో రోలింగ్ లిఫ్ట్‌కు బదులుగా వ ర్టీకల్ లిఫ్ట్‌తో కొత్త వంతెనను నిర్మించారు. వంతెన మధ్యలో ఈ లిఫ్ట్ లేకపోతే నౌకలు రామేశ్వరం దాటిన తర్వాత ఉన్న మనదేశ చిట్టచివరి భూభాగం ధనుషో్కడి ఆవలి నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివల్ల 150 కి.మీ. అదనపు దూరాభారం అవుతుంది. వంతెన ప్రత్యేకతలు..వంతెన నిర్మాణ వ్యయం రూ.540 కోట్లు. పొడవు 2.10 కి.మీ.పిల్లర్లతో కూడిన పైల్స్ సంఖ్య 333సముద్రగర్భంలో సగటున 38 మీటర్ల లోతు వరకు పిల్లర్లు. వీటికోసం వాడిన స్టెయిన్లెస్ స్టీలు 5,772 మెట్రిక్ టన్నులు (రీయిన్‌ఫోర్స్‌మెంట్), స్ట్రక్చరల్ స్టీల్ 4,500 మెట్రిక్ టన్నులు.సిమెంటు వినియోగం 3.38 లక్షల బస్తాలు. 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పైకి లేచే భాగం బరువు 660 మెట్రిక్ టన్నులు. స్పెయిన్ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు. ఆ దేశానికి చెందిన టిప్స సంస్థను కన్సల్టెన్సీగా నియమించుకుని వంతెనను డిజైన్ చేయించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ప్రపంచంలో సముద్రపు నీరు, ఉప్పు గాలి ప్రభావంతో ఇనుము అతి వేగంగా తుప్పుపట్టే ప్రాంతం మియామీ. ఆ తర్వాత పంబన్ ప్రాంతమే. దీంతో కొత్త వంతెన తుప్పు బారిన పడకుండా జింక్, 200 మైక్రాన్ల ఆప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ల పాలీ సిలోక్సేన్‌తో కూడిన రంగు డబుల్ కోట్ వేశారు. కనీసం 35 సంవత్సరాల పాటు ఈ పొర తుప్పును అడ్డుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ పూస్తే మరికొంతకాలం తప్పు పట్టదు.పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే రెండు భాగాలు రెక్కాల్లా పైకి లేచేవి. కొత్త వంతెనలో కేవలం 5.20 నిమిషాల్లో 660 టన్నుల బరువున్న 72 మీటర్ల భాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది. ఈ వంతెనపై రైళ్లను గంటకు 80 కి.మీ. వేగంతో నడిపే వీలుంది. కానీ, రైల్వే సేఫ్టీ కమిషనర్ 74 కి.మీ. వేగానికి అనుమతించారు. పాత వంతెనపై గరిష్ట వేగం గంటకు 10 కి.మీ. మాత్రమే. నిర్మాణ పనులు 2019లో మొదలయ్యాయి. కొవిడ్ వల్ల కొంతకాలం ఆలస్యమైనా, మొత్తంగా 2 సంవత్సరాల్లోనే పూర్తిచేశారు. 2022 డిసెంబర్లో పాత వంతెనపై రైళ్ల రాకపోకలు నిలిపేశారు. అప్పట్లో రోజుకు 18 ట్రిప్పుల రైళ్లు తిరిగేవి. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లిఫ్టు టవర్లకు 310 టన్నుల బరువు తూగే భారీ స్టీల్ దిమ్మెలు రెండు వైపులా కౌంటర్ వెయిట్స్‌గా ఏర్పాటు చేశారు. కరెంటు శక్తితో వంతెన భాగం పైకి లేవటం మొదలుకాగానే కౌంటర్ వెయిట్స్ మరోవైపు దిగువకు జారటం ద్వారా వంతెన భాగం పైకి వెళ్లేలా చేస్తాయి. దీంతో 5 శాతం కరెంటు మాత్రమే ఖర్చవుతుంది. లిఫ్ట్ టవర్ పైభాగంలో ప్రత్యేకంగా స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) సెంటర్ ఏర్పాటు చేశారు. వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. అక్కడి భారీ కంప్యూటర్లో లోపాలను చూపుతుంది. రైల్వేలో సీనియర్ ఇంజనీర్, విజయనగరం జిల్లాకు చెందిన నడుకూరు వెంకట చక్రధర్ ఈ వంతెన నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం దాని ఇన్చార్జిగా ఉన్నారు. 1964 డిసెంబర్ 22న పెను తుఫాను కారణంగా 25 అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డ అలలు, బలమైన గాలులతో పంబన్ వంతెన ధ్వంసమైంది. రాత్రి 11.50 సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న 653 నంబర్ రైలు కొట్టుకుపోయి అందులోని 190 మంది ప్రయాణికులు మృతి చెందారు. కానీ, వంతెనలోని షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ భాగం మాత్రం కొట్టుకుపోకుండా నిలిచింది. మెట్రో మ్యాన్‌గా పిలుచుకుంటున్న ఈ. శ్రీధరన్ ఆధ్వర్యంలో 46 రోజుల్లోనే వంతెనను పునరుద్ధరించారు.Delighted to be in Rameswaram on the very special day of Ram Navami. Speaking at the launch of development works aimed at strengthening connectivity and improving 'Ease of Living' for the people of Tamil Nadu. https://t.co/pWgStNEhYD— Narendra Modi (@narendramodi) April 6, 2025 -
Tamil Nadu: బీజేపీ బలోపేతానికి ‘పంబన్’ వారధి?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తమిళనాడు ప్రజలకు పంబన్ బ్రిడ్జి(Pamban Bridge) రూపంలో భారీ కానుకను అందించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ ఈ అద్భుత వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ దక్షిణ భారతదేశంలో తన పట్టును బలోపేతం చేసుకునేందుకే ఈ వంతెనను వ్యూహాత్మకంగా ప్రారంభిస్తున్నదనే వాదన వినిపిస్తోంది. 2.08 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన పంబన్ వంతెన రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది.పంబన్ బ్రిడ్జి భారతదేశంలోని మొట్టమొదటి సముద్రపు వంతెన. ఓడల రాకపోకలకు అనుగుణంగా ఈ బ్రిడ్జి గేట్లు తెరుచుకుంటాయి. నూతనంగా నిర్మించిన ఈ వంతెన మరింత ధృడంగా ఉండనుంది. ఇది తమిళనాడు(Tamil Nadu) ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేయనుంది. అలాగే పర్యాటకరంగానికి ప్రోత్సాహాన్ని అందించనుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రామేశ్వరంనకు రాకపోకలు సాగించేందుకు ఈ వంతన ఉపయోగపడనుంది. శ్రీరాముని జన్మదినోత్సవమైన రామ నవమిని దక్షిణ భారతదేశంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రామేశ్వరంనకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు.రామాయణంలోని వివరాల ప్రకారం శ్రీరాముడు లంకను చేరుకునేందుకు ఇక్కడ స్వయంగా వారధి నిర్మించారని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కాగా తమిళనాడు ప్రజలలో తన హిందూత్వ ఎజెండాను బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు బీజేపీ పంబన్ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించి, జాతికి అంకితం చేస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. 2026లో తమిళనాడులో ఎన్నికల జరగనున్న దృష్ట్యా బీజేపీ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. 234 మంది సభ్యులు కలిగిన తమిళనాడు శాసనసభకు జరిగే ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.తమిళనాడు రాజకీయాలలో(Tamil Nadu politics) డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యం కొనసాగుతోంది. ఉత్తర భారతదేశంలో బలమైన పట్టు ఉన్న బీజేపీ, దక్షిణాదిలో ఇంకా గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోతోంది. అయితే పంబన్ బ్రిడ్జి వంటి పెద్ద ప్రాజెక్టులను చేపట్టి, తద్వారా తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని బీజేపీ తమిళనాడు ప్రజలకు తెలియజెప్పాలనుకుంటోంది. తమిళనాడులో రెండవ అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఆ కూటమి ఎన్నికల్లో విఫలం కావడంతో, బీజేపీకి ఏఐడిఎంకే దూరమయ్యింది. ఇప్పుడు 2026 ఎన్నికలకు ముందు బీజేపీ మరోసారి అన్నాడీఎంకేతో చేతులు కలపడానికి ప్రయత్నిస్తోందని భోగట్టా. అయితే బీజేపీ వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో కాలమే చెబుతుంది. ఇది కూడా చదవండి: చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్ -
పంబన్ 2.0
పంబన్ (రామేశ్వరం) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభానికి సిద్ధమైంది. సముద్రంలో నిర్మించిన తొలి వ ర్టీకల్ లిఫ్ట్(Vertical Lift) (నిలువునా పైకి లేచే) వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు, 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవటంతో దాని పక్కనే ఈ కొత్త వంతెనను నిర్మించారు. త్వరలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దీనిని జాతికి అంకితం చేయనున్నారు. వంతెనపై ట్రయల్స్‌ను శనివారం విజయవంతంగా చేశారు.దూర ప్రయాణాన్ని తగ్గించేందుకు.. 1914లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తమిళనాడులోని మండపం (సముద్రం ప్రారంభమయ్యే ప్రాంతం) నుంచి పంబన్ (రామేశ్వరం దీవి ప్రారంభ చోటు) వరకు రైలు వంతెనను నిర్మించింది. ఆ సమయంలోనే వంతెన మధ్యలో పడవలకు దారిచ్చేందుకు రోలింగ్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో వంతెన స్పాన్లు విడిపోయి ఉంటాయి. సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్రంలో ఇనుప కమ్మీలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్డు లెవల్ క్రాసింగ్ రైలు గేటు తరహాలు పైకి లేస్తాయి.దీంతో పడవలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత మళ్లీ మూసి విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు. సముద్రపు నీటి ప్రభావంతో ఈ వంతెన తుప్పుపట్టి బలహీనపడింది. దీంతో రోలింగ్ లిఫ్ట్‌కు బదులుగా వ ర్టీకల్ లిఫ్ట్‌తో కొత్త వంతెనను నిర్మించారు. వంతెన మధ్యలో ఈ లిఫ్ట్ లేకపోతే నౌకలు రామేశ్వరం దాటిన తర్వాత ఉన్న మనదేశ చిట్టచివరి భూభాగం ధనుషో్కడి ఆవలి నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. దీనివల్ల 150 కి.మీ. అదనపు దూరాభారం అవుతుంది. వంతెన ప్రత్యేకతలు..⇒ వంతెన నిర్మాణ వ్యయం రూ.540 కోట్లు. పొడవు 2.10 కి.మీ. ⇒ పిల్లర్లతో కూడిన పైల్స్ సంఖ్య 333 ⇒ సముద్రగర్భంలో సగటున 38 మీటర్ల లోతు వరకు పిల్లర్లు. వీటికోసం వాడిన స్టెయిన్లెస్ స్టీలు 5,772 మెట్రిక్ టన్నులు (రీయిన్‌ఫోర్స్‌మెంట్), స్ట్రక్చరల్ స్టీల్ 4,500 మెట్రిక్ టన్నులు. ⇒ సిమెంటు వినియోగం 3.38 లక్షల బస్తాలు. 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ⇒పైకి లేచే భాగం బరువు 660 మెట్రిక్ టన్నులు. ⇒ స్పెయిన్ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు. ఆ దేశానికి చెందిన టిప్స సంస్థను కన్సల్టెన్సీగా నియమించుకుని వంతెనను డిజైన్ చేయించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ⇒ ప్రపంచంలో సముద్రపు నీరు, ఉప్పు గాలి ప్రభావంతో ఇనుము అతి వేగంగా తుప్పుపట్టే ప్రాంతం మియామీ. ఆ తర్వాత పంబన్ ప్రాంతమే. దీంతో కొత్త వంతెన తుప్పు బారిన పడకుండా జింక్, 200 మైక్రాన్ల ఆప్రోక్సీ సీలెంట్, 125 మైక్రాన్ల పాలీ సిలోక్సేన్‌తో కూడిన రంగు డబుల్ కోట్ వేశారు. కనీసం 35 సంవత్సరాల పాటు ఈ పొర తుప్పును అడ్డుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ పూస్తే మరికొంతకాలం తప్పు పట్టదు. ⇒ పాత వంతెనలో 16 మంది సిబ్బంది 45 నిమిషాల పాటు చట్రం తిప్పితే రెండు భాగాలు రెక్కాల్లా పైకి లేచేవి. కొత్త వంతెనలో కేవలం 5.20 నిమిషాల్లో 660 టన్నుల బరువున్న 72 మీటర్ల భాగం 17 మీటర్ల ఎత్తుకు లేస్తుంది. ⇒ ఈ వంతెనపై రైళ్లను గంటకు 80 కి.మీ. వేగంతో నడిపే వీలుంది. కానీ, రైల్వే సేఫ్టీ కమిషనర్ 74 కి.మీ. వేగానికి అనుమతించారు. పాత వంతెనపై గరిష్ట వేగం గంటకు 10 కి.మీ. మాత్రమే. ⇒ నిర్మాణ పనులు 2019లో మొదలయ్యాయి. కొవిడ్ వల్ల కొంతకాలం ఆలస్యమైనా, మొత్తంగా 2 సంవత్సరాల్లోనే పూర్తిచేశారు. ⇒ 2022 డిసెంబర్లో పాత వంతెనపై రైళ్ల రాకపోకలు నిలిపేశారు. అప్పట్లో రోజుకు 18 ట్రిప్పుల రైళ్లు తిరిగేవి. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ⇒ లిఫ్టు టవర్లకు 310 టన్నుల బరువు తూగే భారీ స్టీల్ దిమ్మెలు రెండు వైపులా కౌంటర్ వెయిట్స్‌గా ఏర్పాటు చేశారు. కరెంటు శక్తితో వంతెన భాగం పైకి లేవటం మొదలుకాగానే కౌంటర్ వెయిట్స్ మరోవైపు దిగువకు జారటం ద్వారా వంతెన భాగం పైకి వెళ్లేలా చేస్తాయి. దీంతో 5 శాతం కరెంటు మాత్రమే ఖర్చవుతుంది. ⇒ లిఫ్ట్ టవర్ పైభాగంలో ప్రత్యేకంగా స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) సెంటర్ ఏర్పాటు చేశారు. వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. అక్కడి భారీ కంప్యూటర్లో లోపాలను చూపుతుంది. ⇒ రైల్వేలో సీనియర్ ఇంజనీర్, విజయనగరం జిల్లాకు చెందిన నడుకూరు వెంకట చక్రధర్ ఈ వంతెన నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం దాని ఇన్చార్జిగా ఉన్నారు. ⇒ 1964 డిసెంబర్ 22న పెను తుఫాను కారణంగా 25 అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డ అలలు, బలమైన గాలులతో పంబన్ వంతెన ధ్వంసమైంది. రాత్రి 11.50 సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న 653 నంబర్ రైలు కొట్టుకుపోయి అందులోని 190 మంది ప్రయాణికులు మృతి చెందారు. కానీ, వంతెనలోని షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ భాగం మాత్రం కొట్టుకుపోకుండా నిలిచింది. మెట్రో మ్యాన్‌గా పిలుచుకుంటున్న ఈ. శ్రీధరన్ ఆధ్వర్యంలో 46 రోజుల్లోనే వంతెనను పునరుద్ధరించారు. -
ఇంజనీరింగ్ అద్భుతంగా పంబన్ కొత్త బ్రిడ్జి.. ఫోటోలు వైరల్
తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మిస్తున్న కొత్త పంబన్ వంతెన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రూపొందుతున్న ఈ వంతెన ఫోటోలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేయడమే ఇందుకు కారణం. కొత్త వంతెనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎక్స్‌లో షేర్ చేస్తూ.. దానికి సంబంధించిన విషయాలు, విశేషాలను ఆయన పంచుకున్నారు.ఈ బ్రిడ్జి ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతమని కేంద్రమంత్రి కొనియాడారు. ఈ ప్రాజెక్టు వేగం, భద్రత కోసం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యిందని, అనేక సార్లు పరీక్షించినట్లు వెల్లడించారు. అయితే కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CRS) ద్వారా భద్రతా తనిఖీలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు.కొత్త బ్రిడ్జి ద్వారా రామేశ్వరం అభివృద్ధి చెందుతున్నారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం ద్వారా రూ. 90 కోట్ల వ్యయంతో రామేశ్వరం రైల్వే స్టేషన్‌ను కూడా అప్గ్రేట్ చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ద్వీపానికి పర్యాటకం, వాణాజ్యం, కనెక్టివిటీ మెరుగవుతుందని తెలిపారు. అలాగే రెండు వంతెనల మధ్య ఉన్న తేడాలను వివరించారు.పాత వంతెన మధ్య నుంచి పడవలు షిప్‌లు వెళ్లాలంటే కష్టమయ్యేది.16 మంది కార్మికులు పని చేస్తేనే బ్రిడ్జి తెరుచుకుంటుంది.సముద్ర మట్టానికి 19 మీటర్లు ఎత్తు ఉండే బోట్లు మాత్రమే వంతెన మధ్య ప్రయాణించేవిసింగిల్ ట్రాక్ మాత్రమే ఉండేది.కొత్త బ్రిడ్జి వర్టికల్ లిఫ్ట్ స్పాన్.. పూర్తిగా ఆటోమేటెడ్.ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా డిజైన్సముద్ర మట్టానికి 22 మీటర్లు ఎత్తు ఉండే బోట్లు, షిప్‌లు కూడా ప్రయాణించగలవు.డబుల్ ట్రాక్‌లు, విద్యుదీకరణ కోసం రూపొందించారు.హై-స్పీడ్ రైలు అనుకూలత, ఆధునిక డిజైన్.వందే ళ్లపాటు సేవలుకాగా రామేశ్వరంలోని పంబన్ ద్వీపంలో నిర్మించిన పంబన్ వంతెన గురించి అందరికీ తెలిసిందే. దీనిని 1914 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. అప్పట్లో రూ.20 లక్షలతో నిర్మాణం పూర్తయింది. ఈ వంతెన న 105 ఏళ్ల పాటు రామేశ్వరం నగరాన్ని ఇతర ప్రధాన భూభాగంతో కలిపింది.ఇది దేశంలోనే తొలి సముద్ర వంతెన. అంతేగాక 2010లో బాంద్రా- వర్లీ సముద్రపు లింక్‌ను ప్రారంభించే వరకు దేశంలోనే అతి పొడవైన వంతెన కూడా. 2. 06 కి.మీ. పొడవైన వంతెనను 2006-07లో మీటర్‌గేజ్ నుంచి బ్రాడ్‌గేజ్‌కి మార్చారు. 2022లో ఈ వంతెనకు తుప్పు పట్టడంతో దీనిని పూర్తిగా మూసేశారు.దీని స్థానంలో 2019లో కొత్త వంతెన నిర్మాన్ని ప్రారంభించారు. మార్చి 2019లో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. ఇది 105 ఏళ్ల నాటి పాంత వంతెనను భర్తీ చేయనుంది.🚆The New Pamban Bridge: A modern engineering marvel!🧵Know the details 👇🏻 pic.twitter.com/SQ5jCaMisO— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 29, 2024 -
105 ఏళ్ల పాంబన్ బ్రిడ్జిని పరిశీలించిన ఐఐటీ బృందం
చెన్నై: 105 ఏళ్ల నాటి పాంబన్ రైల్వే బ్రిడ్జి స్థిరత్వాన్ని పరిశీలించేందుకు చెన్నై ఐఐటీ బృందం అక్కడికి చేరుకుంది. ఇందుకోసం వంతెనపై 100 చోట్ల సెన్సర్ పరికరాలను అమర్చే పనులలో నిమగ్నమయ్యారు. రామనాథపురం జిల్లాతో రామేశ్వరం దీవిని అనుసంధానించేందుకు సముద్రంలో ఏర్పాటైన పాంబన్ రైల్వే బ్రిడ్జ్ ముఖ్యపాత్ర వహిస్తోంది. 105 ఏళ్లు దాటినా రైల్వే బ్రిడ్జ్‌పై రైళ్ల రాకపోకలు ఇంకా సాగుతున్నాయి. రైల్వే వంతెన మధ్యభాగంలో ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్‌ని రైల్వే శాఖ ద్వారా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ఉండగా పాంబన్ సముద్రంలో కొత్త రైల్వే వంతెన నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపి రూ.250 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో గత ఫిబ్రవరి నెల పాంబన్ కొత్త రైల్వే బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయి. చదవండి: పోలీస్ కమిషనర్ మానవీయత ఈలోపున కరోనా వైరస్ వ్యాపించడంతో దీని నియంత్రణకు అమలు చేసిన లాక్డౌన్ కారణంగా పనులను నిలిపి వేశారు. ఈ స్థితిలో పాంబన్ సముద్రంలోని రైల్వే వంతెన మధ్యభాగంలో ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ స్థిరత్వాన్ని గుర్తించేందుకు వీలుగా రైళ్లు వెళ్లే సమయంలో ఏర్పడే ప్రకంపనల ప్రభావం, ఉప్పు గాలులతో ఇనుప రాడ్లు, స్థంభాలలో ఏదైనా లోపాలు ఏర్పడ్డాయా అనే విషయంపై పరిశీలన జరిపేందుకు గత మూడు రోజులుగా చెన్నై ఐఐటీ బృందం ఈ వంతెనపై సెన్సర్ పరికరాలను అమర్చే పనులలో నిమగ్నమైంది. దీని గురించి ఐఐటీ ప్రతినిధి మాట్లాడుతూ.. పాంబన్ రైల్వేబ్రిడ్జ్ స్థిరత్వాన్ని గుర్తించేందుకు ఈ సెన్సర్ పరికరాలను బ్రిడ్జ్‌పై 100 చోట్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులలో గత మూడు రోజులుగా 10మందితో ఈ పనులు చేపడుతున్నామని, ఈ పనులన్నీ పూర్తయ్యేందుకు నెల రోజులు పడుతుందని తెలిపారు. చదవండి: ప్రముఖ ఛాయాగ్రాహకుడు బి. కణ్ణన్ కన్నుమూత -
‘పాంబన్’ వంతెనకు వందేళ్లు