
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సన్నద్ధమవు తున్న ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. కొంతకాలంగా దేశంలో ని వివిధ రాజకీయ పక్షాలు, సంఘాలు, వివి ధ రంగాలకు చెందిన నిపుణులతో విస్తృత మంతనాలు జరుపుతున్నారు. అందులో భాగంగానే రెండురోజుల క్రితం బిహార్ పర్యటనకు వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌తో జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రధాని మోదీ పాలన వైఫల్యాలపై లోతుగా చర్చించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యక తపైనా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల ఐక్యతను చాటేందుకు జాతీయ స్థాయిలో బీజేపీయేతర ముఖ్యమంత్రులు, ముఖ్యనేతల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ లేదా హైదరాబాద్ వేదిక గా ఈ సదస్సు జరిపేందుకు సిద్ధంగా ఉన్న ట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు నితీశ్, తేజస్వీ అంగీకరించడంతో పాటు విపక్ష పార్టీల నడుమ ఏకాభి ప్రాయ సాధనకు ఈ తరహా సదస్సులు ఉపయోగపడతాయనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపుల తర్వాత సదస్సు తేదీ ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమల వుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అవి సాధించిన ఫలితాలను వివరించిన కేసీఆర్.. వాటి అధ్యయానికి రాష్ట్రానికి రావాల్సిందిగా నితీష్‌ను ఆహ్వానించారు.
కేసీఆర్ సుదీర్ఘ వివరణ.. ముగించేందుకు నితీశ్ యత్నం!
మధ్యాహ్న భోజనం తర్వాత సీఎం కేసీఆర్, బిహార్ సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సంయు క్తంగా మీడియా భేటీలో మాట్లాడారు. కేసీఆర్ సుమారు అరగంట సేపు జాతీయ రాజకీయాలపై మాట్లాడటంతో పాటు బీజేపీ, మోదీ అను సరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చివరలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ప్రెస్‌మీట్ ముగించేందుకు నితీశ్ పలుమార్లు లేచి నిలబడగా.. కేసీఆర్ ఆయన చేయి పట్టుకుని ఆçపడం కన్పించింది.
Comments
Please login to add a commentAdd a comment