కాన్బెర్రా: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికా అధ్యక్షపీఠం అధిరోహించిన ఐదుగురు అధ్యక్షుల పాలనాకాలంలో భారత్.. అమెరికాతో సంబంధాల విషయంలో స్థిరమైన పురోగతిని చూసిందని అన్నారు.
ప్రస్తుత అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ యుఎస్‌ఏతో భారత్ సంబంధాలు బలంగా ఉంటాయని జైశంకర్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో భారత విదేశాంగ మంత్రి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీవాంగ్‌లో సంయుక్త విలేకరుల సమావేశంలో జైశంకర్ ఒక ప్రశ్నకు ప్రతిస్పందనగా యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్‌తో సహా క్వాడ్ దేశాలతో భారత్ సంబంధాలు బలంగా ఉంటాయన్నారు.
రిపబ్లికన్ నేత, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలవడంపై ఏమైనా ఆందోళన ఉందా? దీనికారణంగా క్వాడ్‌పై ఏ మేరకు ప్రభావం ఉండబోతుందని విలేకరులు అడగగా జైశంకర్ సమాధానమిస్తూ గత ఐదుగురు అధ్యక్షుల పదవీకాలంలో యూఎస్‌తో భారత్ సంబంధాలలో స్థిరమైన పురోగతిని చూశాం. దీనిలో డోనల్ట్ ట్రంప్ అధ్యక్షుని పదవీకాలం కూడా ఉన్నదన్నారు. అందుకే అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా భారత్‌తో సంబంధాలు బలంగా ఉంటాయని నమ్ముతున్నామన్నారు.
ఇక క్వాడ్ విషయానికొస్తే 2017లో ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు క్వాడ్ పునరుద్ధరణ జరిగిందన్నారు. అప్పుడు అది శాశ్వత కార్యదర్శి స్థాయి నుండి మంత్రి స్థాయికి బదిలీ అయ్యిందన్నారు. యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలు 2017లో ఇండో-పసిఫిక్ భూ భాగంలో చైనా దూకుడును ఎదుర్కొనేందుకు ప్రణాళికను రూపొందించాయన్నారు.
ఇది కూడా చదవండి: డెమోక్రాట్లలో నిరాశ.. కమల ప్రసంగం రద్దు..!
Comments
Please login to add a commentAdd a comment