గాంధీనగర్: లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్నికల బాండ్లపై నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల బాండ్లపై మాట్లాడారు. ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌టార్షన్(అక్రమ వసూళ్లు) స్కీమ్‌గా అభివర్ణించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి షా గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఎన్నికల బాండ్ల స్కీమ్ అతిపెద్ద ఎక్స్‌టార్షన్ స్కీమ్ అయితే కాంగ్రెస్‌కూడా ఈ స్కీమ్ కింద అక్రమ వసూళ్లకు పాల్పడిందని షా ఆరోపించారు. తాము కూడా ఈ స్కీమ్ కింద వసూళ్లు చేశామని రాహుల్ ప్రజలకు చెప్పాలి. ఎంపీల సంఖ్య ప్రకారం చూస్తే ప్రతిపక్షాలే అత్యధికంగా ఎన్నికల బాండ్ల స్కీమ్‌లో లాభపడ్డాయన్నారు.
ప్రతిపక్షాలకు తమను విమర్శించడానికి ఏమీ లేదని, ఇందుకే ప్రజలను కావాలని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. కాగా, ఎన్నికల బాండ్ల స్కీమ్ కింద బీజేపీ అక్రమ వసూళ్లకు పాల్పడిందని, ప్రధాని మోదీ అవినీతి ఛాంపియన్ అని ఇటీవల రాహుల్‌గాంధీ విమర్శించారు.
ఇదీ చదవండి.. నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో జీరో పోలింగ్
Comments
Please login to add a commentAdd a comment