వాషింగ్టన్: అక్రమ వలస దారుల విషయంలో అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ సమర్థించారు. అమెరికాలో ఉన్న అక్రమ భారతీయ వలస దారుల్ని చట్టబద్ధంగా తిరిగి పంపిస్తే అందుకు స్వాగతిస్తామని స్పష్టం చేశారు.
అమెరికా పర్యటనలో ఉన్న జై శంకర్ స్థానిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్ట విరుద్ధంగా, ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం, అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డ అక్రమ వలసదారుల్ని తిరిగి భారత్‌కు తీసుకువెళ్లేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’ అని అన్నారు. పత్రాలు లేని వలసదారుల (Undocumented immigrants)ల విషయంలో భారత్ వైఖరి స్థిరంగా ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు తెలిపారు.
భారత్ అక్రమ వలసలను గట్టిగా వ్యతిరేకిస్తోందని, ఇది మంచిది కాదని, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయ ప్రతిభ, భారతీయ నైపుణ్యాలు ప్రపంచ స్థాయిలో ఉపయోగపడడంతో పాటు అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టే అక్రమ వలస దారుల విషయంలో మా వైఖరి స్పష్టం ఉందని చెప్పారు.
#FPLIVE: External Affairs Minister (EAM) S. Jaishankar, has clarified India's stance, saying that New Delhi is open to the "legitimate return" of Indian nationals living 'illegally' abroad, including in the US. https://t.co/JWyTTCKgXV
— Firstpost (@firstpost) January 23, 2025
కాగా, అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరుఫున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే సమయంలో ట్రంప్‌నకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆ లేఖను జై శంకర్‌ను ట్రంప్‌కు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment