ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రానున్న ఐదేళ్లు చాలా క్లిష్టమైనది అంటూ కామెంట్స్ చేశారు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్. అన్నారు. ప్రస్తుతం భారత్ ఇబ్బందికర(కఠిన) పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ఇదే సమయంలో అమెరికా ఎన్నికలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కాగా, జైశంకర్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్ల కాలం భారత్‌కు ఎంతో క్లిషమైనది. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది?. ఆగ్నేయాసియా.. తూర్పు ఆసియా.. ఇలా వివిధ ప్రాంతాల్లో ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం. యుద్ధాల కారణంగా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. అది భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం ఎన్నో దేశాలు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. ఒక దేశం వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటే.. మరోకరు విదేశీ మారకపు కొరతను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రకాల ఆటుపోట్లు ఉన్నాయి. మరోవైపు.. కోవిడ్ సమస్య కూడా ఇంకా తీరలేదు. పలు దేశాలపై కోవిడ్ ప్రభావం ఇంకా ఉంది. ఇక, వాతావరణ మార్పులపై కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సిన సమయం వచ్చింది. ప్రకృతి విపత్తుల కారణంగా ఎన్నో దారుణ పరిస్థితులు జరుగుతున్నాయన్నారు. ఇక, ఏది ఏమైనప్పటికీ తాను మాత్రం ఆవకాశవాదిని అని చెప్పుకొచ్చారు. సమస్యలకు పరిష్కారాల గురించే ఆలోచిస్తానన్నారు.
మరోవైపు.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపైన కూడా జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల ఎన్నికలపై మనం స్పందించకూడదు. ఎందుకంటే ఇతరులు కూడా మన అంతర్గత అంశాల్లో మాట్లాడకూడదు. అందుకే ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోలేను. కానీ, గత 20 సంవత్సరాలను పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నప్పటికీ భారత్ కలిసి ముందుకు సాగిందన్నారు. అందుకే ఈసారి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా... భారత్ వారితో కలిసి పని చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment