న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
తాజాగా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా బారిన పడినట్లు జైశంకర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కోవిడ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు’. అదే విధంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
External Affairs Minister Dr S Jaishankar tested #COVID19 positive. pic.twitter.com/H3pYqDECBV
— ANI (@ANI) January 27, 2022
చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే
Comments
Please login to add a commentAdd a comment