externel minister
-
సేనల ఉపసంహరణ స్వాగతించదగింది
బ్రిస్బేన్: భారత్, చైనాలు సరిహద్దుల్లో అత్యంత సమీపంలో మోహరించిన బలగాల ఉప సంహరణపై కొంత పురోగతి సాధించడం స్వాగతించదగిందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. అనంతర చర్యలకు ఈ పరిణామం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాలైన డెమ్చోక్, డెప్సాంగ్ల నుంచి రెండు దేశాలు ఇటీవల బలగాలను ఉపసంహరణను పూర్తి చేసుకోవడం, అనంతరం భారత్ ఆర్మీ పరిశీలనాత్మక గస్తీ జరుపుతున్న క్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంత్రి జైశంకర్ ఆదివారం జరిగిన కార్యక్రమంలో భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘వాస్తవా«దీన రేఖ వెంబడి 2020కు ముందు లేని ప్రాంతాల్లో చైనా బలగాలు ముందుకు చొచ్చుకువచ్చాయి. దీంతో మేం కూడా బలగాలను మోహరించాం. కొన్ని ఇతర కారణాలు కూడా ఇందుకు తోడయ్యాయి. దాదాపు నాలుగేళ్లపాటు బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉన్నాయి. ఏదైనా అనూహ్య సంఘటన జరిగే అవకాశమున్న పరిస్థితి అది. తాజాగా భారత్, చైనాలు కొంత పురోగతి సాధించాయి. సేనలను వెనక్కి తీసుకున్నాయి. ఇది స్వాగతించదగిన పరిణామం. ఇది ఇతర సానుకూల చర్యలకు దారి తీసే అవకాశముంది’అని ఆయన అన్నారు. ఉక్రెయిన్, పశి్చమాసియాల్లో కొనసాగుతున్న సంక్షోభాలు ప్రపంచంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయంటూ ఆయన..ఈ సమస్యల పరిష్కారానికి భారత్ తన వంతు కృషి కొనసాగిస్తోందని వెల్లడించారు. -
‘ముంబై’ దాడులపై నాడు స్పందనే లేదు!
ముంబై: 2008లో ముంబైలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై విదేశాంగ మంత్రి జై శంకర్ పరోక్ష విమర్శలు చేశారు. ఆ దాడికి భారత్ వైపు నుంచి స్పందనే లేకపోయిందంటూ ఆక్షేపించారు. ముంబైలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ముంబై దాడి జరిగినప్పుడు భారత్ నుంచి దానిపై స్పందనే లేదు. ఆ సమయంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ సభ్య దేశం. ఉగ్రవాద వ్యతిరేక కమిటీ అధ్యక్ష స్థానంలో ఉంది. ఆ కమిటీ బేటీ కూడా ఉగ్ర దాడికి లక్ష్యంగా మారిన ముంబై తాజ్ హోటల్లోనే జరిగింది’’ అని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు పరిస్థితి మారింది. నేడున్నది నాటి భారత్ కాదు. ఉగ్ర ఘటనలపై గట్టిగా స్పందిస్తున్నాం. దుస్సాహసం చేస్తే మన సమాధానమే వేరుగా ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. మనతో పగలు వ్యాపారం చేస్తాం, రాత్రిళ్లు మనపైనే ఉగ్ర దాడులు చేస్తామంటే కుదరదన్నారు. తూర్పు లద్దాఖ్‌లో 2020 నాటి పరిస్థితి నెలకొనాలంటే చైనా సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని జైశంకర్ అన్నారు. -
కరోనా బారిన పడ్డ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా బారిన పడినట్లు జైశంకర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కోవిడ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు’. అదే విధంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. External Affairs Minister Dr S Jaishankar tested #COVID19 positive. pic.twitter.com/H3pYqDECBV — ANI (@ANI) January 27, 2022 చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
గల్ఫ్ కార్మికులకు అన్యాయం... పత్తాలేని కొత్త సర్క్యులర్
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల గల్ఫ్ కార్మికుల కష్టాలు ఇంకా తీరలేదు. వేతనాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన తాజా సర్క్యులర్‌ను క్షేత్రస్థాయికి చేరలేదు. దీంతో వలస జీవులు ఇంకా శ్రమ దోపిడికి గురవుతూనే ఉన్నారు. వేతనాలు తగ్గిస్తూ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలను (మినిమం రెఫరల్ వేజెస్) ను 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ లో రెండు సర్క్యులర్లను జారీ చేసింది. అయితే ఈ రెండు సర్క్యులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కార్మికులు, గల్ఫ్ సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పాత జీతమే ఇవ్వాలంటూ.. నలువైపుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, కోర్టు కేసుల నేపథ్యంలో పాత వేతనాల కొనసాగింపు డిమాండును కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు జులై 22, 29 తేదీలలో రాజ్య సభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ప్రకటించారు. కనీస వేతనాలను తగ్గిస్తూ సెప్టెంబర్ లో జారీ చేసిన సర్క్యులర్లను ఉపసంహరించుకుంటున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు పాత వేతనాలను కొనసాగించాలని నిర్ణయిస్తూ... జులై 15న ఉత్తర్వులను జారీ చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జులై 28న తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. సమస్య పరిష్కారం అయినందున మంద భీంరెడ్డి వేసిన 'పిల్' ను ముగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జరగని న్యాయం పాత వేతనాలే కొనసాగించాలంటూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ కనీసం ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్లో కూడా కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు లిఖిత పూర్వకంగా కనిపించకపోవడం కార్మికులకు శాపంగా మారగా కంపెనీలకు వరమైంది. గతంలో వేతనాలు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌నే చూపెడుడుతూ తక్కువ జీతం చెల్లిస్తూ శ్రమ దోపిడి చేస్తున్నాయి. ఎంబసీకి విజ్ఞప్తి పాత వేతనాలను కొనసాగించే ఆ సర్క్యులర్ని ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్ లలో అందుబాటులో ఉంచలేదని, వెంటనే ఈ సర్క్యులర్ ప్రజలు అందుబాటులో ఉంచాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ అధ్యక్షులు మంద భీంరెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి ఇ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. -
చైనాతో బంధంపై ‘సరిహద్దు’ ప్రభావం
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, ఈ పరిస్థితులు రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. తను రాసిన ‘ది ఇండియా వే’పై జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. భారత్–చైనా సరిహద్దు సమస్య చాలా కష్టమైందీ, క్లిష్టమైంది అంటూ ఆయన.. గత మూడు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలను చారిత్రక కోణంలో ఆవిష్కరించారు. వాణిజ్యం, పర్యాటకం, ఇతర కార్యక్రమాల ద్వారా 1980ల నుంచి ఈ సంబంధాలు క్రమంగా మెరుగుపడుతూ వచ్చాయన్నారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణానికి భంగం కలిగితే ఆ ప్రభావం రెండు దేశాల మధ్య సంబంధాలపైనా ఉంటుందని, ఏం జరుగనుందో చూడాలని అన్నారు. అంతర్జాతీయంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్న భారత్, చైనాలు..తమ మధ్య సమతౌల్యాన్ని ఎలా సాధిస్తాయనేదే పెద్దప్రశ్న అని వ్యాఖ్యానించారు. ఈ పుస్తకాన్ని ఏప్రిల్‌కు ముందే రాశాననీ, అప్పటికి తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు మొదలుకాలేదని ఆయన అన్నారు. -
చర్చలు ఇంకా ఖరారు కాలేదు
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలకు ఇంకా తేదీలు ఖరారు కాలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఈ విషయంలో పాకిస్థాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదని, ఆ దేశం తన అభిప్రాయం తెలిపాకే భారత్ నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల భారత్-పాక్ మధ్య పలు అంశాలకు సంబంధించి చర్చ జరగాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటంతోపాటు పాక్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలిసిందే. అయితే, ఇటీవల పాక్ ఉగ్రవాదులు బీఎస్ఎఫ్ బలగాలపై కాల్పులకు పాల్పడటంతోపాటు, సరిహద్దు వెంబడి చొరబాట్లు జరగడం, సైనిక స్థావరాలపై గ్రనేడ్లు విసరడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పలుమార్లు ఉల్లంఘించడంవంటి చర్యలకారణంగా ఈ చర్చలు విషయంలో కొంత ప్రతిష్ఠంభన నెలకొంది. పాక్ కూడా ఇలాంటి సంఘటనలను అధికారికంగా ఖండించకపోవడం కూడా చర్చలు జరిపే విషయంలో కొంత అనుమానం నెలకొంది. అయితే, చర్చలే అన్ని సమస్యలకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న నేపథ్యంలో పాక్ నుంచి అధికారిక ప్రకటనకోసం కేంద్రం ఎదురుచూస్తుంది.