![Minister Jai Shankar Interesting Comments On Donald Trump - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/25/jai%20shankar.jpg.webp?itok=3iv9ZSda)
న్యూఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో భారత్- అమెరికా సంబంధాలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న 2017-2021 మధ్య కాలంలో అమెరికాతో భారత్ మధ్య సంబంధాలు ఎప్పుడూ లేనంత బలోపేతమయ్యాయన్నారు. ఢిల్లీలో జరిగిన కాన్‌ఫ్లిక్ట్, కంటెస్ట్, కో ఆపరేట్, క్రియేట్ సదస్సలో జై శంకర్ ప్రసంగించారు.
2020లో ట్రంప్ భారత పర్యటనకు వచ్చారని, మోదీ కూడా పలుమార్లు అమెరికా వెళ్లారని జై శంకర్ గుర్తు చేశారు. ఒక్క ట్రంపే కాదని, బిల్ క్లింటన్ తర్వాత వచ్చిన ప్రతి అమెరికా అధ్యకక్షుని హయాంలో ఆ దేశంతో అమెరికా సంబంధాలు బలపడ్డాయని తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో జై శంకర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, ఇప్పటికే జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించే ప్రైమరీల్లో ట్రంప్ దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన సౌత్ కరోలినాలో తన ప్రత్యర్థి నిక్కీ హాలేపై ఘన విజయం సాధించారు. ట్రంప్ ఈసారి మళ్లీ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తోనే అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడనున్నారు. ఇప్పటికే వెల్లడిస్తున్న కొన్ని పోల్స్ ఫలితాల్లో ఈసారి బైడెన్ కంటే ట్రంప్‌నకే ఎక్కువ అవకాశాలున్నయని వెల్లడవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment