![Jaishankar Said Not Fooling Anybody US F16 Fighter Jets With Pakistan - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/26/external%20affairs.jpg.webp?itok=Hv-9SnPU)
వాషింగ్టన్: పాక్ అమెరికాల బంధం అంత తేలిగ్గా ముగిసిపోయేది కాదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చమత్కరించారు. పాక్‌కి అమెరికా సేవలందించడం లేదా అమెరికా తన ప్రయోజనాల కోసం పాక్ సేవలు అందించడం వంటి విడదీయరాని బంధం అని వ్యగ్యంగా అన్నారు. ఈ మేరకు జై శంకర్ వాషింగ్టన్‌లోని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్‌కి అమెరికా 450 మిలయన్ డాలర్ల వ్యయంతో ఎఫ్-16 ఫైటర్ జెట్ సస్టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాదు భారత్ ఆందోళనలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు తెలియజేశారు కూడా. ఐతే అమెరికా మాత్రం అది విక్రయమే తప్ప భద్రతా సాయం కాదని చెప్పుకొచ్చింది.
ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ..ఇలాంటి మాటలతో ఎవర్నీ మోసం చేయాలనుకుంటున్నారంటూ మండిపడ్డారు. అలాగే పాక్ ప్రభుత్వంతో ఈ ఎఫ్ 16 జెట్ విమానాల విక్రయాలతో అమెరికాకు ఒనగగురే ప్రయోజనం ఏమిటో తనకు తెలుసునని అన్నారు. అదీగాక ఎఫ్ 16 జెట్ విమానం ఎంత సామర్థ్యం గలవో వాటి ఉపయోగం ఏమిటో మనందరికి తెలుసునని నొక్కి చెప్పారు.
(చదవండి: విక్రయమే తప్ప సాయం కాదన్న అమెరికా... టెన్షన్‌లో అమెరికా)
Comments
Please login to add a commentAdd a comment