
వాషింగ్టన్: పాకిస్థాన్ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరులు ఎవరూ పాకిస్థాన్‌కు వెళ్లొద్దు అంటూ తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువ.. టెర్రరిస్టులు దాడులు జరిపే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
అమెరికా తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్‌లో దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకూ ఆ దేశానికి వెళ్లకుండా ఉండడమే మంచిదంటూ పౌరులకు తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇదే సమయంలో.. పాకిస్థాన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లకు మాత్రం అస్సలు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆయా ప్రావిన్స్‌లలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లేవారూ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
అలాగే.. మార్కెట్లు, రవాణా కేంద్రాలు తదితర ఏరియాలలో పౌరులను, పోలీసులను, సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు.. పాక్ నుంచి భారత్‌లో అడుగుపెట్టేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. ముందు వీసా తీసుకున్నాకే బార్డర్ వద్దకు వెళ్లాలని, వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది.
ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(trump) సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చే వారిపై నిషేధం విధించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. భద్రతా కారణాల రీత్యా.. పాక్ పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నట్టు సమాచారం. ఇక, డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
🇺🇸 The US warns against travel to Pakistan, citing terrorism risks. A "Do Not Travel" advisory applies to areas near the India-Pakistan border, the LoC, Balochistan, and Khyber Pakhtunkhwa due to threats of violence and armed conflict. pic.twitter.com/q2dLj1pkDa
— Eye On News (@EyeOnNews24) March 9, 2025
Comments
Please login to add a commentAdd a comment