travel advisory
-
భారత్‌లోని ఆ నగరాల్లో జాగ్రత్త: తమ పౌరులకు కెనడా అడ్వైజరీ
భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం చల్లారడం లేదు. ఖలిస్తానీ సానుభూతిపరుడు నిజ్జార్ సింగ్ హత్యతో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేడంతో మొదలైన ఇరు దేశాల మధ్య మొదలైన ఉద్రిక్తతలు.. నెల రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కెనడా పేర్కొంది. ఈ మేరకు కెనడా ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. భారత్‌లో 41 మంది దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుని, తమ దౌత్యకార్యాలయాలు, కాన్సులేట్లను మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించిన గంటల వ్యవదిలోనే.. కెనడా ఈ ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ‘భారత్, కెనడా మధ్య నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. మీడిమా, సామాజిక మాద్యమాల్లో మీడియాలో కెనడాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కెనడా వ్యతిరేక ఆందోళనలు, నిరసనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కెనడియన్లకు బెదిరింపులు అందవచ్చు. వేధింపులకు గురికావచ్చు. జాతీయ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో(ఎన్సీఆర్) జాగ్రత్తగా ఉండండి. అపరిచితులతో ఎక్కువగా మాట్లడకండి. కొత్త వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దు’ అని అడ్వైజరీలో పేర్కొంది. చదవండి: భారత్ నుంచి కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ బెంగళూరు, చండీగఢ్, ముంబై నగరాల్లోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పెద్ద నగరాల్లో, పర్యాటక ప్రాంతాల్లో విదేశీయులు లక్ష్యంగా చేసుకుని కొంత మంది డబ్బు, పర్స్ దొంగతనాలకు పాల్పడుతుంటారని.. రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా వ్యహరించాలని, పెద్ద సంఖ్యలో డబ్బులు తీసుకెళ్లవద్దంటూ పేర్కొంది. అదే విధంగా సిబ్బందిని తగ్గించిన నేపథ్యంలో ముంబయి, బెంగళూరులోని కాన్సులేట్లలో అన్ని రకాల ఇన్-పర్సన్ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ మూడు నగరాల్లోని తమ పౌరులను జాగ్రత్తగా ఉండాలని కోరింది. భారతదేశంలోని కెనడియన్లందరూ తమకు సహాయం కావాలంటే న్యూ ఢిల్లీలోని హైకమిషన్‌ను సంప్రదించవలసిందిగా కోరారు. -
భారత్, పాకిస్తాన్ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు
Level One COVID-19 notice for Americans travelling: యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) భారతదేశానికి వెళ్లే అమెరికన్ల కోసం 'లెవల్ వన్' కోవిడ్-19 నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ముఖ్యంగా పర్యటించేవాళ్లు వ్యాక్సిన్లు తీసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు పాకిస్థాన్ పర్యటనకు కూడా 'లెవల్ వన్' ట్రావెల్ హెల్త్ నోటీసులు జారీ చేసింది. (చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్ షేర్ చేయడంతో పరార్!!) అంతేకాదు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ భారత్, పాకిస్తాన్ల పర్యటన నిమిత్తం అమెరికన్లకు కొన్ని సూచనలను కూడా జారీ చేసింది. పైగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాదం, మతపరమైన హింస తదితర వాటిని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ పర్యటన ఎంతవరకు సుముఖం అనేదాని గురించి పునరాలోచించవలసిందిగా నొక్కి చెప్పింది. ఈ క్రమంలో భారత్‌కి పయనమయ్యేవారు కూడా అక్కడ జరిగే నేరాలు, ఉగ్రవాదం కారణంగా మరింత జాగ్రత్తగా ఉండమంటూ సూచించింది. అంతేకాదు తీవ్రవాదం, పౌర అశాంతి కారణంగా జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లవద్దని, అలాగే సాయుధ పోరాటానికి అవకాశం ఉన్నందున భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో కూడాప్రయాణించవద్దని యూఎస్ విదేశాంగ శాఖ అమెరికా పౌరులను కోరింది. ఈ మేరకు భారత్ అధికారులు భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటిని తెలియజేయడమే కాక లైంగిక వేధింపుల వంటి హింసాత్మక నేరాలు పర్యాటక ప్రదేశాలలో జరుగుతున్నాయని నివేదించినట్లు కూడా యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. (చదవండి: యూకే లివర్‌పూల్ నగరంలో కారు బ్లాస్ట్... ఒకరు మృతి) -
ఈ దేశాల ప్రయాణీకులపై నిషేధం..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్ పలు చర్యలు చేపడుతోంది. ఆప్ఘనిస్తాన్, ఫిలిప్పీన్స్, మలేషియాల నుంచి భారత్‌కు ప్రయాణీకుల రాకను మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి పూర్తిగా నిషేధించింది. ఈనెల 31 వరకూ ఇది అమల్లో ఉంటుందని, పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. కాగా ఐరోపా దేశాలు, టర్కీ, బ్రిటన్ ప్రయాణీకులపై కూడా భారత్ ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ విమానయాన సంస్థ ఈ దేశాలకు చెందిన ప్రయాణీకులను భారత్‌కు వెళ్లే తమ విమానాల్లోకి అనుమతించవు. మరోవైపు కరోనా కారణంగా దేశంలో ఇప్పటికే ఇద్దరు బాధితులు మృతి చెందగా.. తాజాగా మూడో మరణం నమోదవడం కలకలం రేపుతోంది. వైరస్ కారణంగా మహారాష్ట్ర ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి (64) మంగళవారం మరణించారు. చదవండి : కరోనా అలర్ట్ : మూడో మరణం నమోదు -
కరోనాపై భారత్ ఆంక్షలు ఇవే..
న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో కూడా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్‌లో కరోనా విస్తరించడకుండా చర్యలు చేపట్టడంతోపాటు.. పలు దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించేవారిపై అంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలపై కీలక సూచనలు చేసింది. (కామారెడ్డిలో కరోనా.. గాంధీకి తరలింపు ) మార్చి 3వ తేదీకి ముందు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్ దేశస్థులకు జారీచేసిన రెగ్యులర్, ఈ వీసాలపై తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అత్యవసర కారణాలతో భారత్ రావాలనుకునేవారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది. చైనా దేశీయులకు ఫిబ్రవరి 5కు ముందువరకు జారీచేసిన రెగ్యులర్, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేసిన కేంద్రం.. ఆ నిర్ణయం ఇంకా కొనసాగుతుందని వెల్లడించింది. అత్యవసర కారణాలతో భారత్ రావాలనుకునేవారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది. ఫిబ్రవరి 1 తర్వాత చైనా, ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు వెళ్లిన విదేశీయుల రెగ్యులర్, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ జాబితాలో ఎవరైనా అత్యవసర కారణాలతో భారత్ రావాలనుకునేవారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది. పైన పేర్కొన్న దేశాలకు చెందిన దౌత్యవేత్తలకు, ఐకరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులకు, ఓసీఐ కార్డుదాలకు, విమాన సిబ్బంది అంక్షల నుంచి మినహాయింపు కల్పించింది. అయితే వారికి ఎయిర్‌పోర్ట్‌లలో స్క్రీనింగ్ తప్పనిసరని పేర్కొంది. అంతర్జాతీయ విమనాల ద్వారా భారత్‌లోకి వచ్చే ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలో సరైన వివరాలతో కూడిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను సమర్పించడం తప్పనిసరి చేసింది. భారత్‌లో నివసించే అడ్రస్, ఫోన్ నెంబర్‌తో కూడిన సమచారాన్ని అందులో పొందుపరచాలి. అలాగే ట్రావెల్ హిస్టరీ వివరాలను ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమర్పించాలి. చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్, ఇటలీ, హాంకాంగ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, నేపాల్, థాయ్‌లాండ్, సింగపూర్, తైవాన్ నుంచి నేరుగా కానీ, ఇతర ప్రదేశాల్లో పర్యటించి గానీ ఇండియాలోకి వచ్చే ప్రయాణికులు(భారతీయులు, విదేశీయులు) ఎయిర్పోర్ట్ అడుగుపెట్టగానే స్క్రీనింగ్ చేయించుకోవాలని తెలిపింది. చైనా, ఇరాన్, కొరియా, ఇటలీల వెళ్లకుండా ఉండాలని భారతీయులకు సూచించింది. అలాగే కోవిడ్-19 ప్రభావిత ప్రాంతాలకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని తెలిపింది. -
పాక్ ప్రయాణాలు మానుకోండి: యూకే
లండన్: బ్రిటన్ గురువారం తమ పౌరులకు కీలక సూచనలు జరీ చేసింది. పాకిస్తాన్లో పర్యటించడం మానుకోమని ఫారెన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్(ఎప్‌సీవో), బ్రిటన్ సిటిజన్స్‌కు విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లేవారు.. ఎక్కువ ప్రాంతాలను సందర్శించకపోవడం మంచిదని పేర్కొంది. ముఖ్యంగా ఎల్వోసీ సమీప ప్రాంతాల్లో పర్యటించకూడదని తెలిపింది. పాకిస్తాన్లో రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు దూరంగా ఉండాలని సూచించింది. బెలూచిస్తాన్, సింధూ గ్రామీణ, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతాలతోపాటు ట్రైబల్ ఏరియాల్లో పర్యటన రద్దు చేసుకోమని సలహానిచ్చింది. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండటంతోపాటు.. ప్రమాదం జరిగే ప్రాంతాల్లో పర్యటించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కొన్ని ఫ్లైట్ రూట్లలో, విమానాశ్రయాలలో ఆంక్షలు ఉన్నందునా.. తాజా సమచారం కోసం సందర్శకులు తమ ఎయిర్‌లైన్స్‌ను సంప్రందించాలని తెలిపింది. -
‘జమ్మూ-కశ్మీర్‌కు ఎవరూ వెళ్లకండి’
వాషింగ్టన్: అమెరికా పౌరులెవరూ జమ్మూ-కశ్మీర్ పర్యటనకు వెళ్లవద్దని అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ స్థానిక ప్రజలకు పలు సూచనలు చేసింది. పుల్వామా ఉగ్రదాడి, బాల్కోట్లో ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దాడి అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్ద వాతావరణం అలుముకుందని వివరించింది. దీంతో ఈ ప్రభావం జమ్మూ-కశ్మీర్లో ఎక్కువగా ఉందని.. ఇప్పట్లో శాంతియుతమైన పరిస్థితులు వచ్చేలా కనిపించడంలేదని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఆఫీస్‌లను లక్ష్యంగా దాడులు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. అందుకే ఈ సమయంలో కశ్మీర్‌కు వెళ్లకపోవడమే మంచిదని పర్యాటకులకు ట్రావెల్ అడ్వైజరీ సూచించింది. ఇరు దేశాల మధ్య ఉన్న పరిస్థితుల దృష్ట్యా పాక్-భారత్ సరిహద్దుకు కనీసం పది కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోవాలని పేర్కొంది. జమ్మూ-కశ్మీర్‌లోనే ఎక్కువగా ఉగ్రదాడులు జరుగుతున్నాయని, అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా ఆందోళనలు చేస్తున్న కారణంగా తూర్పు లడఖ్, లేహ్ మినహా కశ్మీర్లో ఏ ప్రదేశానికి వెళ్లకూడదని అడ్వైజరీ సూచించింది. ఇక ఈ ఆదేశాలు కశ్మీర్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక పాకిస్తాన్లో అమెరికా లెవల్ 3 హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాక్‌కు వెళ్లకపోవడమే మంచిదని పర్యాటకులకు అమెరికా సూచించినట్లయింది. -
‘అమెరికన్లు మీరిక జాగ్రత్త.. ముఖ్యంగా పాక్‌తో..’
-
‘అమెరికన్లు మీరిక జాగ్రత్త.. ముఖ్యంగా పాక్‌తో..’
వాషింగ్టన్: తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు చేసింది. తమ పౌరులెవ్వరూ ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దని, అక్కడ తిరుగుబాటు చేసే సాంఘిక వ్యతిరేక శక్తులు ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపింది. అలాగే, ఆ దేశాలకు చెందిన ఉగ్రవాదులు భారత్‌లో కూడా యాక్టివ్‌గా ఉన్నారంటూ తెలియజేసింది. గతంలో ఏడు ముస్లిం దేశాలు, ఇప్పుడు ఆరు ముస్లిం దేశాలపై అమెరికా నిషేధం విధించిన నేపథ్యంలో అమెరికా పౌరులపై, అమెరికాకు చెందిన స్థావరాలపై, అమెరికా శ్రద్ధ కనిబరిచే అంశాలపై దక్షిణ ఆసియాలోని ఉగ్రవాదులు, తిరుగుబాటు సంస్థలు దాడులు చేసే ప్రమాదం ఉందని తమకు సమాచారం అందిన నేపథ్యంలో పైన పేర్కొన్న దేశాల్లో ప్రస్తుతం పర్యటించే ఆలోచనను విరమించుకోవాలని స్పష్టం చేసింది. అయితే, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న తమ పౌరులను హెచ్చరిస్తున్నామని, ప్రత్యేకంగా ఈ మూడు దేశాల్లోని వారికి ఒక సూచన చేస్తున్నట్లుగా చెప్పింది. పాకిస్థాన్‌లో అమెరికా పౌరులకు తీవ్ర వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.